పుంగనూరు (చిత్తూరు జిల్లా): కరోనా తీవ్రమవుతున్న తరుణంలో పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మందులు, ఆక్సిజన్ కొనుగోలు చేసేందుకు లోక్ సభ ప్యానెల్ స్పీకర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి తన సొంత నిధులు కోటి రూపాయలు విరాళం చెక్కును జిల్లా కలెక్టర్ హరినారాయణ్‌కు అందజేశారు. గురువారం పుంగనూరు ఆర్టీసీ డిపోను సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్చువల్ విధానం ద్వారా అమరావతి నుంచి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషా, సబ్ కలెక్టర్ జాహ్నవితో కలసి ఎంపీ మిథున్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి సూచనల మేరకు పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు కరోనా సమయంలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆక్సిజన్‌తో పాటు మందులను కొనుగోలు చేసి, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించేలా జిల్లా కలెక్టర్‌ను కోరామన్నారు. పుంగనూరు ప్రజలకు ఏ సమస్య ఎదురైనా తమ కుటుంబం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావాలన్నారు.
చదవండి: YS Jagan: అత్యధిక పరీక్షలు, ఉచిత వైద్యం.. ప్రజలకు అండగా..
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment