చంద్రగిరి: హైదరాబాద్‌కు చెందిన రెండు వందల మంది వికలాంగులు శుక్రవారం కాలినడకన తిరుమలకు బయలుదేరారు. హైదరాబాద్‌కు చెందిన అష్టోత్తర చుక్కల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వేణుకుమార్ చుక్కల ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి 200 మంది వికలాంగులు, మరో వందమంది వాలంటీర్లు తిరుమలకు నడచి వెళ్లేందుకు శుక్రవారం శ్రీనివాసమంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు వద్దకు చేరుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి జెండా ఊపి వారి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ చుక్కల చారిటబుల్ ట్రాస్ట్ ఆధ్వర్యంలో ఇంతమంది కాలినడకన తిరుమలకు రావడం అభినందనీయమన్నారు.
వికలాంగ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి వారిని వారి స్వస్థలంకు చేరుకునే విధంగా టీటీడీ సహాయసహకారాలు అందజేస్తుందన్నారు. మనోనేత్రంతో దర్శించుకునేందుకు వెళుతున్న అంధులకు ఆ భగవంతుడి కృపాకటాక్షాలు ఉంటాయన్నారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ వేణుకుమార్ చుక్కల మాట్లాడుతూ తన జీవితంలో వికలాంగ భక్తులతో కలసి 1000 సార్లు శ్రీవారిని దర్శించుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టానన్నారు. తాను ఇప్పటి వరకు 150సార్లు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నానన్నారు.
కాలినడకతో శ్రీవారిని దర్శించుకున్న 200 మంది వికలాంగులు
Published Fri, Jul 3 2015 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM
Advertisement