by walking
-
విమానం ఎక్కకుండా ప్రపంచాన్ని చుట్టేశాడు
2013 అక్టోబర్ 10న డెన్మార్క్‌లోని ఇంటి నుంచి బయలుదేరాడు థోర్. 3,512 రోజుల తర్వాత 203 దేశాలు చూసి మే 23, 2023న మాల్దీవుల్లో యాత్ర ముగించాడు. విమానం ఎక్కకుండా ఇలా ప్రపంచాన్ని చుట్టినవాడు ఇతడే. ‘ఇన్ని దేశాలు తిరగడం ఎందుకు?’ అనంటే ‘అన్ని దేశాలు ఉన్నాయి కనుక’ అని జవాబు. జూన్ 13న మాల్దీవుల నుంచి ఇంటికి మరలుతున్నాడు థోర్. ‘తువాలు’, ‘టోంగా’, ‘సమోవా’, ‘పలావు’, ‘నౌరు’, ‘కిరిబటి’.... ఇవేంటని అనుకుంటున్నారా? దేశాలు. ఇవి మీరు విని ఉండొచ్చు. వినకపోయి ఉండొచ్చు. ఏమంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలు 193. ‘కాని ఇంకా ఉన్నాయి. అవి తమను తాము దేశాలుగా చెప్పుకుంటాయి. ఐక్యరాజ్యసమితి ఇంకా గుర్తించకపోవచ్చు’ అంటాడు థోర్. అందువల్ల థోర్ చుట్టి వచ్చిన దేశాల సంఖ్య అక్షరాలా 203. వీటిలో యూరప్ నుంచి 37, ఆసియా నుంచి 20, సౌత్ అమెరికా నుంచి 12, ఆఫ్రికా నుంచి 54... ఇలా ప్రపంచ పటంలోని అన్ని దేశాలు అతను చుట్టి వచ్చాడు. ► మనుషుల్ని కలవడానికి... ‘స్నేహితుడు అని ఎవర్ని అనాలంటే అప్పటి దాకా పరిచయం కాని అపరిచితుణ్ణే’ అనే స్లోగన్‌తో థోర్ తన ప్రపంచ యాత్ర మొదలెట్టాడు. డెన్మార్క్‌కు చెందిన 44 ఏళ్ల ఈ వివాహితుడు కొంతకాలం మిలట్రీలో, ఆ తర్వాత షిప్పింగ్ లాజిస్టిక్స్‌లో పని చేశాడు. దేశాలు చూడటం పిచ్చి. కొత్త మనుషుల్ని కలవడం ఇష్టం. అందుకని ప్రపంచంలోని అన్ని దేశాలు చుట్టి రావాలనుకున్నాడు. అయితే డబ్బు పరిమితుల దృష్ట్యా, ఎటువంటి సవాలుకు వీలులేని విమానయానం ద్వారా కాకుండా రైళ్లు, ఓడలు, వాహనాల ద్వారా ప్రపంచం చుట్టాలనుకున్నాడు. దాదాపు పదేళ్ల పాటు ఇంటి ముఖం చూడకుండా తిరిగేశాడు. ► రోజుకు 20 డాలర్లు డెన్మార్క్‌కు చెందిన కొన్ని సంస్థల స్పాన్సర్‌షిప్‌తో యాత్ర మొదలెట్టాడు థోర్. ప్రయాణానికి, తిండికి, వీసా ఫీజులకు కలిపి రోజుకు కేవలం 20 డాలర్లు (1600 రూపాయలు) ఖర్చు చేస్తూ ఈ యాత్ర సాగించాలనుకున్నాడు. దొరికిన తిండి తినడం, ఫ్రీగా బస పొందడం... లాంటి పనుల ద్వారా ఇది సాధ్యమే అనిపించాడు. అతని యాత్రను బ్లాగ్‌లో, ఫేస్బుక్లో రాస్తూ వెళ్లడం వల్ల చదివిన పాఠకులు ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ వెళ్లారు. దాంతో ఇన్ని రోజులు అతని విశ్వదర్శనం సాగింది. ‘ఒక్కో దేశంలో కేవలం 24 గంటలు మాత్రమే గడుపుతూ వెళ్లాను. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం ప్రయాణించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ దారిలో మనుషుల్ని కలవడమే ఇష్టపడ్డాను’ అంటాడు థోర్. అతను తన ప్రయాణంలో భాగంగా మన దేశానికి డిసెంబర్ 12, 2018న వచ్చాడు. ► ప్రతిదీ లెక్క థోర్ తన ప్రయాణంలో ప్రతిదీ రికార్డు చేశాడు. ఏ మోసం లేకుండా ఎక్కడికక్కడ టికెట్లు పెడుతూ వెళ్లాడు. తన మొత్తం ప్రయాణంలో 351 బస్సులు, 158 ట్రైన్లు, 43 టుక్‌టుక్‌లు (ఆటో), 37 కంటైనర్ షిప్‌లు, 33 పడవలు, 9 ట్రక్కులు, 3 సెయిల్బోట్లు, 2 క్రూయిజ్ షిప్‌లు ఉపయోగించాడు. మే 23న మాల్దీవుల్లో ఇతని యాత్ర ముగిసింది. అయితే ఇన్నాళ్లూ కుటుంబానికి దూరంగా ఉన్నాడా? లేదు. అతని భార్య అతణ్ణి వెతుక్కుంటూ వెళ్లి కలిసేది. మొత్తం ఇన్ని రోజుల్లో 27 చోట్ల 27 సార్లు కలిసిందామె. అన్నట్టు ఈ మొత్తం యాత్ర పేరు ‘ఒన్స్ అపాన్ ఏ సాగా’. -
కాలినడకన అటవీ గ్రామానికి..
గూడూరు: మహబూబాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన గూడూరు మండలంలోని అటవీ గ్రామం దొరవారి తిమ్మాపురానికి సరైన దారిలేదు. 20 కుటుంబాల్లోని 80 మంది గిరిజను లు పోడు వ్యవసాయం చేస్తుంటారు. రోడ్డు సౌకర్యం లేక వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం బుధవారం కొత్తగూడ పర్యటనకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి వచ్చింది. దీంతో ఆమె స్పందించి ఊరి సమస్యలపై నివేదిక అందజేయాలని కలెక్టర్ గౌతమ్‌ను ఆదేశించారు. ఆయన అక్కడికక్కడే తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, ఇతర అధికారులతో సమావేశమై గ్రామ సమస్యల గురించి ప్రశ్నించగా.. తామంతా కొత్తగా వచ్చినందున అవగాహన లేదని చెప్పారు. దీంతో గురువారం అందరూ గ్రామానికి వెళ్లాలని ఆదేశించా రు. ఈ మేరకు ఉదయమే తహసీల్దార్ శైలజ, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీఓ ప్రసాదరావు ఊట్ల మీదుగా 6 కి.మీ. వాహనాలపై వెళ్లారు. అక్కడి నుంచి సుమారు కాలినడకన 8 కి.మీ. వెళ్తూ మార్గమధ్యలో వాగు దాటి ముందుకుసాగారు. దొరవారి తిమ్మాపురానికి చేరుకుని గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చదవండి: ఐదు రోజుల పెళ్లి, అక్కడ వరుడు తాళి కట్టడు! -
కాలినడకన తిరుమల చేరుకున్న వైవీ సుబ్బారెడ్డి
-
శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ జగన్
-
శ్రీవారి దర్శనానికి బయల్దేరిన వైఎస్ జగన్
-
తిరుమల చేరుకున్న వైఎస్ జగన్..
-
‘వైజాగ్‌లో వైఎస్ జగన్‌ను స్వామివారే కాపాడారు’
సాక్షి, తిరుపతి: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ అలిపిరి నుంచి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. అడుగడుగునా భక్తులకు అభివాదం చేస్తూ.. ఒక సామాన్య భక్తుడిలా ఆయన ముందుకు సాగారు. మార్గమధ్యలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొబ్బరికాయ కొట్టారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. మరికాసేపట్లో ఆయన స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి.. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దేశ చరిత్రలో ఓ అద్భుతమని అన్నారు. కోటిన్నర మంది ప్రజలు ఆయనను నేరుగా కలవడం.. ప్రసంగాలు వినడం.. సమస్యలు చెప్పుకోవడం జరిగిందని తెలిపారు. కష్టం అంటే తెలియని కుటుంబంలో పుట్టిన వైఎస్ జగన్.. ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాసంకల్పయాత్ర చేపట్టారు. 14 నెలల పాదయాత్రలో వైఎస్ జగన్ పరిపూర్ణ నాయకుడిగా ఎదిగారని అన్నారు. తన కోసం కాకుండా.. రాష్ట్ర ప్రజలను కష్టాలను తొలగించమని కోరుకుంటూ స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఆయన తిరుమలకు వచ్చారని తెలిపారు. వైఎస్ జగన్ కుటుంబానికి దూరంగా, ఎండ, వాన, చలి లెక్క చేయకుండా ప్రజల మధ్య ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం తపించారని గుర్తుచేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అరాచక పాలనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో చేపట్టారని తెలిపారు. ఈ పాదయాత్రలో ఆయనను భూమిపై లేకుండా చేసేందుకు విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగని హత్యాయత్నం జరిగిందని గుర్తుచేశారు. కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని బయలుదేరిన వైఎస్ జగన్‌ను వైజాగ్‌లో స్వామివారే కాపాడి.. నేడు తిరుపతికి వచ్చి మొక్కు తీర్చుకునే అవకాశం కల్పించారని అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఎప్పుడు సామాన్యునిలానే ఉంటారని.. చంద్రబాబులా ప్రజలను చూసి విసుగు చెందరని తెలిపారు. వైఎస్ జగన్ సామాన్యునిలా వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇటువంటి నాయకుని ఆధ్వర్యంలో పనిచేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత వైఎస్ జగన్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చారని అన్నారు. వైఎస్ జగన్‌కు తప్పకుండా స్వామివారి ఆశీస్సులు ఉంటాయని.. ఆయన సీఎం కావాలనే ప్రజల అందరి కోరికను భగవంతుడు నెరవేరుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. అబద్దాలు చెబతూ, అక్రమాలకు పాల్పడే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వామివారు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు తీర్చమని శ్రీవారిని కోరడానికే వైఎస్ జగన్ ఓ సామాన్య భక్తుడిలా ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. టీడీపీ చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. 600 హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ది కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది కేవలం వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. టీడీపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇచ్ఛాపురంలో వైఎస్ జగన్ బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజలను చూసి ఓర్వలేక మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రముఖ నటుడు విజయ్‌చందర్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ విజయ సంకల్పం అద్వితీయం అన్నారు. తన జన్మలో ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని చూసినందుకు ఆనందంగా ఉందన్నారు.14 నెలలు.. 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలంటే ఎంతో ఓపిక, సహనం ఉండాలని.. అవన్నీ వైఎస్ జగన్‌లో ఉన్నాయని తెలిపారు. -
ప్రజాసంకల్పయాత్ర దేశ చరిత్రలో ఓ అద్భుతం
-
శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించిన వైఎస్ జగన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఇతర భక్తులకు ఇబ్బంది కలుగకుండా సామాన్య భక్తుడిలా క్యూలైన్లో వెళ్లి ఆయన శ్రీవారి దర్శించుకున్నారు. వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వైఎస్ జగన్ తిరుమలలోని విశాఖ శారదా పీఠం చేరుకున్నారు. అక్కడ పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ జగన్ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేయనున్న ఆయన.. శుక్రవారం ఉదయం ఇడుపులపాయకు వెళ్లనున్నారు. సుదీర్ఘమైన ప్రజాసంకల్పయాత్రను పూర్తిచేసి చరిత్ర సృష్టించిన ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం ఉదయం తిరుపతికి చేరుకున్నారు. పద్మావతి గెస్ట్‌హౌస్ నుంచి అలిపిరి చేరుకున్న వైఎస్ జగన్.. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన బయలుదేరారు. అలిపిరి పాదాల మండపం దగ్గర తొలిమెట్టుకు నమస్కరించిన ఆయన.. శ్రీనివాసుడి దర్శనం కోసం నడక ప్రారంభించారు. పెద్దసంఖ్యలో అభిమానులు ఆయన వెంట కదిలారు. ఈ సందర్భంగా గోవిందనామస్మరణతో కాలినడక మార్గమంతా మార్మోగిపోయింది. దారిపొడువునా భక్తులకు అభివాదం చేస్తూ.. సామాన్య భక్తుడిలా ముందుకుసాగిన జననేత.. మార్గమధ్యలో ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ జననేత కొబ్బరికాయ కొట్టారు. తర్వాత నరసింహస్వామి ఆలయంలో వైఎస్ జగన్ పూజలు చేశారు. వడివడిగా మెట్లు ఎక్కిన ఆయన ఎక్కడా ఆగకుండా ముందుకు కదిలారు. అలుపులేకుండా పాదయాత్ర నిర్వహించిన జననేత.. తిరుమల మెట్లు ఎక్కడంలోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించారు. మెట్ల దారిలో సాటి భక్తులను పలుకరిస్తూ.. వారికి ఆత్మీయంగా అభివాదం చేస్తూ ముందుకు కదిలిన వైఎస్ జగన్.. మర్గమధ్యలో నరసింహా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మోకాళ్ల పర్వతం నుంచి తిరుమల చేరుకున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. వైఎస్ జగన్ రాకపై భక్తులు, తిరుపతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు వైఎస్ జగన్‌కు, ఆయన కుటుంబానికి ఎల్లవేళలా ఉంటాయని అంటున్నారు. చిన్న వయస్సులోనే ఎన్నో బాధలు ఎదుర్కొని తండ్రి చూపిన బాటలో ప్రజాశ్రేయస్సు కోసం వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టారని అన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా ప్రజలను కుటుంబంగా భావించి వారి కష్టాను తీర్చాడానికి ముందుకు సాగుతూనే ఉన్నారని తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని అన్నారు. వైఎస్ జగన్‌తో కలిసి పది అడుగులు వేసిన తమ అదృష్టంగా భావిస్తామన్నారు. రేణిగుంటలో... వైఎస్ జగన్ ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో రేణిగుంట చేరుకున్నారు. దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో ఇక్కడికి వచ్చిన జననేతకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు తరలివచ్చిన జనంతో రేణిగుంట రైల్వే స్టేషన్ కిక్కిరిసింది. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. జై జగన్ నినాదాలతో రైల్వే స్టేషన్ ప్రాంగణం మార్మోగింది. సీఎం జగన్ అంటూ రైల్వేస్టేషన్లో ఉన్న వారితో పాటు, రైలులో ఉన్న ప్రయాణికులు నినదించడం విశేషం. -
కాలినడకన కొండపైకి బయల్దేరిన వైఎస్ జగన్
-
కాలినడకన తిరుమలకు వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం మధ్యాహ్నం అలిపిరి చేరుకున్నారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సామాన్య భక్తుడిలా కాలినడకన తిరుమలకు బయలు దేరారు. మెట్ల మార్గంలో కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించారు. సాయంత్రానికి కొండ మీదకు చేరుకుంటారు. ఆయన వెంట తిరుమల వెళ్లేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. గోవింద నామ స్మరణతో ముందుకు సాగుతున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పార్టీ శ్రేణులను వైఎస్ జగన్ ఆదేశించారు. సాయంత్రం స్వామి వారిని దర్శించుకున్న తర్వాత శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ రోజు రాత్రి సర్వదర్శనం ద్వారా స్వామివారిని వైఎస్ జగన్ దర్శించుకుంటారు. రాత్రి తిరుమలలో బసచేసి శుక్రవారం ఉదయం తిరుమల నుంచి బయలుదేరి కడప మీదుగా పులివెందులకు చేరుకుంటారు. -
కాలినడకన తిరుమలకు వైఎస్ జగన్
-
కాలినడకతో శ్రీవారిని దర్శించుకున్న 200 మంది వికలాంగులు
చంద్రగిరి: హైదరాబాద్‌కు చెందిన రెండు వందల మంది వికలాంగులు శుక్రవారం కాలినడకన తిరుమలకు బయలుదేరారు. హైదరాబాద్‌కు చెందిన అష్టోత్తర చుక్కల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వేణుకుమార్ చుక్కల ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి 200 మంది వికలాంగులు, మరో వందమంది వాలంటీర్లు తిరుమలకు నడచి వెళ్లేందుకు శుక్రవారం శ్రీనివాసమంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు వద్దకు చేరుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి జెండా ఊపి వారి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ చుక్కల చారిటబుల్ ట్రాస్ట్ ఆధ్వర్యంలో ఇంతమంది కాలినడకన తిరుమలకు రావడం అభినందనీయమన్నారు. వికలాంగ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి వారిని వారి స్వస్థలంకు చేరుకునే విధంగా టీటీడీ సహాయసహకారాలు అందజేస్తుందన్నారు. మనోనేత్రంతో దర్శించుకునేందుకు వెళుతున్న అంధులకు ఆ భగవంతుడి కృపాకటాక్షాలు ఉంటాయన్నారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ వేణుకుమార్ చుక్కల మాట్లాడుతూ తన జీవితంలో వికలాంగ భక్తులతో కలసి 1000 సార్లు శ్రీవారిని దర్శించుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టానన్నారు. తాను ఇప్పటి వరకు 150సార్లు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నానన్నారు.