
అమెరికన్ సిట్ కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' సిరీస్ ప్రస్తుతం బి-టౌన్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇందులోని ఓ ఎపిసోడ్‌లో బాలీవుడ్ బ్యూటీ మాధురి దీక్షిత్‌ను కించపరిచారంటూ ఇప్పటికే ఎంపీ, బాలీవుడ్ నటి జయబచ్చన్ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో మరో పొలిటిషియన్ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌కు లీగల్ నోటీసులు పంపి షాకిచ్చాడు. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’లోని ఒక ఎపిసోడ్‌లో మాధురీ దీక్షిత్‌ను సూచించేందుకు అవమానకరమైన పదాన్ని వినియోగించారని రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్ మండపడ్డారు.
చదవండి: బిగ్‌బాస్ 7లోకి బుల్లితెర హీరో అమర్‌దీప్.. క్లారిటీ ఇచ్చిన నటుడు
వెంటనే ఆ ఎపిసోడ్‌ను తొలగించాల్సిందిగా నెట్‌ఫ్లిక్స్‌పై దావా వేశారు. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నటించిన రాజ్ షెల్డన్ కూపర్‌గా నటించిన జిమ్ పార్సన్స్ ఐశ్వర్యరాయ్‌ని మాధురి దీక్షిత్‌తో పోలుస్తాడు. ఒక సన్నివేశంలో ఐశ్వర్యను పేదోడి ‘మాధురీ దీక్షిత్’ అని పేర్కొంటాడు. దీనికి మరో పాత్రధారి రాజ్ కూత్రపల్లి క్యారెక్టర్‌ను పోషించిన కునాల్ నయ్యర్.. కుష్టురోగి వంటి మాధురీ దీక్షిత్‌తో పోలిస్తే ఎలా? ఐశ్వర్య ఒక దేవత’ అని అంటాడు. దీనిపై మిథున్ కుమార్ స్పందిస్తూ.. ఈ సిరీస్‌లో స్త్రీ ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారని.. వ్యక్తులను కించపరిచే భాష వాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అదే విధంగా ఆయన ఓ ప్రకటన ఇచ్చారు.
చదవండి: బిగ్‌బాస్ అలీ రేజాతో రొమాంటిక్ సీన్‌పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్
‘‘తాము చేసే పనులకు జవాబుదారీగా ఉండడం, స్ట్రీమింగ్‌లో సామాజిక, సాంస్కృతిక విలువలను కించపరచకుండా, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవడం నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద సంస్థలకు ఇది చాలా ముఖ్యం. స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్లు తమ ప్లాట్‌ఫారమ్‌లలో అందించే కంటెంట్‌ను జాగ్రత్తగా పరిశీలించి ప్రసారం చేయాల్సిన బాధ్యత ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అవమానకరమైన, అభ్యంతరకరమైన లేదా పరువు నష్టం కలిగించే కంటెంట్ లేదని నిర్ధారించాకే స్ట్రీమింగ్ చేయాలి. నెట్‌ఫ్లిక్స్ - ‘బిగ్ బ్యాంగ్ థియరీ’లోని షోలలో ఒకదానిలో అవమానకరమైన పదాన్ని ఉపయోగించడం వల్ల నేను చాలా బాధపడ్డాను. ఆ పదాన్ని ప్రజల నుంచి ఎన్నో ప్రశంసలు, భారీగా అభిమానులు ఉన్న నటి మాధురీ దీక్షిత్‌ను ఉద్దేశించి ఉపయోగించారు. ఇది అత్యంత అభ్యంతరకరం, తీవ్రంగా బాధించేది మాత్రమే కాకుండా ఆమె ఆత్మ గౌరవాన్ని, పరువును కించపరిచేలా ఉంది’’ అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. మరి నెట్ ప్లిక్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment