
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు-నేడు (స్కూల్ ఎడ్యుకేషన్)లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాల నిమిత్తం తానా ఫౌండేషన్(ఇండియా) రూ.50 లక్షల విరాళం ప్రకటించింది. శుక్రవారం.. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో తానా ఫౌండేషన్(ఇండియా) మేనేజింగ్ ట్రస్టీ, సెక్రటరీ కేఆర్‌కే ప్రసాద్ తరపున రూ.50 లక్షల విరాళం చెక్కును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతినేని పద్మావతి, తాతినేని వెంకట కోటేశ్వరరావు దంపతులు అందజేశారు.
చదవండి:
పోలవరం ప్రాజెక్టు: మరో కీలక అంకం పూర్తి..
ట్రాకింగ్ మెకానిజం పటిష్టంగా ఉండాలి: సీఎం జగన్