సాక్షి, ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కుమారుడు ర్యాన్ పెద్ద మనసుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేషనల్ కేన్సర్ అవేర్‌నెస్ డే (నవంబర్ 7) సందర్భంగా కేన్సర్ బాధితుల కోసం తన జుట్టును దానం చేయడం విశేషంగా నిలిచింది. స్వయంగా మాధురీ దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. (Kamal Haasan: తొలి భారతీయుడిగా కమల్ మరో సంచలనం)
అలనాటి అందాల నటి, డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్, శ్రీరామ్ నెనె దంపతుల చిన్న కుమారుడు ర్యాన్ తన పొడవైన జుట్టును కీమో థెరపీ చేయించుకున్న పేషెంట్ల కోసం డొనేట్ చేశాడు. సెలూన్‌లో ర్యాన్ హెయిర్‌కట్ చేయించుకుంటున్న వీడియోను షేర్ చేశారు మాధురి. కేన్సర్ బారిన పడి కీమో థెరపీ చేయించుకున్న వారిని చూసి ర్యాన్ చలించి పోయాడు. అందుకే కీమో ద్వారా జుట్టును కోల్పోయిన వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా తన జుట్టును కేన్సర్ సొసైటీకి దానం చేయాలనుకున్నాడని మాధురి తెలిపారు. ఇది విని తాము చాలా ఆశ్చర్యపోయామని, దాదాపు రెండు సంవత్సరాలుగా పెంచు కుంటున్న తన జుట్టును డొనేట్ చేయడంపై చాలా గర్వ పడుతున్నామని మాధురి పేర్కొన్నారు. ర్యాన్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment