మాధురి దీక్షిత్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆమె పేరు ముందు వరుసలో ఉంటుంది. 1990ల్లో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 1967 మే 15న ముంబయిలో జన్మించింది. మైక్రో బయాలజిస్ట్ కావాలనుకున్న మాధురి దీక్షిత్.. మూడేళ్ల వయసులోనే డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఎనిమిదేళ్ల వయసులోనే కథక్ నృత్యాన్ని నేర్చుకుంది. బాలీవుడ్ డ్యాన్స్ క్వీన్‌గా పేరు సంపాదించింది. బాలీవుడ్‌లో అగ్ర హీరోలందరితో నటించిన ఆమె ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. ఇవాళ ఆమె 56వ బర్త్ డే సందర్బంగా ప్రత్యేక కథనం.
(ఇది చదవండి: నరేశ్-పవిత్ర.. వారి బంధానికి ఇంతకన్నా ఏం కావాలి?)
1984లో అబోద్ అనే సినిమాతో మాధురి దీక్షిత్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్నిసినిమాల్లో సహాయ నటిగా చేసిన మాధురి..తేజాబ్ సినిమాలో ముఖ్య పాత్ర పొషించారు. ఈ సినిమా ఆమెకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ చిత్రమం మొదటి ఫిలింఫేర్ నామినేషన్‌కు కూడా ఎంపికైంది. ఆ తర్వాత రాం లఖాన్ (1989), పరిందా (1989), త్రిదేవ్ (1989), కిషన్ కన్హయ్యా (1990) వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. బాలీవుడ్‌లో శ్రీదేవి కంటే ఎక్కువగా మాధురి పాపులారిటీ సాధించింది.
(ఇది చదవండి: ఏజెంట్‌పై ఫలితంపై అఖిల్ రియాక్షన్..)
1990లో దీక్షిత్ ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన దిల్ అనే ప్రేమ కథా చిత్రంలో ఆమిర్ ఖాన్ సరసన నటించారు. ఈ సినిమా ఆమె కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా మొట్ట మొదటి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా తెచ్చి పెట్టింది. ఆ తర్వాత సాజన్ (1991), బేటా(1992), ఖల్ నాయక్ (1993), హం ఆప్కే హై కౌన్ (1994), రాజా (1995) వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. బేటా చిత్రంలో చదువురాని అమాయకుడికి భార్యగా నటించిన పాత్రకి రెండో ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.
1999లో డాక్టర్ శ్రీరామ్ నేనేను మాధురి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు. దాదాపు ఓ దశాబ్దానికి పైగా అక్కడే నివసించారు. ఈ జంటకు అరిన్, ర్యాన్ అనే ఇద్దరు కుమారులు సంతానం. ప్రస్తుతం మాధురి దీక్షిత్ రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ది నేమ్ ఫేమ్‌తో అభిమానులను పలకరించింది. బాలీవుడ్‌లో దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్‌గా రాణించిన మాధురికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment