సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రం లోని గిరిజన, దళిత, పేద విద్యార్థులు ఆన్‌లైన్‌లో తమ చదువును కొనసాగించేందుకు మాజీ ఎంపీ కవిత అండగా నిలిచారు. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో ఏర్పడిన ‘విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్’కు తెలంగాణ జాగృతి ద్వారా శనివారం 50 కంప్యూటర్లు, 500 కుర్చీలు విరాళమిచ్చారు. పేద విద్యార్థులు కంప్యూటర్లు, ట్యాబ్‌లు కొనుగోలు చేసే పరిస్థితి లేక చదువుకు దూరం కావద్దన్న ఉద్దేశంతోనే విలేజ్ లెర్నింగ్ సర్కిళ్లకు కంప్యూటర్లు అందజేసినట్లు కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి ద్వారా భవిష్యత్తులోనూ పేద విద్యార్థులకు సహకారం అందిస్తామని ప్రకటించారు. మాజీ ఎంపీ కవిత సహకారాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు మేడే విద్యాసాగర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment