తిరువనంతపురం: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ ఒక్కొక్కరు కదిలి వస్తున్నారు. వేలకోట్ల రూపాయలను నష్టపోయిన కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు తమ వంతు బాధ్యతను తీసుకుంటున్నారు. తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి నడుం బిగించింది. దేశీయ స్మార్ట్‌ఫోన్ రంగంలో రారాజులా వెలుగొందుతున్న షావోమి రంగంలోకి దిగడం విశేషం.
వరద ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు సాయపడేలా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఒకవైపు భారీ వర్షాలు, వరదలు, మరోవైపు కరెంటు కష్టాలతో అల్లాడిపోతున్న ప్రజల సహాయార్దం ముందుకు వచ్చింది. రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్న బాధితులకు పూర్తిగా చార్జింగ్ చేసిన వేలాది పవర్ బ్యాంకులను ఉచితంగా సరఫరా చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి బాక్స్‌ను వాలంటీర్లకు అందించామని షావోమీ ఎండీ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పవర్ బ్యాంకులకు చార్జింగ్ చేసిన తమ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కాగా గత శతాబ్ద కాలంలో లేని వరద పరిస్థితి కేరళను అతలాకుతలం చేస్తోంది. గత పదిరోజులుగా దయనీయమైన, అధ్వాన్నమైన వాతావరణం అక్కడి ప్రజలను బాధిస్తోంది. దాదాపు 13 జిల్లాల్లో ఇంకా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. దాదాపు మూడున్నర లక్షలమంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
#Xiaomi is supplying thousands of fully charged Mi PowerBanks to relief camps in #Kerala, with help of @CNNnews18.
— Manu Kumar Jain (@manukumarjain) August 18, 2018
Respect for our team members for charging these powerbanks & helping our countrymen!
1st box being handed over to a volunteer. #XiaomiWithKerala #KeralaFloods pic.twitter.com/BtoMbdVbPV
Comments
Please login to add a commentAdd a comment