న్యూఢిల్లీ: ఎక్స్(ట్విటర్)లో ఫాలోవర్ల సంఖ్య విషయంలో ప్రధాని మోదీ కొత్త రికార్డు నెలకొల్పారు.‘ఎక్స్’లో ఆయన ఫాలోవర్ల సంఖ్య ఆదివారం (జులై 14) 100 మిలియన్ల మార్కు (10 కోట్లు)ను దాటారు.దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.‘ఎక్స్‌లో ఉండటం, ఈ వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు లభిస్తుండటం సంతోషంగా ఉంది’ అని మోదీ పోస్ట్ చేశారు.
A hundred million on @X!
Happy to be on this vibrant medium and cherish the discussion, debate, insights, people’s blessings, constructive criticism and more.
Looking forward to an equally engaging time in the future as well. pic.twitter.com/Gcl16wsSM5— Narendra Modi (@narendramodi) July 14, 2024
2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ట్విటర్ లో ఖాతా ప్రారంభించారు. 2010కే ఆయన లక్ష మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. మరో ఏడాదికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. 2020 జులై 19 నాటికి 6 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా గడిచిన నాలుగేళ్లలో 4 కోట్ల మంది ఫాలోవర్లు పెరిగారు.
ప్రపంచ నేతల్లో ఎవరికీ దక్కని రికార్డు..
ప్రస్తుత ప్రపంచ నేతల్లో ఎవరికీ ప్రధాని మోదీ స్థాయిలో ఫాలోయింగ్ లేదు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ‘ఎక్స్’లో 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మన దేశంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను 27.5 మిలియన్ల మంది, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 26.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment