వంటగ్యాస్ లీకై.. | Cooking gas leak | Sakshi
Sakshi News home page

వంటగ్యాస్ లీకై..

Published Sun, Feb 22 2015 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

Cooking gas leak

తుమకూరు:  వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించి ముగ్గురు గాయపడ్డారు. స్థానిక తిలక్ పార్క్ పోలీసుల సమాచారం మేరకు... రాజీవ్ గాంధీ నగర్‌కు చెందిన ఆరీఫ్‌వుల్లా ఇంటిలో శనివారం ఉదయం అతని భార్య రియాన్ వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయింది. ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు భగ్గున ఎగిసిపడ్డాయి.

ఆమెను కాపాడేందుకు ఇంటిలో ఉన్న ఆరీఫ్ వుల్లా, అతని కుమార్తె తమన్నా కౌన్సర్ ప్రయత్నించి వారూ గాయపడ్డారు. విషయాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement