దేశంలోని గో రక్షకులకు బహిరంగ విజ్ఞప్తి... మీరంతా దయచేసి వెంటనే రువాండా దేశానికి వెళ్లి ఈ ఆవుల పరిరక్షణకు చర్యలు తీసుకోండి. ప్లీజ్...
దక్షిణాష్రికా బ్రిక్స్ శిఖరాగ్ర భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనేందుకు వెళుతూ మార్గమధ్యంలో రువాండాలో ఆగి 200 ఆవులను కానుకగా ఇచ్చారు. దీనిపై ట్విటర్ వేదికగా సాగిన హాస్యపూర్వకచర్చలో భాగంగానే ఈ విజ్ఞప్తి సోషల్ మీడియా తెరపైకి వచ్చింది. రువాండాలో కొన్ని శతాబ్దాలుగా ‘గిరింకా పథకం’లో భాగంగా గోవులను కానుకగా ఇవ్వడం ఓ సంప్రదాయంగా వస్తోంది. గౌరవం, కృతజ్ఞతను వ్యక్తపరచడంలో భాగంగా ఒకరి నుంచి మరొకరికి ఆవులు అందజేస్తారు. అయితే రువాండాలో బీఫ్‌ను ఆహారంలో భాగంగా పరిపాటి కావడంతో ఈ అంశం ట్విటర్‌లో చర్చకు కేంద్రమైంది. మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బీఫ్‌ను నిషేధించడంతో పాటు ఇటీవల గోవుల పరిరక్షణపేరిట మూక దాడుల సంబంధిత వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ట్విటర్‌లో సరదా కామెంట్లు...
- రువాండాలోని బుగెసెరలో అతి పెద్ద బీఫ్ ప్రాసెసింగ్ ప్లాంట్ రాబోతోంది. ఆ దేశానికే ప్రధాని మోదీ ప్రేమతో 200 ఆవులు కానుకగా ఇచ్చారంటూ ఓ వ్యక్తి స్పందించాడు=మోదీ మాస్టర్ స్ట్రోక్...200 ఆవులు కానుకగా ఇచ్చేశారు అని ఆప్‌కా దేవేందర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు
- రువాండాలో మాంసం కొరత ఏర్పడింది అనే శీర్షికతో... రెండుదేశాల్లోనూ ఆవులను పూజిస్తారు. అయితే ఈ ఫోటోను చూడాలంటే భయమేస్తోంది అంటూ రువాండాలో బీఫ్ అమ్మే ఫోటోను రోహిత్ కన్నన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు
- ఆ దేశంలో గోవులను ఇష్టపడతారు. అయితే డైనింగ్ టేబుళ్ల మీద...అక్కడ గోరక్షకుల దళాన్ని వెంటనే ఏర్పాటుచేయాలి. దళ సభ్యులంతా కూడా రాత్రికి రాత్రి ప్యారాఛూట్లలోఅవసరమైన చోట్ల దిగే ఏర్పాటు చేయాలి అంటూనైనా డీ షేత్ పేర్కొన్నారు
- రువాండాకు 200 ఆవులను ఎత్తుకెళుతున్న వారు కనిపించారని మై ఫెల్లో ఇండియన్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు
- ఓ వ్యక్తి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రెండు గోవులను తీసుకెళుతుంటేనే దాడి జరిగింది. మరో వ్యక్తి భారత్ నుంచి 200 ఆవులను తీసుకుని రువాండాకు వెళ్లినట్టు ఇప్పుడే విన్నాను. అతడికి ఏమి కాకూడదని ప్రార్థిస్తున్నాను అని అతుల్ ఖత్రి వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment