ఆడుకుంటున్న వయసులోనే ఓ బాలుడు కోట్లు గడిస్తూ సంపన్నుల జాబితాలో చేరాడు. యూట్యూబ్‌లో తన పేరు మీద ఉన్న ఛానల్ ద్వారా అత్యధిక సంపాదన కలిగిన యూట్యూబర్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ విషయాన్ని ఫోర్బ్స్ పత్రిక బుధవారం వెల్లడించింది. ఇక తను ఆడుకునే వీడియోలను షేర్ చేస్తూ.. దాదాపు 26 మిలియన్ల డాలర్లు సంపాదించి ఈ ఘనత సాధించాడు. టెక్సాస్‌కు చెందిన ఈ బాలుడి పేరు ర్యాన్ కాజి. తన పేరు మీద అతని తల్లిదండ్రులు ‘ర్యాన్ వరల్డ్’ అనే చానెల్‌ను 2015లో క్రియేట్ చేశారు. ర్యాన్ ఆడుకుంటున్న వీడియోలను ఈ చానెల్‌లో షేర్ చేసేవారు. ఈ చానెల్ స్థాపించిన మూడు సంవత్సరాలకే 22.9 మిలియన్ల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.
అయితే మొదట్లో ర్యాన్ వీడియోస్ అంతగా ఆదరణ ఉండేది కాదట. అయితే ఓ సారి ఈ బాలుడు ‘ర్యాన్ ఫిక్సర్’ అనే కారు బొమ్మకు రివ్యూ చెప్పాడు. ఆ వీడియో బాగా వైరల్ కావడంతో ర్యాన్ సెలబ్రిటీగా మారిపోయాడు. అలాగే మరిన్ని కారు బొమ్మలకు రివ్యూలు చెప్పడం మొదలు పెట్టాడు. తద్వారా నెటిజన్ల ఆదరణతో పాటు వివిధ బొమ్మల కంపెనీల నుంచి ఆఫర్లు అందకున్నాడు. అలా ‘ర్యాన్ వరల్డ్’గా ఉన్న ఈ ఛానల్‌ను ‘ర్యాన్ టాయ్ రివ్యూ’ అనే పేరుగా మార్చారు. ఈ క్రమంలో ర్యాన్ ఒక్కో వీడియోకు కనీసం బిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ ఏడాది ఈ బాలుడు ఏకంగా రూ. 26 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఇక ర్యాన్ ఛానల్‌కు, వీడియోస్‌కు వస్తున్న పాపులారిటీ దృష్ట్యా బొమ్మల వీడియోలతో పాటు, చదువుకు సంబంధించిన వీడియోలు కూడా చేయాలంటూ ప్రతిపాదనలు కూడా రావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment