బెర్క్‌షైర్ హతావే చైర్మన్, సీఈవో వారెన్ బఫెట్ రూ.44,200 కోట్లు దానం చేస్తున్నారు. ప్రపంచంలో 10వ అత్యంత సంపన్నుడైన బఫెట్ 5.3 బిలియన్ డాలర్ల విలువైన 1.3 కోట్ల బెర్క్‌షైర్ హతావే స్టాక్స్‌ను బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు, నాలుగు కుటుంబ ఛారిటీలకు విరాళంగా ఇస్తున్నారు. 2006 తర్వాత ఇది ఆయన ఇస్తున్న అత్యధిక వార్షిక విరాళం.
సంపాదనకు, సంపదకు మారుపేరైన వారెన్ బఫెట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఆయన దాతృత్వం గురించి, విరాళాల గురించి తక్కువ మందికి తెలిసి ఉంటుంది. తాజాగా ప్రకటించిన విరాళంతో కలిపి స్వచ్ఛంద సంస్థలకు ఆయన అందించిన మొత్తం విరాళాలు 57 బిలియన్ డాలర్లకు (సుమారు 4.7 లక్షల కోట్లు) పెరిగాయి. గేట్స్ ఫౌండేషన్ కు బఫెట్ ఇప్పటివరకూ 43 బిలియన్ డాలర్లకు పైగా విలువైన బెర్క్ షైర్ షేర్లను విరాళంగా ఇచ్చారు.
తన మొదటి భార్య పేరు మీద ఉన్న సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్ కు 9,93,035 షేర్లను, తన పిల్లలు హోవార్డ్, సుసాన్, పీటర్ నేతృత్వంలోని మూడు స్వచ్ఛంద సంస్థలకు కూడా 6,95,122 షేర్లను బఫెట్ విరాళంగా ఇచ్చారు.
ఉన్నదంతా ఇచ్చేసే ఆలోచన
బెర్క్ షైర్‌లో1965 నుంచి తాను నిర్మించిన సంపదలో 99 శాతానికి పైగా విరాళంగా ఇవ్వాలని 93 ఏళ్ల బఫెట్ యోచిస్తున్నారు. దీనికి సంబంధించిన వీలునామాను ఆయనతదనంతరం ఆయన పిల్లలు అమలు చేయనున్నారు. బెర్క్‌షైర్ సుమారు 880 బిలియన్ డాలర్ల సమ్మేళనం. ఇది బీఎన్ఎస్ఎఫ్ రైల్రోడ్, గీకో కార్ ఇన్సూరెన్స్, యాపిల్ వంటి స్టాక్స్‌తో సహా డజన్ల కొద్దీ వ్యాపారాలను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment