Ryan
-
నా కొడుకు గుండె పగిలింది, అందుకే : హీరోయిన్
సాక్షి, ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కుమారుడు ర్యాన్ పెద్ద మనసుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేషనల్ కేన్సర్ అవేర్నెస్ డే (నవంబర్ 7) సందర్భంగా కేన్సర్ బాధితుల కోసం తన జుట్టును దానం చేయడం విశేషంగా నిలిచింది. స్వయంగా మాధురీ దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. (Kamal Haasan: తొలి భారతీయుడిగా కమల్ మరో సంచలనం) అలనాటి అందాల నటి, డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్, శ్రీరామ్ నెనె దంపతుల చిన్న కుమారుడు ర్యాన్ తన పొడవైన జుట్టును కీమో థెరపీ చేయించుకున్న పేషెంట్ల కోసం డొనేట్ చేశాడు. సెలూన్లో ర్యాన్ హెయిర్‌కట్ చేయించుకుంటున్న వీడియోను షేర్ చేశారు మాధురి. కేన్సర్ బారిన పడి కీమో థెరపీ చేయించుకున్న వారిని చూసి ర్యాన్ చలించి పోయాడు. అందుకే కీమో ద్వారా జుట్టును కోల్పోయిన వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా తన జుట్టును కేన్సర్ సొసైటీకి దానం చేయాలనుకున్నాడని మాధురి తెలిపారు. ఇది విని తాము చాలా ఆశ్చర్యపోయామని, దాదాపు రెండు సంవత్సరాలుగా పెంచు కుంటున్న తన జుట్టును డొనేట్ చేయడంపై చాలా గర్వ పడుతున్నామని మాధురి పేర్కొన్నారు. ర్యాన్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
ఈ బుడతడి సంపాదన రూ. 26 విలియన్ డాలర్లు?!
ఆడుకుంటున్న వయసులోనే ఓ బాలుడు కోట్లు గడిస్తూ సంపన్నుల జాబితాలో చేరాడు. యూట్యూబ్‌లో తన పేరు మీద ఉన్న ఛానల్ ద్వారా అత్యధిక సంపాదన కలిగిన యూట్యూబర్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ విషయాన్ని ఫోర్బ్స్ పత్రిక బుధవారం వెల్లడించింది. ఇక తను ఆడుకునే వీడియోలను షేర్ చేస్తూ.. దాదాపు 26 మిలియన్ల డాలర్లు సంపాదించి ఈ ఘనత సాధించాడు. టెక్సాస్‌కు చెందిన ఈ బాలుడి పేరు ర్యాన్ కాజి. తన పేరు మీద అతని తల్లిదండ్రులు ‘ర్యాన్ వరల్డ్’ అనే చానెల్‌ను 2015లో క్రియేట్ చేశారు. ర్యాన్ ఆడుకుంటున్న వీడియోలను ఈ చానెల్లో షేర్ చేసేవారు. ఈ చానెల్ స్థాపించిన మూడు సంవత్సరాలకే 22.9 మిలియన్ల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. అయితే మొదట్లో ర్యాన్ వీడియోస్ అంతగా ఆదరణ ఉండేది కాదట. అయితే ఓ సారి ఈ బాలుడు ‘ర్యాన్ ఫిక్సర్’ అనే కారు బొమ్మకు రివ్యూ చెప్పాడు. ఆ వీడియో బాగా వైరల్ కావడంతో ర్యాన్ సెలబ్రిటీగా మారిపోయాడు. అలాగే మరిన్ని కారు బొమ్మలకు రివ్యూలు చెప్పడం మొదలు పెట్టాడు. తద్వారా నెటిజన్ల ఆదరణతో పాటు వివిధ బొమ్మల కంపెనీల నుంచి ఆఫర్లు అందకున్నాడు. అలా ‘ర్యాన్ వరల్డ్’గా ఉన్న ఈ ఛానల్‌ను ‘ర్యాన్ టాయ్ రివ్యూ’ అనే పేరుగా మార్చారు. ఈ క్రమంలో ర్యాన్ ఒక్కో వీడియోకు కనీసం బిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ ఏడాది ఈ బాలుడు ఏకంగా రూ. 26 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఇక ర్యాన్ ఛానల్‌కు, వీడియోస్‌కు వస్తున్న పాపులారిటీ దృష్ట్యా బొమ్మల వీడియోలతో పాటు, చదువుకు సంబంధించిన వీడియోలు కూడా చేయాలంటూ ప్రతిపాదనలు కూడా రావడం విశేషం. -
వయసు ఏడేళ్లు... సంపాదన రూ.150 కోట్లు!
వాషింగ్టన్ : మిలియనీర్‌గా ఎదగడానికి ఒక వ్యక్తికి కనీసంలో కనీసం ముప్పై ఏళ్లైనా పడుతుంది. కానీ అమెరికాకు చెందిన ర్యాన్ అనే ఏడేళ్ల కుర్రాడు మాత్రం కేవలం ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.150 కోట్లుతో పాటు, సోషల్ మీడియాలో కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. యూట్యూబ్ చానల్‌తో... ప్రస్తుతం ఎంతో మంది ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్న యూట్యూబ్‌నే ర్యాన్ సైతం తన సంపాదనకు ఉపయోగించుకున్నాడు. 2015లో ఈ చిన్నోడు.. ‘ర్యాన్ టాయ్స్ రివ్యూ’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. రోజూ చిన్నారుల బొమ్మల వీడియోలు అప్లోడ్ చేసేవాడు. కొద్దిరోజుల్లో ఈ వీడియోలకు అభిమానులు పెరిగిపోయారు. ఇప్పుడవే వీడియోలు కోట్ల రూపాయలు కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ర్యాన్ చానల్‌ను దాదాపు కోటికి పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు. ఫోర్బ్స్ జాబితాలో తొలి స్థానం.. యూట్యూబ్ ద్వారా ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న వారి జాబితాలో ర్యాన్ తొలి స్థానం సంపాదించుకున్నాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ వివరాలు ప్రకటించింది. ఈ జాబితాలో గతేడాది 8వ స్థానంలో నిలిచిన ర్యాన్.. ఈసారి తన సంపాదన రెట్టింపు చేసుకున్నాడు. బొమ్మలతో వీడియోలు... అందరు చిన్నారుల్లాగే నచ్చిన బొమ్మలతో ఆడుకుంటూనే ర్యాన్ కోటీశ్వరుడయ్యాడు. అయితే ర్యాన్ ఆ బొమ్మలతో వీడియో కెమెరాల ముందు ఆడుకుంటాడు. కొత్తగా వచ్చే రకరకాల బొమ్మలపై రివ్యూలు ఇస్తుంటాడు. అవి ఎలా పనిచేస్తాయో అందులో వివరిస్తాడు. ఆ వీడియోల్ని తన చానెల్లో పోస్ట్ చేయగా వాటిని కొన్ని లక్షల మంది చూడటం వల్ల లెక్కలేనన్ని యాడ్స్ వచ్చాయి. దీంతో ర్యాన్ ఖాతాలోకి ఆదాయం వచ్చి చేరింది. -
అద్భుతం: వాల్‌మార్ట్‌తో ఆరేళ్ల బాలుడి డీల్!
న్యూఢిల్లీ : ముద్దులొలికే మాటలతో అలరించే ఓ ఆరేళ్ల బాలుడు అద్భుతం చేశాడు. అమెరికాకు చెందిన అతిపెద్ద రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. యూట్యూబ్‌లో టోయస్(బొమ్మలను) సమీక్షించే ఆరేళ్ల బాలుడు ర్యాన్, ఏకంగా తన సొంత టోయస్ బ్రాండులను మార్కెట్లోకి తీసుకొచ్చి విక్రయించడం మొదలుపెట్టాడు. దీని కోసం వాల్‌మార్ట్‌కు చెందిన 2500 అమెరికా స్టోర్లతో, వెబ్‌సైట్‌తో సోమవారం డీల్ కుదుర్చుకున్నాడు. యూట్యూబ్ ఛానల్ ర్యాన్ టోయస్రివ్యూకు ఈ అబ్బాయే స్టార్. గతేడాది 8వ బెస్ట్ పెయిడ్ యూట్యూబర్‌గా కూడా నిలిచాడు. యూట్యూబ్‌లో టోయిస్లను రివ్యూ చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ ర్యాన్ యూట్యూబ్ టోయస్రివ్యూ ఛానల్‌కు 15 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. టోయస్తో ఆడుకుంటూ.. వాటికి అనుగుణంగా స్పందించే ర్యాన్ వీడియోలకు నెలకు 1 బిలియన్కు పైగా వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో టోయస్ రివ్యూ చేస్తూనే.. ఈ బాలుడు మిలీనియర్ అయ్యాడు. గతేడాది 11 మిలియన్ డాలర్లను ఆర్జించాడు. 2015 మార్చి నుంచి ర్యాన్ ఫ్యామిలీ ఆ బాలుడి వీడియోలను రికార్డు చేయడం, పోస్ట్ చేయడం చేస్తోంది. లిగో బ్యాక్స్ తెరవడం, దానితో ఆడటం ఈ బాలుడి తొలి వీడియో. మూడేళ్ల వయసులో దీన్ని యూట్యూబ్‌లో పెట్టారు. ఇలా ర్యాన్ యూట్యూబ్ స్టార్‌గా మారిపోయాడు. దీంతో తన సొంత బ్రాండ్ టోయస్‌నే ఏకంగా మార్కెట్లోకి తీసుకొస్తున్నాడు. అక్టోబర్‌లో తన టోయస్ వ్యాపారాన్ని మరింత విస్తరించనున్నట్టు ర్యాన్ చెబుతున్నాడు. కాగ, యూట్యూబ్ స్టార్ల రీచ్‌ను విస్తరించడానికి వారితో పాకెట్.వాచ్ లైసెన్స్ డీల్స్ చర్చలు కూడా జరిపింది. టోయస్, అప్పీరల్, హోమ్ ప్రొడక్ట్‌లకు వీరి రీచ్‌ను విస్తరించాలనుకుంది. ర్యాన్ వరల్డ్ వర్తకం మూడేళ్లు, ఆపై వారికి డిజైన్ చేస్తూ మార్కెట్లోకి వచ్చింది. ర్యాన్‌కు ఇష్టమైన వాటిలో పిజ్జాలు కూడా ఉన్నాయి. -
వంటగ్యాస్ లీకై..
తుమకూరు: వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించి ముగ్గురు గాయపడ్డారు. స్థానిక తిలక్ పార్క్ పోలీసుల సమాచారం మేరకు... రాజీవ్ గాంధీ నగర్‌కు చెందిన ఆరీఫ్వుల్లా ఇంటిలో శనివారం ఉదయం అతని భార్య రియాన్ వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయింది. ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు భగ్గున ఎగిసిపడ్డాయి. ఆమెను కాపాడేందుకు ఇంటిలో ఉన్న ఆరీఫ్ వుల్లా, అతని కుమార్తె తమన్నా కౌన్సర్ ప్రయత్నించి వారూ గాయపడ్డారు. విషయాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.