బిలియనీర్ మాకెంజీ స్కాట్ ( జెఫ్ బెజోస్ మాజీ భార్య) మరోసారి తనదాతృత్వాన్ని చాటుకున్నారు. 2.7 బిలియన్ డాలర్లు (రూ. 20వేల కోట్లకు పైమాటే) భారీ విరాళాన్ని ప్రకటించారు. గివ్ ఇండియాతో పాటు మరికొన్ని సంస్థలకు ఈ విరాళాలను ప్రకటించారు. చారిత్రాత్మకంగా అణగారిన, నిరాదరణకు గురైన వర్గాలు, సంఘాలకు ఈ నిధులను అందించనున్నట్టు ఒక బ్లాగ్‌లో ఆమె ప్రకటించారు. దీంతో గత ఏడాది జులై అందించిన సాయంతో పాటు మాకెంజీ విరాళాల మొత్తం విలువ 8.5 బిలియన్ డాలర్లు చేరింది.
ప్రపంచంలోనే అత్యంత చురుకైనదాతగా గత ఏడాది రికార్డు సృష్టించిన మాకెంజీ గివ్ఇండియా, గూంజ్ మి, అంతారా ఫౌండేషన్ లాంటి 286 మంది ఈ డొనేషన్‌ను అందించారు. ఒక్కో సంస్థకు సుమారు 10 మిలియన్ డాలర్ల చొప్పున ఈ విరాళాలను అందించారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు 2019 లో విడాకులిచ్చి, డాన్ జ్యువెట్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఇంత పెద్దమొత్తంలో విరాళాలు ప్రకటించడం ఇదే తొలిసారి. దీంతో విరాళాలను స్వీకరించిన సంస్థు సంతోషాన్ని ప్రకటించాయి. కాగా మాకెంజీ దానం విలువ కొన్ని దేశాల మొత్తం జిడిపి కంటే ఎక్కువ. మరో బిలియనీర్,పరోపకారి బిల్, మెలిండా గేట్స్ గత 27 సంవత్సరాల్లో సుమారు 50 బిలియన్ డాలర్ల విరాళం ఇవ్వగా స్కాట్ కేవలంలో 12 సంవత్సరాలలో ఆ మొత్తాన్ని సాధించడం విశేషం.
చదవండి : SBI ఖాతాదారులూ ముఖ్య గమనిక!
సంచలనం: గంగానదిలో కొట్టుకొచ్చిన శిశువు, సర్కార్ స్పందన
The largest gift in UCF’s history will fuel social mobility, student success, academic excellence & faculty research for generations to come👏
Philanthropists @mackenziescott & Dan Jewett announced a $40 million investment to strengthen proven pathways to opportunity.
— UCF 😷 (@UCF) June 15, 2021
👏🏽Big NEWS! 👏🏽 We've just received the largest gift in UTSA history, $40 million from Mackenzie Scott and Dan Jewett. https://t.co/NTTk5aOPGK #UTSA #StudentSuccess pic.twitter.com/Azgv71wh3v
— UTSA (@UTSA) June 15, 2021
Comments
Please login to add a commentAdd a comment