
Japan Billionaire in a letter addressed to Ukraines President: జపనీస్ బిలియనీర్ ఇ-కామర్స్ దిగ్గజం రకుటెన్ వ్యవస్థాపకుడు హిరోషి మిక్కి మికిటాని ఉక్రెయిన్ ప్రభుత్వానికి రూ. 65 కోట్లు విరాళంగా అందిస్తానని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి రాసిన లేఖలో తెలిపారు. అంతేకాదు ఉక్రెయిన్‌లో హింసకు గురైన వ్యక్తులకు సహాయం చేయడానికి, మానవతా కార్యకలాపాల నిమిత్తం ఈ విరాళం అందజేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
తన ఆలోచనలు అన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడి, ప్రజలు చుట్టూనే తిరుగుతున్నాయని కూడా లేఖలో రాశారు. "శాంతియుత ప్రజాస్వామ్య ఉక్రెయిన్‌ను అన్యాయమైన శక్తితో తొక్కడం ప్రజాస్వామ్యానికి సవాలు అని నేను నమ్ముతాను. రష్యా, ఉక్రెయిన్ ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోగలవని, ఉక్రెయిన్ ప్రజలు వీలైనంత త్వరగా శాంతిని పొందాలని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను" అని లేఖలో పేర్కొన్నారు.
తాను 2019లో ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను సందర్శించి జెలెన్స్కీని కలిశానని కూడా మికిటాని చెప్పారు. రష్యా దండయాత్ర ప్రధాన ప్రజాస్వామ్య దేశాల నుంచి విస్తృత ఆర్థిక ఆంక్షలను ప్రేరేపించేలా చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, సంస్థలు ఉక్రెయిన్‌కు సహాయం చేయడానికి విరాళాలను అభ్యర్థించాయి కూడా. జపాన్ ప్రభుత్వం మాస్కోపై ఆస్తులను స్తంభింపజేయడమే కాక రష్యన్ మిలిటరీకి సంబంధించిన సంస్థలకు సెమీకండక్టర్స్ వంటి కీలక ఎగుమతులను నిషేధించడంతో సహా పలు ఆంక్షలను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment