Telangana Jagruthi
-
కేబీఆర్ పార్క్ వద్ద భారత జాగృతి భోగి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పొద్దుపొద్దున్నే ముగ్గులతో ఆడపడుచులు, భోగి మంటలతో ఆడిపాడుతున్నారు అంతా. ఇక కేబీఆర్ పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత్ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భోగి మంట వేసి.. బసవన్నలకు పూజ చేసి, హరిదాసు అక్షయ పాత్రలో బియ్యం సమర్పించారు. Telangana | BRS MLC K Kavitha participated in the Bhogi celebrations organised by Bharat Jagruthi at KBR park in Hyderabad. pic.twitter.com/n31mFG4Sxy — ANI (@ANI) January 14, 2023 -
న్యూజిలాండ్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను చాటే బతుకమ్మ ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాలు ఖండాంతరాలు దాటాయి.న్యూజిలాండ్ ఆక్లాండ్ సిటీలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు జ్యోతి నేతృత్వంలో తొలి రోజు జరిపే ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు అంబురాన్నంటాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆడుతూ..పాడుతూ ఆక్లాండ్ల్లో సంబురాలు హోరెత్తాయి. అయితే ఈ ఏడాది కరోనా కరణంగా ఇంటి వద్దనే బతుకమ్మ ఉత్సవాల్ని జరుపుతున్నట్లు జ్యోతి తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు 9 రోజులు రోజుకో రీతిలో సాగి సద్దుల బతుకమ్మతో పరిసమాప్తమవుతాయని అన్నారు. -
'అల్లిపూల వెన్నెల' బతుకమ్మ సాంగ్ వచ్చేసింది..
Allipoola Vennela Bathukamma Song: తెలంగాణ ఆడపడుచులు ఏడాదంతా ఎదురుచూసే పండుగ 'బతుకమ్మ'. పూలనే దైవంగా కొలిచే ఈ పండుగ ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే కనిపించేది. కానీ ఈ వేడుకలు ఇప్పుడు పట్టణాల్లోనే కాదు విదేశాలకు సైతం పాకింది. తొమ్మిదిరోజుల పాటు జరుపుకునే ఈపండగ కోసం ఏయేటికాయేడు కొత్తకొత్త పాటలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది బతుకమ్మ సంబరాల్లో భాగంగా తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల’ పాటను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని తన నివాసంలో దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్‌తో కలిసి రిలీజ్ చేసింది. ఐదు నిమిషాల నిడివి ఉన్న ఈ బతుకమ్మ పాటకు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఈ బతుకమ్మ పాట చిత్రీకరణ జరగడం విశేషం. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు! A festival of life. A celebration of togetherness. Bringing you a glimpse of the beauty of Bathukamma through "#AllipoolaVennela" along with Telangana Jagruthihttps://t.co/rJarGvmwGs — A.R.Rahman #99Songs 😷 (@arrahman) October 5, 2021 -
‘క్షమాపణ చెప్పినా హైపర్ ఆదిని వదలం.. బుద్ధి చెప్తాం’
సాక్షి, హైదరాబాద్: ఓ టీవీలో ప్రసారమైన షోలో జబర్దస్త్ నటుడు హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిపై చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా హైపర్ ఆది ఆ వ్యాఖ్యలకు క్షమాపణ తెలిపారు. అయితే ఆయన క్షమాపణలు చెప్పినా కూడా తాము వదిలేది లేదని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఆది క్షమాపణలు చెప్పిన అనంతరం ఆ సంస్థ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ స్పందించారు. హైపర్ ఆదిని బాధపెట్టడం.. క్షమాపణ చెప్పడం సరైన విధానం కాదు అని తెలిపారు. సంస్కృతిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తాము ఆరోపణలు చేస్తున్నట్లు హైపర్ ఆది అనడం సిగ్గుచేటు అని నవీన్ గౌడ్ తెలిపారు. ఇప్పటికీ కూడా పశ్చాత్తాప పడకుండా కేవలం తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం ఈ వ్యాఖ్యలను గమనిస్తున్నారని చెప్పారు. సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎక్కడ కూడా మేము తగ్గేది లేదని.. కచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏదో అతని పర్సనల్ పేజీలో వీడియో పెట్టుకొని చేతులు దులుపుకునే ధోరణి సహించేది లేదు అని పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది చదవండి: నేను తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు: హైపర్ ఆది -
తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, గౌరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జబర్దస్త్ నటుడు హైపర్ ఆది క్షమాపణలు చెప్పాడు. ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు తమ షోలో ఎప్పుడు ఉండవు... అందరం కలిసికట్టుగా పని చేసుకుంటూ ఉంటామని వివరణ ఇచ్చారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో చేసిన స్కిట్‌పై తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం దీనిపై ఫోన్‌కాల్‌లో ఆ ప్రతినిధులకు వివరణ ఇచ్చారు. అయితే బేషరతుగా క్షమాపణలు చెప్పేదాక తాము వదిలిపెట్టమని.. కావాల్సి వస్తే న్యాయపరంగా వెళ్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది క్షమాపణలు చెబుతూ రాత్రి వీడియో విడుదల చేశారు. ఆ షోలో చేసిన స్కిట్‌పై కొన్ని ఆరోపణలు వచ్చాయి.. అవి తాము కావాలని చేసినవి కావు అని హైపర్ ఆది తెలిపారు. అన్ని ప్రాంతాల వారి ప్రేమ, అభిమానంతోనే తాము వారికి వినోదం పంచుతున్నట్లు చెప్పారు. ఇటీవల షోలో జరిగిన దానికి అందరి తరఫున క్షమాపణ కోరుతున్నట్లు ప్రకటించాడు. చదవండి: హైపర్ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు చదవండి: నేను తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు: హైపర్ ఆది -
విలేజ్ లెర్నింగ్ సర్కిళ్లకు కంప్యూటర్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రం లోని గిరిజన, దళిత, పేద విద్యార్థులు ఆన్లైన్లో తమ చదువును కొనసాగించేందుకు మాజీ ఎంపీ కవిత అండగా నిలిచారు. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో ఏర్పడిన ‘విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్’కు తెలంగాణ జాగృతి ద్వారా శనివారం 50 కంప్యూటర్లు, 500 కుర్చీలు విరాళమిచ్చారు. పేద విద్యార్థులు కంప్యూటర్లు, ట్యాబ్‌లు కొనుగోలు చేసే పరిస్థితి లేక చదువుకు దూరం కావద్దన్న ఉద్దేశంతోనే విలేజ్ లెర్నింగ్ సర్కిళ్లకు కంప్యూటర్లు అందజేసినట్లు కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి ద్వారా భవిష్యత్తులోనూ పేద విద్యార్థులకు సహకారం అందిస్తామని ప్రకటించారు. మాజీ ఎంపీ కవిత సహకారాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు మేడే విద్యాసాగర్ పాల్గొన్నారు. -
మహిళా లేఖనం
అందం, సంబరం, పువ్వులు, ప్రకృతి, పర్యావరణం, జలవనరులు ఇవన్నీ బతుకమ్మ పండుగలో భాగమని తెలుసు. అయితే ఈ మహిళా కళాకారులు వాటితో పాటు అసమానతలు, లింగ వివక్ష, ఆధ్యాత్మిక ఉత్తేజం.. ఇలా ఎన్నో అంశాలను బతుకమ్మ కోణం నుంచి స్పృశించారు. అందుకే పండుగ వెళ్లిపోయినా.. వారు గీసిన వర్ణాలన్నీ నేటికీ బతుకు ఉత్సవాన్ని ప్రతిఫలిస్తూనే ఉన్నాయి. – ఓ మధు, సాక్షి, సిటీ బ్యూరో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ‘తెలంగాణ జాగృతి’ ఆధ్వర్యంలో హైద్రాబాద్ నెహ్రూ గ్యాలరీలో మూడు రోజుల పాటు జరిగిన బతుకమ్మ ఆర్ట్ క్యాంప్‌లో 20–82 ఏళ్ల మధ్య వయసున్న యాభై మంది మహిళా ఆర్టిస్టులు ఒకే వేదిక మీద అక్కడికక్కడ చిత్రాలు గీశారు. తెలంగాణలో ఇంత పెద్దఎత్తున బతుకమ్మపై ‘ఆర్ట్‌క్యాంప్’ జరగడం ఇదే తొలిసారి. తెలంగాణ జాగృతి, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం సహకారాలతో జరిగిన ఈ ఆర్ట్ క్యాంపును ప్రముఖ చిత్రకారులు రమణారెడ్డి సమన్వయం చేయగా, అనిత క్యూరేటర్‌గా వ్యవహరించారు. విశేషం ఏమిటంటే.. ఈ క్యాంప్‌లో చిత్రకారిణుల కుంచె నుంచి రూపుదిద్దుకున్న బతుకమ్మ చిత్రాలు చూడముచ్చటగా ఉండటమే కాదు, ఆలోచనలకు పదును పెట్టేలా ఉన్నాయి. బతుకమ్మ ప్రకృతి పండుగ. చిన్నప్పుడు రకరకాల పువ్వులు తీసుకువచ్చి రంగులు అద్ది తొమ్మిది రోజుల బతుకమ్మను తయారు చేసే వాళ్లం. ప్రకృతితో ఈ విధమైన బంధాన్ని పిల్లలు మిస్ కాకూడదు. ఇలాంటి ఆర్ట్ క్యాంప్ వల్ల కళతోపాటు సంప్రదాయాన్ని గురించిన అవగాహన, పండుగ పట్ల అభిరుచి మరింత పెరుగుతాయని అంటారు పద్మారెడ్డి. ఆమెతోపాటు, ఆర్ట్క్యాంప్లో పాల్గొన్న మిగతా కళాకారిణులు తమ మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సమానత్వం కోసం నాటి భూస్వాముల ఆగడాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న స్త్రీలను గుర్తు చేసుకుంటూ, మిగిలిన ఆడవాళ్లు పూలను పేర్చి ‘బతుకు అమ్మా..’ అంటూ తమ సానుభూతిని వ్యక్తం చెయ్యడంతో బతుకమ్మ ఉత్సవం మొదలయ్యిందన్న ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అని చెప్తున్నా స్త్రీలకు పరిస్థితులింకా దుర్భరంగానే ఉన్నాయి. అందుకే నా చిత్రంలో స్త్రీ, పురుష చిహ్నాలను తీసుకుని స్త్రీ చిహ్నాన్ని హైలైట్ చేశాను. అసమానత్వానికి గుర్తుగా స్త్రీ చిహ్నానికి పూర్తి ఎరుపు రంగుని వెయ్యలేదు. ఆ చిహ్నంలోనే బతుకమ్మను చూపించాను. ఇక చిత్రంలో ఆదిశక్తి ఆయుధాలు కూడా చూడవచ్చు. రాక్షసులను చంపలేమని దేవుళ్లే వెనక్కి తగ్గినప్పుడు, ఆదిశక్తి దుష్ట సంహారం చేసింది. – రజని, బిఎఫ్ఏ, థర్డ్ ఇయర్ గౌరమ్మ కోసం బతుకమ్మ స్త్రీల పండుగ. అందుకే లేస్, బట్టలు, పువ్వులతో ఈ పెయింటింగ్ వేశాను. దీంట్లో తొమ్మిది మంది స్త్రీల ముఖాలు, తొమ్మిది రోజుల బతుకమ్మను ప్రతిబింబిస్తాయి. మధ్యలో బతుకమ్మ సమయంలో పూజించే గౌరమ్మను పెట్టాను. – రూపారాణి ఉపాసన కోసం మనలో ఉన్న కుండలి శక్తిని ప్రతిబింబించేలా నా చిత్రంలో చక్రాలు వేశాను. శక్తికి ప్రతిరూపాలు మనుషులు. శక్తి ఉపాసన ద్వారా కుండలిని శక్తి మరింత జాగృతమవుతుంది. తొమ్మిది రోజులు బతుకమ్మ చేసే వారు కొత్త ఉత్సాహంతో ఉండటాన్ని గమనించవచ్చు. ఏడాదిలో ఒకసారైనా ఇలాంటి ఆరాధన చేస్తే ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవచ్చు. ఇదే ఈ చిత్రం ద్వారా చెప్పాను – సౌజన్య కష్టసుఖాల కోసం భావోద్వేగాలు ఏమీ ముఖంలో కనిపించని; సంతోషం, బాధను కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్న నేటి స్త్రీని పసుపు, కుంకుమ రంగులతో నా చిత్రంలో చూపించాను. – వేకువ, ఎంఎఫ్ఏ, స్టూడెంట్ కలవడం కోసం ఆంధ్రాకి దగ్గరగా ఉండే భద్రాచలం ప్రాంతం వాళ్లకి బతుకమ్మ అంటే ఏందో తెల్వదు. నేను ఇప్పటి వరకు ఆడలేదు కూడా. టీవీల్లోనే మొదటిసారి చూసిన. అందుకే నా పెయింటింగ్‌లో టీవీ పెట్టాను. అది పండుగో లేక సంతోషంగా ఆడుకునే ఆటో అప్పుడు నాకు తెలియదు. ఈ క్యాంప్‌లో ఇంతమంది సీనియర్ కళాకారిణిలతో కలిసి బతుకమ్మ చిత్రాలు వెయ్యటం హ్యాపీగా ఉండటమే కాదు, బతుకమ్మ ఆడినట్లే అనిపిస్తుంది. – సమ్మక్క, ఎంఎఫ్ఏ స్టూడెంట్ ఆసిడ్ బాధితుల కోసం నా బిఎఫ్ఏ 2010లో పూర్తయింది. పీడిత మహిళకు సంబంధించిన అంశాలపై ఆర్ట్ వర్క్ చేస్తుంటాను. ముఖ్యంగా ఆసిడ్ విక్టిమ్స్ మీద పనిచేస్తాను. ‘అందం ఆత్మకు సంబంధించింది’ అనే ఆలోచనతో చిత్రాలు రూపొందిస్తుంటాను. బాధితులైన స్త్రీలనే నేపథ్యంగా తీసుకున్నాను. వారిని అందరితో సమానంగా పండుగలో భాగం చెయ్యాలని, వివక్షలేని వాతావరణం వారికి కల్పించాలని నా చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశాను. – వినీల నీటి కోసం సిటీ మ్యాప్‌లో నీటి చారలను, నీటి ప్రాంతాలను, అందులో తేలుతున్న బతుకమ్మలను చిత్రంగా మలిచారు సీనియర్ ఆర్టిస్ట్ పద్మారెడ్డి. ‘‘నగరంలో మరింత నీరు ఉంటే, నీలిరంగు మరింతగా వాడే దాన్ని’’ అని నవ్వుతూ అంటారు సీనియర్ ఆర్టిస్ట్. – పద్మారెడ్డి -
సాంస్కృతిక ఆయుధంగా బతుకమ్మ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ప్రకృతితో ముడిపడిన బతుకమ్మ పండుగను స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక ఆయుధంగా, విడదీయలేని ఉద్యమరూపంగా మార్చిన ఘనత తెలంగాణ జాగృతికే దక్కుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తి చేయడంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కృషిని కొనియాడుతూ జాగృతి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్లో బుధవారం కేటీఆర్ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మను నిషేధించిన సందర్భంలో హైకోర్టుకు వెళ్లి మరీ తెలంగాణ జాగృతి అనుమతి సాధించి వేడుకలు నిర్వహించిందని గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను దశాబ్ద కాలంగా జాగృతి ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానం అద్భుతమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. మలిదశ ఉద్యమంలో మహిళలను భాగస్వాములుగా చేసింది తెలంగాణ జాగృతేనని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మెచ్చుకున్నారు. -
తన నివాసంలో బతుకమ్మ ఆడిన కవిత
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తన నివాసంలో బతుకమ్మ ఆడారు. తన ఇంటి ఆవరణలో బతుకమ్మకు పూజలు చేసిన ఆమె...అనంతరం ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోను ఆమె తన ట్విటర్లో షేర్ చేశారు. కాగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు 300కి పైగా ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. బతుకమ్మ సంబురాలపై నిన్న సమీక్ష నిర్వహించిన ఆమె...ముంబైతో పాటు అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమాన్‌లతో పాటు 12 దేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా తెలంగాణకే ప్రత్యేకమైన పూలపండుగ వైభవంగా మొదలైంది. తొమ్మిది రోజులపాటు సాగే.. బతుకమ్మ సంబురం ఎంగిలిపూలతో శనివారం ప్రారంభమైంది. -
‘జాగృతి’ బతుకమ్మ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి పూల పండుగ బతుకమ్మను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు 300కి పైగా ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వ హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాలపై శనివారం ఆయా జిల్లా బాధ్యులతో సమీక్ష నిర్వహించారు. ముంబైతో పాటు అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమాన్‌లతో పాటు 12 దేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తామని వెల్లడించారు. జాగృతి బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 30న రవీంద్రభారతిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 316 మంది కవయిత్రుల కవితా పఠనం ఉంటుందన్నారు. అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు వరుసగా మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని జేఎన్‌యూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో 50 మంది మహిళా ఆర్టిస్టులతో ఆర్ట్ వర్క్ షాప్ ఏర్పాటు చేశామని తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలుగు సాహితీ రంగంలో అతిపెద్ద కవయిత్రుల కవితా సంకలనం ‘పూల సింగిడి’ని వెలువరిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాల వారీగా బతుకమ్మ సంబురాలు నిర్వహించే పట్టణాలు, మండల కేంద్రాల జాబితాను కవిత ఈ సందర్భంగా విడుదల చేశారు. -
28 నుంచి ‘జాగృతి’ బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రపంచం నలుమూలలా పూల జాతర అనే నినాదంతో ప్రతీ ఏటా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబురాలను ఈ నెల 28 నుంచి అక్టోబర్ ఆరో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘బతుకమ్మ సంబురాలు’పోస్టర్‌ను కవిత ఆవిష్కరించారు. క్షేత్ర స్థాయిలో బతుకమ్మ సంబురాలతో పాటు ఈ ఏడాది 300 మంది కవయిత్రులతో ‘మహాకవి సమ్మేళనం’నిర్వహణతో పాటు, ఆర్ట్ వర్క్‌షాపు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు తెలంగాణ జాగృతి ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్, ముంబైతో పాటు పలు దేశాల్లో తెలంగాణ జాగృతి శాఖలు బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తాయని కవిత వెల్లడించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూకే, కువైట్ తదితర దేశాల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ జాగృతి సన్నాహాలు చేస్తోంది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు డాక్టర్ ప్రీతిరెడ్డి, మంచాల వరలక్ష్మి, నవీన్ ఆచారి, రాజీవ్ సాగర్, కొరబోయిన విజయ్, విక్రాంత్‌రెడ్డితో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
అవయవదానంతో మరొకరికి ప్రాణం!
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ పుట్టిన రోజున తెలంగాణ జాగృతి మరో బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిలో 50 వేల మందితో అవయవదాన ప్రతిజ్ఞలు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆదివారం నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో జరిగిన అవయవదాన ప్రతిజ్ఞ సదస్సులో ప్రకటించింది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తొలి సంతకాలు చేసి తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీతో నిరుపేదలకు ఉచిత వైద్యం అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇటీవలే అవయవదానాన్ని కూడా అందులో చేర్చిందని చెప్పారు. అవయవదానంలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు. సమాజం, తోటి మనుషుల ప్రాణాలపై తెలంగాణ వాసులకుండే గౌరవం, కరుణలను మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఏడాదిలో 50 వేల అవయవదాన ప్రతిజ్ఞల కోసం తెలంగాణ జాగృతి నడుం బిగించిందని తెలిపారు. విస్తృత ప్రచారం అవసరం.. అవయవదానం గురించి ఎవరికీ అవగాహన లేని సమయంలోనే నగరంలో గ్లోబల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటి అవయవదాన మార్పిడి శస్త్ర చికిత్స చేసి నూతన ఒరవడిని సృష్టించారని కవిత చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే అవయవ దానంలో మొదటి స్థానంలో ఉండటం గర్వంగా ఉందన్నారు. అవయవదానంపై ఉన్న అపోహలను తొలగిస్తూ.. చనిపోయిన తర్వాత కూడా చిరంజీవులుగా ఎలా బతకవచ్చన్న అంశాన్ని సాధారణ జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని జాగృతి బృందాలకు కవిత సూచించింది. పేదవారిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సను ప్రోత్సహించేందుకు నిమ్స్ వంటి ఆరోగ్య సంస్థల్లో అవయవదానం, అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగిందని వివరించారు. అంతేగాకుండా అవయవ మార్పిడి తర్వాత తలెత్తే సమస్యలకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటివరకు నిమ్స్‌లో చేసిన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని, అందుకోసం కృషి చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. జీవన్‌దాన్‌తో ఒప్పందం.. అవయవదానంపై ప్రభుత్వ నిమ్స్ సంస్థ ఏర్పాటు చేసిన జీవన్‌దాన్ (అవయవదాన కేంద్రం)కు తెలంగాణ జాగృతికి మధ్య కుది రిన ఒప్పంద పత్రాలపై ఎంపీ కవిత, జీవన్‌దాన్ చైర్మన్ రమేశ్‌రెడ్డిలు సంతకం చేశారు. కార్యక్రమంలో 800 మందికిపైగా అవయవదానానికి అంగీకరిస్తూ సంతకాలు చేశారు. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ముఠా గోపాల్, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, సీనియర్ జర్నలిస్టు కట్టా శేఖర్‌రెడ్డిలతో పాటు పలు స్వచ్ఛంద, యువజన, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రతిజ్ఞను చేశారు. అంతకుముందు పుల్వామా దాడిలో మరణించిన జవాన్ల మృ తికి సంతాపసూచకంగా మౌనం పాటించారు. సమావేశం ముగింపులో స్కౌట్స్ అండ్ గైడ్స్ నిర్వహించిన బ్యాండ్ ఆకట్టుకుంది. ఇది శుభ పరిణామం.. అవయవాల పనితీరు తగ్గిపోయిన పరిస్థితుల్లో అవయవ మార్పిడియే చివరి అవకాశం. జీవన్‌దాన్ ద్వారా 2012 నుంచి ప్రారంభమైన అవయదానాలు అంచెలంచెలుగా పెరుగుతూ వస్తున్నాయి. 2015లో బ్రెయిన్‌డెడ్ ద్వారా 104 డొనేషన్లు రాగా 2017లో ఈ సంఖ్య 150కి పెరిగింది. 2018లో 164 వరకు పెరిగి అత్యధిక స్థానంలో ఉన్న తమిళనాడు కంటే ముందుకు వెళ్ళాం. రాష్ట్రవ్యాప్తంగా అవయవదానంపై అవగాహన సదస్సులు విస్తృతంగా చేపట్టడం శుభపరిణామం. డాక్టర్ మనోహర్, నిమ్స్ డైరెక్టర్ ప్రభుత్వ సాయం అందితే మరింత సక్సెస్ 1989లోనే అవయవదానం చేస్తానని సంతకం చేశాను. అవయవదానం ద్వారా 8 మందికి ప్రాణం పొసిన వాళ్ళమవుతాం. ఇప్పుడున్న నూతన సాంకేతికతతో బోన్, కార్టిలేజ్, స్కిన్ అన్నీ ఉపయోగపడుతాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవన్‌దాన్ కార్యక్రమం ప్రారంభించాక అవయవదానంపై అవగాహన పెరిగింది. అవయవదానం చేసిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం అందేలా చేస్తే కార్యక్రమం మరింత విజయవంతమవుతుంది. డాక్టర్ కె.రవీంద్రనాథ్, చైర్మన్, గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ అవగాహన పెంచాల్సిన అవసరముంది.. దేశంలో అవయవదానంపై అవగాహన చాలా తక్కువ. స్పెయిన్‌లో 20 లక్షల మందికి 70 మంది అవయవదానం చేస్తే, అమెరికాలో ఆ సంఖ్య 40గా ఉంటే మనదేశంలో 20 లక్షల మందికి ఒక్కరు మాత్రమే అవయవదానం చేస్తున్నారు. అవయవదానంపై 80 శాతం మందిలో అవగాహన లేదు. మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ గురువారెడ్డి, సన్ షైన్ హాస్పిటల్స్ చైర్మన్ -
యువ జాగృతి
-
బబతా, పూర్ణలకు యూత్ అచీవర్ అవార్డులు
-
బబతా, పూర్ణలకు యూత్ అచీవర్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హెచ్ఐసీసీలో జరిగిన తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు ముగిసింది. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. గవర్నర్ చేతుల మీదుగా యూత్ అచీవర్ అవార్డులను రెజ్లర్ బబితా ఫొగట్ , మాలావత్ పూర్ణ, లైఫ్ టైం అవార్డును వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ అందుకున్నారు. వసుదైక కుటుంబం అనేది మన మార్గం కావాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. జాగృతి అంటే చైతన్యమని... ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు అభినందనలు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్‌కు 110 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు, 40 మంది వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెలగోపిచంద్, మలావత్ పూర్ణ, రెజ్లర్ బబితా పోగట్ హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై వక్తలు చర్చించారు. రెండేళ్లకొకసారి ఇంటర్నేషన్ సమ్మిట్ ఏర్పాటు చేసి యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కరించేలా ముందడుగు వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. -
యువ దీప్తి.. మహాత్మ స్ఫూర్తి
-
యువతను విస్మరిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: ‘మన దేశం యంగ్ ఇండియా అని గర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ.. భారత్‌లో యువత సమస్యలను అర్థం చేసుకోవడంలో ఎంపీ లు, విధాన రూపకర్తలు విఫలమయ్యారు. ఈ పరిస్థి తి మారి యువత రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెలం గాణ జాగృతి అంతర్జాతీయ యువ సదస్సు (టీజేఐ వైసీ)లో వక్తలు అభిప్రాయపడ్డారు. హైటెక్‌సిటీ నోవాటెల్ హోటల్లో శనివారం ‘వాక్ ద టాక్ ఆన్ యూత్ డెవలప్మెంట్’ పేరుతో జరిగిన చర్చాగోష్టిలో.. నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత (టీఆర్ఎస్), హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), అసోం ఎంపీ గౌరవ్ గొగోయ్లతోపాటు బ్రిటన్‌లోని లేబర్ పార్టీ ఎంపీ సీమా మల్హోత్రా పాల్గొన్నారు. భారత్‌లో మధ్యవయస్కు లు, అంతకన్నా పెద్ద వయసున్న వారే ఎక్కువ సంఖ్యలో పార్లమెంటుకు ఎంపికవుతున్నందునే.. యువత సమస్యలను అర్థం చేసుకోవడం లేదని సీని యర్ జర్నలిస్టు శేఖర్ గుప్తా అన్నారు. దీన్ని ఒవైసీ సమర్థిస్తూ.. పార్లమెంటులో ఎంపీల వయసుకు సబంధించిన గణాంకాలను వెల్లడించారు. ప్రస్తుత లోక్‌సభలో ఎంపీల సగటు వయసు 55ఏళ్లుగా ఉందని.. 40ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న వారు 13% కంటే తక్కువగా ఉన్నారని ఒవైసీ వివరించారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుండటం, గత కొన్నేళ్లలోనే ఐటీ రంగంలో లక్షల ఉద్యోగాలు తగ్గిపోవడం వంటివన్నీ దేశ పార్లమెంటరీ వ్యవస్థలో లోపాన్ని ఎత్తిచూపుతున్నాయన్నారు. ఈ పరిస్థితి మారి యువతకు రాజకీయరంగంలో మరిన్ని అవకాశాలు కల్పించాలని ఒవైసీ ఆకాంక్షించారు. బ్రిటన్ ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. యూకేలో యువత సమస్యలు భారత్‌తో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. మానసిక సమస్యలు, ఆత్మహత్యలపై అక్కడ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని.. ప్రభుత్వాలు కూడా ఈ అంశాలపై దృష్టిపెట్టి పరిష్కారిస్తున్నాయని వివరించారు. దేశమంతా ఒక్కటేనని గుర్తిస్తే.. జనాభా నియంత్రణ పథకాలు సమర్థవంతంగా అమలుచేసిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో వాటా తక్కువగా ఉండటంపై కవిత మాట్లాడారు. ఈ విషయంలో దేశమంతా ఒక్కటేనని అందరూ గుర్తించాలని.. రాష్ట్రాలకు కేంద్ర నిధుల పంపిణీ విధానంలో మార్పులు చేయడం ద్వారా ఈ సమస్య ను అధిగమించవచ్చని ఆమె పేర్కొన్నారు. పేదరి కం, ఉపాధి కల్పన వంటి చాలా అంశాలు అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు ఒకే తీరుగా ఉంటాయని.. ఈ అంశాలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన నిధు ల పంపిణీ చేయడం తప్పేమీ కాదన్నారు. అయితే.. మిగిలిన అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించేందుకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరంపైనా చర్చ జరగాలని ఆమె పేర్కొన్నారు. అసోం ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక సరళీకరణలకు పాతికేళ్లు దాటినా.. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి మాత్రం రెండు దశాబ్దాలు వెనుకబడే ఉందన్నారు. ఇందుకు కారణాలేమైనా.. దీని ప్రభావం మాత్రం యువతపై స్పష్టంగా కనబడుతోందన్నారు. తండ్రు లు రాజకీయాల్లో ఉండటం తమకు కొంతవరకు కలి సొచ్చినా.. దీర్ఘకాలం ఈ రంగంలో కొనసాగేందుకు మాత్రం కష్టపడాల్సిందేనని గౌరవ్, అసదుద్దీన్, కవిత స్పష్టం చేశారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే: ఒవైసీ ఎవరెన్ని చెప్పినా కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని ఒవైసీ పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజలు, యువకులు భారతీయులే అనడంలో సందేహించాల్సిన అవసరం లేదన్నారు. అయితే.. కశ్మీర్ సమస్య పరిష్కరించేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘కశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటూ అందరూ ప్రకటనలు చేస్తారు. తీరా పరిస్థితులు చక్కబడగానే కశ్మీర్లో చేయాల్సిన అభివృద్ధిని మరిచి పోతున్నారు’అంటూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేశారు. ఈ వివాదంపై కేంద్రానికి ఓ స్థిరమైన విధానం లేదని.. నాలుగున్నరేళ్లలో కశ్మీరీ పండిట్ల కోసం గానీ.. అక్కడి యువత కోసం గానీ.. మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఒవైసీ ఆరోపించారు. ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం అక్కడి యువతలో ఉందన్నారు. అయితే కశ్మీర్ సమస్య సినిమాల్లాగా యుద్ధం చేసి పరిష్కరించేది కాదని.. ఇరువర్గాల్లో ఒకరు రాజనీతిజ్ఞతతో వ్యవహరించాలని అన్నారు. -
యువతతోనే అద్భుతాలు
సాక్షి, హైదరాబాద్: సరైనమార్గనిర్దేశనం ద్వారా యువతతో అద్భుతాలు సృష్టించొచ్చని గాంధేయవాది, పద్మభూషణ్ అన్నా హజారే సూచించారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం, దేశమే మీకుటుంబం అన్న భావనతో యువత పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలా నమ్మి ఆచరిస్తున్న ఫలితంగానే ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయమైన రాలేగావ్ సిద్ధీ ఈ రోజు పచ్చదనంతో కళకళలాడుతోందని చెప్పారు. తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువ నేతృత్వ సదస్సు’కు అన్నా హజారే ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సదస్సుకు 110 దేశాల నుంచి 550 మంది యువ ప్రతినిధులు హాజరు కాగా, సుస్థిరాభివృద్ధికి, సృజనాత్మకతలకు గాంధేయ మార్గం అన్న ఇతివృత్తంపై ఈ సదస్సులో చర్చోపచర్చలు ఉంటాయి. సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా హజారే మాట్లాడుతూ.. యువత గ్రామాలకు సేవ చేయడం మొదలుపెడితే మనదేశం అమెరికా, రష్యాలను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు. ఏదో సాధించాలన్న తపన యువతలో ఉన్నప్పటికీ తగిన మార్గనిర్దేశనం లేకపోవడంతో కొంతమంది పెడదారి పడుతున్నారన్నారు. ఒక లక్ష్యంతో ప్రణాళికబద్ధంగా కృషి చేసి యువత తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీ రచనలతో మార్పు.. యువకుడిగా ఉన్నప్పుడు ఈ జీవితం ఎందుకు? అన్న ప్రశ్న తనకూ వచ్చిందని..పాతికేళ్ల వయసులో ఢిల్లీ రైల్వే స్టేషన్లో గాంధీజీ రచనలతో ఏర్పడిన పరిచయం తన జీవితాన్ని మార్చేసిందని హజారే గుర్తు చేసుకున్నారు. మానవ జీవిత పరమార్థం సేవేనని నిర్ణయించుకుని స్వగ్రామమైన రాలేగావ్సిద్ధీతో కొత్త ప్రస్థానం మొదలుపెట్టానని వివరించారు. తిండికి గతిలేని స్థితి నుంచి రోజుకు 150 ట్రక్కుల కూరగాయలు ఎగుమతి చేసే స్థితికి రాలేగావ్సిద్ధీ చేరుకుందన్నారు. ప్రకృతిని కాపాడుకుంటూనే రాలేగావ్‌సిద్ధీని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని..అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయడం తగదని హితవు పలికారు. పెళ్లి విషయంలో తనను అనుకరించాల్సిన అవసరం లేదని అన్నా హజారే చలోక్తి విసిరారు. ‘‘పెళ్లి చేసుకోండి. పిల్లల్ని కనండి. అలాగని అదే మీ కుటుంబం అనుకోవద్ద’’ని చెప్పారు. అభివృద్ధి, అవినీతి రెండు ఒకే నాణేనికి రెండు పార్శా్వలని, అవినీతి అంతానికి తాను చేసిన ఉద్యమం ఫలితంగా సమాచార హక్కు చట్టం వచ్చిందని గుర్తు చేశారు. యువతకు తగిన విధానాలు అవసరం: కవిత యువతకు, సమాజ శ్రేయస్సుకు, సమస్యల పరిష్కారానికి మనదేశంతో పాటుగా ఇతర దేశాల్లోనూ తగిన విధానాలు లేవని ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన గాలి వంటివి అనేకం ఉన్నాయన్నారు. ఈ సమస్యలన్నీ మనుషులుగా మనం సృష్టించినవేనన్నారు. ప్రతీరోజూ 22 వేల మం ది పిల్లలు బాల్యంలోనే తనువు చాలిస్తుండటం, 80 కోట్ల మంది ఆకలితో నిద్రపోతుండటం, గాలి కాలుష్యం తనను ఎంతో కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువశక్తి సాయంతో ఈ సమస్యలకు పరిష్కారాలు కనుక్కునేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత ఈ సమస్యలను సరి కొత్త దృక్కోణంతో చూడగలదని.. అదే స్థాయి లో పరిష్కారాలు కూడా చూపగలదన్నారు. సుస్థిర అభివృద్ధికి నమూనాగా నిలిచి న రాలేగావ్‌సిద్ధీని నేటికీ వందలాది మంది సందర్శిస్తున్నారంటే అది అన్నా హజారే కృషి ఫలితమేనన్నా రు. తమ హక్కులను సాధించుకునేందుకు.. సమస్యల పరిష్కారానికి ప్రపంచవ్యాప్తంగా యువత ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా వేసిన తొలి అడుగుగా యువ నేతృత్వ సదస్సును పరిగణించాలన్నారు. -
మహాత్ముని దారిలో మహోన్నత ప్రపంచం
దేశంలోనే మొట్టమొదటిసారి.. అదీ తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో యు.ఎన్. ఉమన్, యు.ఎన్. గ్లోబల్ కాంపాక్ట్, తెలంగాణ జాగృతి .. ఈ మూడూ కలిసి ‘యూత్ లీడర్షిప్ కాన్ఫరెన్స్’ నిర్వహించబోతున్నాయి. సందర్భంగా ‘తెలంగాణ జాగృతి’ వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితతో సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. గాంధీమార్గంలో అభివృద్ధి మహాత్మాగాంధీ 150వ వ జయంతి సంవత్సరం ఇది. ‘ది గాంధీ పాత్ టు సస్టేనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్’ (గాంధీ మార్గం నుంచి అభివృద్ధి నిరంతరత, వినూత్నతల వైపు) పేరుతో జనవరి 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే సదస్సులో పాల్గొనడం కోసం 135 దేశాలలోని గాంధేయ అభివృద్ధి వాదులైన రెండు వేల మందికి పైగా యువతీ యువకులు సదస్సుకు హాజరవుతున్నారు. వివిధ అంశాలలో కృషి చేస్తున్న, ప్రపంచ అభివృద్ధిలో తమ పాత్ర ఉండాలనుకుంటున్న వారే వాళ్లంతా. ఇప్పుడు మన దేశం ఉన్న స్థాయి నుంచి ఇంకా పైకెదిగేలా యువతను భాగస్వాములను చేయడం ఈ సదస్సు ఉద్దేశాలలో ఒకటి కాగా, ఇంకొకటి.. అభివృద్ధిని అడ్డుకునే ధోరణులను నిరోధించడమెలాగో యువతకు అవగాహన కల్పించడం. దాని కోసమే ‘యు.ఎన్. ఉమన్’, ‘యు.ఎన్. గ్లోబల్ కాంపాక్ట్’, ‘తెలంగాణ జాగృతి’ కలిసి ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. సదస్సు కోసం ఈ మూడు సంస్థల్ని సమన్వయం చేస్తున్న కవిత.. ఆ వివరాలను వెల్లడించారు. యువతులకు ప్రాముఖ్యం యూత్ అన్నప్పుడు యువకులు మాత్రమే కాదు, యువతుల్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్లే రేపటి మాతృమూర్తులు. మొత్తం తరానికే మార్గదర్శకులు. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల్లో అభివృద్ధి నిరంతరత లక్ష్యాల కింద ఎంపిక చేసిన పదిహేడు అంశాల్లో ఎందులో సరిగా పని సక్రమంగా జరగకపోయినా ప్రభావం పడేది ముందుగా మహిళలమీదే. అందుకే యువతీయువకులిద్దరూ సమాన స్థాయిలో పనిచేయాలి. వీళ్లంతా హాజరయ్యే ఈ సదస్సులో.. ప్రపంచ దేశాల సమస్యలపై జరుగుతున్న అధ్యయనాలు, ప్రపంచం దృష్టి పెట్టిన దుర్బల పరిస్థితులు, సాగుతున్న పరిశోధనల గురించి ఈ సదస్సులో చర్చిస్తారు. ఇక్కడ అనుభవాలు, పరిష్కారాల మార్పిడి జరుగుతుంది. ప్రయోజనకరమైన సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాం. మన దగ్గర ప్రారంభమై, విజయవంతమైన స్వయం సహాయక బృందాల నమూనాను ఈ రోజు ఎన్నో దేశాలు స్వీకరించి అమల్లో పెట్టాయి. సత్ఫలితాలను ఇస్తున్న ఆలోచనల్ని షేర్ చేసుకోడానికి ఇలాంటి సదస్సులు తోడ్పడతాయి. సదస్సులో సమాలోచనలు ఇలాంటి సదస్సులో జరిగే చర్చలు యవతలో చైతన్యం కలిగిస్తాయి. ప్రపంచ దేశాల సమస్యలు; సాంఘిక, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, పర్యావరణ పరిస్థితులను పరిచయం చేస్తాయి. అందుకు వీలుగా సదస్సులో సమాంతర సమాలోచనల వేదికల్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎవరికి ఏ అంశంలో ఆసక్తి ఉంటే వాళ్లు ఆ అంశంలో పాల్గొనవచ్చు. పర్యావరణం, పరిశ్రమలు, ఆరోగ్యం వంటి రంగాలలో జరుగుతున్న పరిణామాలపై ప్రసంగాలు ఉంటాయి. విదేశాల నుంచి ముప్పై మంది వక్తలు, అయిదు వందల మంది అధికార ప్రతినిధులు కాక మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచీ సదస్సుకు తమ పేర్లను నమోదు చేసుకున్నవారున్నారు. పదిహేడు అంశాల లక్ష్యం గాంధేయ మార్గంలో ప్రజాస్వామ్య విలువలతో యువతరం యు.ఎన్. నిర్దేశించిన పదిహేడు అంశాల పట్ల శ్రద్ధ చూపిస్తే 2030 కల్లా లక్ష్యాన్ని సాధించడం తేలిక అవుతుంది అనేది సదస్సు ప్రధానాంశం. ఎట్లా సాధించాలి, సాధనలో నా పాత్ర ఎలా ఉండాలి అని యువతకు మర్గాన్ని నిర్దేశించడానికి ఈ సదస్సు ఉపయోగపడ్తుంది. రెండేళ్లకొకసారి ఇలాంటి సదస్సు నిర్వహించాలనే మౌలిక నియమాన్ని కూడా పెట్టుకున్నాం. ఈసారి తెలంగాణ జాగృతి ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. మన కోసం మన ‘జాగృతి’ సదస్సుతో నిమిత్తం లేకుండా.. మొదటి నుంచీ మేం చేస్తుందంతా యువత కోసమే. నైపుణ్యాల అభివృద్ధి మీద దృష్టిపెట్టాం. అరవై శాతం పైగా అమ్మాయిలు, నలభై శాతం వరకు అబ్బాయిలకు ఉద్యోగావకాశాల లభ్యతకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో శిక్షణ ఇప్పిస్తున్నాం. ఇప్పటి వరకు పద్దెనిమిది వేల మంది యువతకు శిక్షణ ఇప్పించాం. అందులో దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల మంది యువతకు వరకు ఉద్యోగాలిప్పించాం. వీళ్లలో చాలామంది అమ్మాయిలే. తెలంగాణ అంతటా పదిహేను జాగృతి శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి రోజూ శిక్షణా తరగతులు జరుగుతూనే ఉంటాయి. విధానపరమైన నిర్ణయాలను మనం ప్రభావితం చేయాలంటే ఒక రాజకీయపరమైన అధికారం ఉండడం అవసరం. అలా ఉన్నప్పుడే మన రాష్ట్రం కోసం జరిగే అభివృద్ధి విధానాలను నేరుగా రూపొందించగలం. ఆ పాత్రను పోషించగలం. ఒక ఎంపీగా నాది అదొక పాత్ర. రెండోది.. ప్రజాజీవితంలో ప్రత్యక్షంగా యువతపై దృష్టి సారించి వాళ్లకోసం నిరంతరంగా పని చేయాలి. జాగృతి వ్యవస్థాపకురాలిగా అది నా ఇంకో పాత్ర అది. మరో బాధ్యత ‘అక్కా’ ప్రాజెక్ట్ ప్రస్తుతం మన దగ్గర యువతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య రక్త హీనత. దాన్ని తీసుకున్నాం. ఏడవ తరగతి నుంచి పదవ తరగతి చదివే ఆడపిల్లల ఆరోగ్యాన్ని పరీక్షించాం. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇరవై ఐదువేల పై చిలుకు యువతులకు ఆరోగ్య పరీక్షలు జరిపించాం. దురదృష్టవశాత్తు డెబ్బై శాతం కంటే ఎక్కువ మందికి రక్తహీనత ఉన్నట్లు తేలింది. వీళ్లు ఆరోగ్యవంతులయ్యే వరకు కనిపెట్టుకుని ఉండడం మా లక్ష్యం. అంటే ఆరోగ్యవంతమైన తల్లి అయ్యేదాకా వాళ్ల ఆరోగ్యం మీద శ్రద్ధ చూపుతాం. ఈ డెబ్బయ్ శాతం మందికి సంబంధించి వివరాలు సేకరించి ప్రతి యేడూ పరీక్షిస్తుంటాం. ‘అక్కా’ అనే పేరుతో మొదలైన ఏడేళ్ల ప్రాజెక్ట్ ఇది. ‘అక్కా’ అనేది ఒక కాన్సెప్ట్. రక్తహీనత ఉన్న ప్రతి పది మంది అమ్మాయిలకూ ఒక ఆరోగ్యవంతురాలైన అమ్మాయిని ఎంపిక చేసి లీడర్‌గా ఉంచుతాం. ఆ అమ్మాయి క్రమం తప్పకుండా ఆ పదిమందిని పర్యవేక్షిస్తుంటుంది. వాళ్ల ఆహార అలవాట్లను పరిశీలిస్తూ, అవసరమైన సలహాలిస్తూ ఆరోగ్యవంతులయ్యేలా సహకరిస్తుంటుంది. ఒక ఫ్రెండ్‌లా, ఆత్మబంధువులా వ్యవహరిస్తుందన్నమాట. ఈ ప్రాజెక్ట్‌ను ‘యు.ఎన్. ఉమన్’ సహకారంతో చేస్తున్నాం. ఇలా ఏ సమస్యను చేపట్టినా అర్థం పరమార్థం ఉంటుంది. అయితే యువతతోనే ప్రధానంగానే పనిచేస్తున్నాం’’ అని వివరించారు కవిత. జాగృతి ఫెలోషిప్ అవార్డ్స్ ఈ ఏడాది నుంచి ‘జాగృతి ఫెలోషిప్ అవార్డు’ ఇవ్వబోతున్నాం. ఫెలోషిప్ ప్రొగ్రాం తీసుకున్న వారిలో తొమ్మిది నుంచి పదిమందిని ఎన్నుకుని వారికి జాగృతి చేపట్టిన పద్దెనిమిది ప్రాజెక్టులను వారికి ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. వారిలో ఈసారి తొమ్మిదిమందిని సెలెక్ట్ చేశాం. వాళ్లు గత పది రోజులుగా హైదరాబాద్‌లోనే ఉండి అన్ని ప్రాజెక్టులకు తిరుగుతున్నారు. వాళ్లకు మళ్లీ శిక్షణ ఇచ్చి, ఫెలోషిప్ అవార్డ్‌కు ఎంపిక చేస్తున్నాం. అలా నెమ్మదిగా జాతీయ, అంతర్జాతీయ యవనికలోకి ప్రవేశిస్తున్నాం. ఆసక్తి ఉన్న వాళ్లు జాగృతి ఫెలోషిప్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్త గుర్తింపు కావాలనుకునే, అభివృద్ధిలో పాలుపంచుకోవాలనే ఆసక్తి ఉండే యువతీయువకులు ఈ సదస్సుకి హాజరుకావచ్చు. – కవిత -
జర్మనీలో ఘనంగా ‘జాగృతి’ బతుకమ్మ వేడుకలు
బెర్లిన్: జర్మనీలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో తెలంగాణ జాగృతి జర్మనీ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. మహిళలు, పిల్లలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఆటపాటలు, కోలాటాలతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. తెలంగాణ సంతతికి చెందిన వారే కాకుండా జర్మనీయులు కూడా పాల్గొని, బతుకమ్మను పేర్చి, తెలంగాణ సంస్కృతిని ఆస్వాదించడం కార్యక్రమంలో గొప్ప విషయం. అనంతరం తెలంగాణ వంటకాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జాగృతి సభ్యులు డాక్టర్ స్వర్ణకార చేరుకతోట, ఇంద్రకరణ్ రెడ్డి చరాబ్ది, వెంకటరమన బోయినపల్లి, అనూష కోండూరి, విజయ భాస్కర్ గగల, తదితరులకు తెలంగాణ యూరప్ అధ్యక్షులు దాన్నంనేని సంపత్ కృతజ్ఞతలు తెలిపారు. -
బతుకమ్మ వేడుకలకు తెలంగాణ జాగృతి దూరం
-
రోటరీ క్లబ్‌తో తెలంగాణ జాగృతి యూకే భాగస్వామ్యం
సాక్షి, లండన్ : తెలంగాణ జాగృతి యూకే విభాగం మరో మైలు రాయిని సాధించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత కలలను, ఆశయాలను సాకారం చేసేలా కేవలం సాంస్కృతిక, కళా రంగాలలోనే కాకుండా సేవ రంగంలోనూ దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా చారిత్రాత్మక సేవ సంస్థ అయిన రోటరీ క్లబ్‌తో తెలంగాణ జాగృతి యూకే విభాగం భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ సందర్బంగా బాసిల్డాన్లో తెలంగాణ జాగృతి యూకే విభాగం, రోటరీ క్లబ్‌తో పరస్పర సహకారాన్ని కోరుకుంటూ అనుబంధ పత్రాన్ని విడుదల చేశారు. తమ సేవ కార్యక్రమాలను ప్రవాస తెలంగాణ, తెలుగు వారికే కాకుండా బ్రిటన్‌లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు విస్తృతం చేయడానికి రోటరీ క్లబ్ సంస్థతో అనుబంధం పత్రం చేసుకున్నామని జాగృతి యూకే అధ్యక్షులు సుమన్ బలమూరి తెలిపారు. రోటరీ క్లబ్ సభ్యుల సహకారం మరువ లేనిదని, మున్ముందు వారి భాగస్వామ్యంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని సుమన్ పేర్కొన్నారు. జాగృతి కార్యక్రమాలను ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం చేయడం మంచి ఆలోచనని జాగృతి వ్యవస్థావప అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకి రోటరీ క్లబ్ సభ్యులు అభినందనలు తెలిపారు. ఇటీవలే తెలంగాణ జాగృతి యూకే విభాగం యూకే ప్రభుత్వ ఎన్హెచ్ఎస్(నేషనల్ హెల్త్ సర్వీస్)తో భాగస్వామ్యం ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. రోటరీ క్లబ్ ముఖ్య బృందంతో పాటు, సుమన్ బలమూరి, ఉపాధ్యక్షుడు వంశీ తులసి, కార్య వర్గ సభ్యులు సలాం యూసఫ్, వంశీ సముద్రాల, వెంకట్ బాలగోని ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
అంజలికి అండ
సాక్షి, హైదరాబాద్: ఏ ఆధారం లేక నిస్సహాయ స్థితిలో రోడ్డునపడి బిచ్చమెత్తుకుంటున్న దివ్యాంగురాలు అంజలికి అండ లభించింది. ఆమె ఉపాధికి, పిల్లల భవితవ్యానికి భరోసా దొరికింది. నగరంలో బిచ్చగాళ్ల దుస్థితి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ రాక నేపథ్యంలో యాచకుల తరలింపు, ఈ క్రమంలో అంజలి దైన్యస్థితి తదితర పరిణామాలపై ‘సాక్షి’దినపత్రిక శుక్రవారం ప్రచురించిన ‘ఇవాంకా రావొద్దు’ప్రత్యేక కథనంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చలించిపోయారు. అంజలిని అన్ని విధాలా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆమె ఇద్దరు కూతుళ్లు సిరి, కీర్తి పేరిట ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎంపీ ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్, గ్రేటర్ కన్వీనర్ ప్రశాంత్, రైల్వే పోలీస్ డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద అంజలిని కలిశారు. అంజలిని పరామర్శించిన ఆమె దయనీయమైన పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. తనను ఆదుకునేందుకు వచ్చిన జాగృతి నేతలను చూడగానే అంజలి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన బాధలను, కష్టాలను వారికి ఏకరువు పెట్టింది. పిల్లలను చదివించేందుకు తాను పడుతున్న ఇబ్బందులను వారికి వివరించింది. కొద్దిరోజుల వరకు బిచ్చమెత్తుకున్న డబ్బులతో పిల్లల్ని పోషించానని, ఇప్పుడు బిచ్చగాళ్ల తరలింపుతో ఆ అవకాశం కూడా లేకుండాపోయిందని తెలియజేసింది. బరువు చూసుకునే మెషీన్ తెచ్చిపెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఆదాయం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంజలి వివరాలన్నీ తెలుసుకున్న రాజీవ్‌సాగర్ ఇక నుంచి భయపడవద్దని, ఎంపీ కవిత ఆమెకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తారని చెప్పారు. ఎంపీ ఆదేశాల మేరకే తాము అంజలిని కలిసేందుకు వచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు రూ.లక్ష చెక్కును కూడా అందజేశారు. త్వరలో ఆ డబ్బును ఆమె ఇద్దరు కూతుళ్లు సిరి, కీర్తి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అంజలి ఉపాధికి కిరాణా దుకాణం.. పదో తరగతి వరకు చదువుకున్నప్పటికీ ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేని అంజలికి జీడిమెట్లలోని తన నివాసానికి దగ్గర్లో ఆమె కోరుకున్న విధంగా కిరాణా షాపు పెట్టించి ఇవ్వనున్నట్లు రాజీవ్ తెలిపారు. ఎంపీ కవిత చేతుల మీదుగానే ఆ షాపును ఆమెకు అప్పగిస్తామన్నారు. ఆమె ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్పించనున్నట్లు తెలిపారు. ఆమెకు ఏ బాధ, ఇబ్బంది కలిగినా తమను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని ఫోన్ నంబర్లు అందజేశారు. జాగృతి ప్రతినిధులతో పాటు పలువురు ప్రయాణికులు, ఇతరులు అంజలి దీనస్థితి పట్ల చలించిపోయారు. తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందజేశారు. కాగా, ‘సాక్షి’వల్లే తనకు ఇంత ఆర్థిక సాయం లభించిందని, సాక్షి రుణాన్ని తాను ఎప్పటికీ తీర్చుకోలేనని ఈ సందర్భంగా అంజలి పేర్కొంది. -
బహ్రెయిన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
బహ్రెయిన్: తెలంగాణ జాగృతి బహ్రెయిన్ శాఖ ఆధ్వర్యంలో మహా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగగా పేరొందిన బతుకమ్మను కొలుచుకొంటూ వేల సంఖ్యలో మహిళలు, హాజరయ్యారు. ఈసందర్భంగా మహిళలు, పిల్లలు బతుకమ్మ కోలాటం, ఆటపాటలతో అలరించారు. రకరకాల పువ్వులతో పేర్చుకొని తెచ్చిన బతుకమ్మలు అందరిని ఎంతో ఆకర్షించాయి. ఈ సందర్బంగా గల్ఫ్ దేశాల జాగృతి అధ్యక్షులు సిహెచ్. హరిప్రసాద్ మాట్లాడుతూ.. తాము తెలంగాణ సంస్కృతిని ఖండాంతరాల్లో చాటిచెప్పేందుకు ఈ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి కృషి చేస్తున్న తన కమిటీ సభ్యులందరినీ ఆయన అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం చాలా గర్వంగా ఉందని అందుకు సహకరించిన సభ్యులకు హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను బహ్రెయిన్‌లో విస్తరింప చేయడానికి తమవంతు కృషి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో గల్ఫ్ దేశాల జాగృతి అధ్యక్షులు సిహెచ్. హరిప్రసాద్, బహ్రెయిన్ జాగృతి అధ్యక్షులు బరుకుంట్ల బాబురావు, ఉపాధ్యక్షులు మామిడాల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శులు విజయ వర్ధన్, శ్రీనివాస్, సభ్యులు రవి, సుమన్, రాము, విజయసిందె, మహేష్, రాజేష్‌లు పాల్గొన్నారు. -
బతుకమ్మ విజయవంతానికి సహకారం