జర్మనీలో ఘనంగా ‘జాగృతి’ బతుకమ్మ వేడుకలు | Bathukamma festival Celebrated By Telangana Jagruthi In Germany | Sakshi
Sakshi News home page

Oct 16 2018 4:49 PM | Updated on Jul 6 2019 12:42 PM

Bathukamma festival Celebrated By Telangana Jagruthi In Germany    - Sakshi

బెర్లిన్‌: జర్మనీలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో తెలంగాణ జాగృతి జర్మనీ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. మహిళలు, పిల్లలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఆటపాటలు, కోలాటాలతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. తెలంగాణ సంతతికి చెందిన వారే కాకుండా జర్మనీయులు కూడా పాల్గొని, బతుకమ్మను పేర్చి, తెలంగాణ సంస్కృతిని ఆస్వాదించడం కార్యక్రమంలో గొప్ప విషయం. అనంతరం తెలంగాణ వంటకాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జాగృతి సభ్యులు డాక్టర్‌ స్వర్ణకార చేరుకతోట, ఇంద్రకరణ్‌ రెడ్డి చరాబ్ది, వెంకటరమన బోయినపల్లి, అనూష కోండూరి, విజయ భాస్కర్‌ గగల, తదితరులకు తెలంగాణ యూరప్ అధ్యక్షులు దాన్నంనేని సంపత్‌ కృతజ్ఞతలు తెలిపారు.  

1
1/6

2
2/6

3
3/6

4
4/6

5
5/6

6
6/6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement