ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించిన వైఎస్ జగన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఇతర భక్తులకు ఇబ్బంది కలుగకుండా సామాన్య భక్తుడిలా క్యూలైన్‌లో వెళ్లి ఆయన శ్రీవారి దర్శించుకున్నారు.