ర్యాన్ ఆరేళ్ల పుట్టినరోజు వేడుకలు
న్యూఢిల్లీ : ముద్దులొలికే మాటలతో అలరించే ఓ ఆరేళ్ల బాలుడు అద్భుతం చేశాడు. అమెరికాకు చెందిన అతిపెద్ద రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. యూట్యూబ్‌లో టోయస్(బొమ్మలను) సమీక్షించే ఆరేళ్ల బాలుడు ర్యాన్, ఏకంగా తన సొంత టోయస్ బ్రాండులను మార్కెట్‌లోకి తీసుకొచ్చి విక్రయించడం మొదలుపెట్టాడు. దీని కోసం వాల్‌మార్ట్‌కు చెందిన 2500 అమెరికా స్టోర్లతో, వెబ్‌సైట్‌తో సోమవారం డీల్ కుదుర్చుకున్నాడు.
యూట్యూబ్ ఛానల్ ర్యాన్ టోయస్‌రివ్యూకు ఈ అబ్బాయే స్టార్. గతేడాది 8వ బెస్ట్ పెయిడ్ యూట్యూబర్‌గా కూడా నిలిచాడు. యూట్యూబ్‌లో టోయిస్‌లను రివ్యూ చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ ర్యాన్ యూట్యూబ్ టోయస్‌రివ్యూ ఛానల్‌కు 15 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లున్నారు. టోయస్‌తో ఆడుకుంటూ.. వాటికి అనుగుణంగా స్పందించే ర్యాన్ వీడియోలకు నెలకు 1 బిలియన్‌కు పైగా వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో టోయస్ రివ్యూ చేస్తూనే.. ఈ బాలుడు మిలీనియర్ అయ్యాడు. గతేడాది 11 మిలియన్ డాలర్లను ఆర్జించాడు.
2015 మార్చి నుంచి ర్యాన్ ఫ్యామిలీ ఆ బాలుడి వీడియోలను రికార్డు చేయడం, పోస్ట్ చేయడం చేస్తోంది. లిగో బ్యాక్స్ తెరవడం, దానితో ఆడటం ఈ బాలుడి తొలి వీడియో. మూడేళ్ల వయసులో దీన్ని యూట్యూబ్‌లో పెట్టారు. ఇలా ర్యాన్ యూట్యూబ్ స్టార్‌గా మారిపోయాడు. దీంతో తన సొంత బ్రాండ్ టోయస్‌నే ఏకంగా మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాడు. అక్టోబర్లో తన టోయస్ వ్యాపారాన్ని మరింత విస్తరించనున్నట్టు ర్యాన్ చెబుతున్నాడు.
కాగ, యూట్యూబ్ స్టార్ల రీచ్‌ను విస్తరించడానికి వారితో పాకెట్.వాచ్ లైసెన్స్ డీల్స్ చర్చలు కూడా జరిపింది. టోయస్, అప్పీరల్, హోమ్ ప్రొడక్ట్‌లకు వీరి రీచ్‌ను విస్తరించాలనుకుంది. ర్యాన్ వరల్డ్ వర్తకం మూడేళ్లు, ఆపై వారికి డిజైన్ చేస్తూ మార్కెట్‌లోకి వచ్చింది. ర్యాన్‌కు ఇష్టమైన వాటిలో పిజ్జాలు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment