Bathukamma festival celebrations
-
బ్రిటన్‌లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు
బ్రిటన్: స్కాట్లాండ్ లోని గ్లాస్కో నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. “మదర్ ఎర్త్ హిందూ దేవాలయం “ ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన రెండు సంవత్సరాల తరువాత మరియు అనేక మంది వ్యక్తులతో అనేక సమావేశాల తరువాత, కేంద్రం యొక్క భవిష్యత్తు స్థలంగా ఉండే స్థలాన్ని ఎన్నుకున్నారు.ఈ ఏడాది నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలు , రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడానికి ప్రతి రోజు అంకితం చేయబడింది. 06/10/24న బతుకమ్మ జరుపుకున్నారు . దీన్ని డాక్టర్ మమత వుసికల మరియు వినీల బత్తుల నేతృత్వంలోని స్థానిక తెలుగు సంఘం నిర్వహించింది. ఈ బృందానికి ట్రస్టీలు – డాక్టర్ పునీత్ బేడీ మరియు శ్రీమతి రష్మీ నాయక్ మద్దతు ఇచ్చారు.మూడు వందల మంది పిల్లలు సహా అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కావడం విశేషం. దుర్గామాతకు పూజలు, హారతులతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం మహిళలు బతుకమ్మకు పూజలు చేసి సంప్రదాయ నృత్యం చేశారు. దీని తర్వాత మళ్లీ ఆర్తి మరియు మా తెలుగు సంఘం వాలంటీర్లు చేసిన అద్భుతమైన విందు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు ఎంతో ఆనందించారు. ఈ మధ్య కాలంలో తాము హాజరైన మంచి ఫంక్షన్ ఇదేనని అన్నారు వారు. నిర్వాహకులు తమ శ్రమ ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు. -
స్కాట్ లాండ్ లోని గ్లాస్గోలో నగరంలో బతుకమ్మ పండుగ
స్కాట్ లాండ్ లోని గ్లాస్గోలో నగరంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ భూమి మాత లేదా భూమి దేవి మన పవిత్ర ప్రకృతి దేవత. ప్రకృతికి బతుకమ్మ ఒక ప్రతీక. ఆమెపై జీవించిన ప్రతి రూపానికి ఆమె తల్లి. మన హిందూ మతం శాశ్వతమైనది (సనాతన ధర్మం) అని నమ్ముతారు మరియు దైవత్వం మరియు ప్రకృతి తల్లి యొక్క విడదీయరాని స్వభావాన్ని గుర్తించి ఆరాధించే లోతైన పర్యావరణ విధానం కోసం ఆధ్యాత్మిక మరియు తాత్విక సాధనాలను మనకు అందిస్తుంది.గ్లాస్గో యొక్క దక్షిణ భాగంలో, మనకు అధిక సంఖ్యలో హిందూ సమాజం ఉంది మరియు అది ప్రకృతిలో పెరుగుతోంది. మాకు సమీపంలో మందిరం లేదా సాంస్కృతిక కేంద్రం లేదు. నిపుణుల బృందం కలిసి సమావేశమై చర్చల ద్వారా మా కమ్యూనిటీ కోసం ఒక సాంస్కృతిక కేంద్రంతో సహా ఒక మందిర్ ఆలోచనను రూపొందించింది. మదర్ ఎర్త్ హిందూ దేవాలయం ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన రెండు సంవత్సరాల తరువాత మరియు అనేక మంది వ్యక్తులతో అనేక సమావేశాల తరువాత, మా కేంద్రం యొక్క భవిష్యత్తు స్థలంగా ఉండే స్థలాన్ని మేము కనుగొన్నాము. ఈ ఏడాది నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. భారతదేశంలోని వివిధ ప్రాంతాలు మరియు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడానికి ప్రతి రోజు అంకితం చేయబడిందిఈ సందర్భంగా స్థానిక తెలుగు సంఘం డాక్టర్ పునీత్ బేడి, రష్మీ నాయక్, డాక్టర్ మమత వుసికెల మరియు వినీల బత్తుల నేతృత్వంలో ప్రతిరోజూ నవరాత్రి మరియు బతుకమ్మలను జరుపుకుంటారు. అక్టోబర్ 6న కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. చిరకాలం మన జ్ఞాపకాలలో నిలిచిపోయే వేడుకగా ఇది జరగబోతోందని మా సంఘం వారు చాలా ఉత్సాహం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
న్యూజెర్సీ, ఎడిసన్ లో బతుకమ్మ వేడుకలు
-
అమెరికాలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
-
పుడమిపై పూల పండుగ.. మొదలైన బతుకమ్మ సంబరాలు
-
ముందే వచ్చిన సందడి
-
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: కవిత
సాక్షి, నిజామాబాద్: సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరికీ నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియో సందేశాన్ని శనివారం రోజున విడుదల చేశారు. 'ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులలో కూడా ఆడబిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరువేసుకుంటూ, యూట్యూబ్‌లో బతుకమ్మ కొత్త పాటలు వింటూ, పెద్దఎత్తున పండుగను జరుపుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నాం. (బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్) ఒకపక్క కరోనా, మరోపక్క హైదరాబాద్‌లో అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనమందరం ఒకరికొకరు అండగా నిలుస్తూ, బతుకమ్మ పండుగను పరిపూర్ణం చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. వరదల కారణంగా నష్టపోయిన వారందరినీ అందుకునేందుకు సీఎం కేసీఆర్ తక్షణ సాయంగా రూ.550 కోట్లను విడుదల చేయడం సంతోషదాయకం. హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు త్వరగా తొలగిపోవాలని, గౌరమ్మ తల్లి దయతో కరోనా కనుమరుగవ్వాలని రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీడియో సందేశాన్ని విడుదల చేశారు. -
డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
డల్లాస్: బతుకమ్మ పండుగ వేడుకలను దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) అధ్వర్యంలో కొప్పెల్‌లోని ఆండ్రూ బ్రౌన్ పార్క్‌లో శుక్రవారం రోజున ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా వెలుగొందే బతుకమ్మ పండుగ వేడుకలు మహాలయ అమావాస్యతో ప్రారంభమై ఆశ్వయుజ అష్టమి వరకు కొనసాగనున్నాయి. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా గుర్తుకొచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్కో రోజు ఒక్కో రకమైన నైవేద్యాలను సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. డల్లాస్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు మహిళలు అందమైన పూలతో బతుకమ్మలను తయారు చేసి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రకృతిని ఆరాధిస్తూ బంగారు జీవితానికి ఎలాంటి ఆపద రాకుండా ఆత్మస్థైర్యంతో నిండు నూరేళ్ల బతుకు పండుగలా సాగాలని గౌరీమాతను పూజించారు. కోరికలు తీర్చే అమ్మగా గౌరీమాతను మహిళలు భక్తి శ్రద్ధలతో పూజించారు. వృద్ధులు కూడా వేడుకలకు హాజరై హారతి, నిమర్జన ఆచారాలను అత్యంత ప్రామాణికమైన రీతిలో నిర్వహించడానికి సహాయపడ్డారు. భోజన సౌకర్యం, పార్కింగ్ ఏర్పాట్లు టీపీఏడీ అధ్వర్యంలో ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగ చివరి రోజు వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నట్లు టీపీఏడీ సభ్యులు తెలియజేశారు. మొదటి రోజు వేడుకలకు హాజరైన మహిళలందరికీ టీపీఏడీ బృందం ధన్యవాదాలు తెలియజేస్తూ, పండుగ చివరి రోజైన అక్టోబర్ 5న సద్దుల బతుకమ్మ వేడుకలకు ఆహ్వానాన్ని అందించారు. చివరి రోజు వేడుకలకు తెలుగు సినీరంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు. -
కలెక్టరేట్లో బతుకమ్మ సందడి
వరంగల్ రూరల్: కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సంబురాలను మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముండ్రాతి హరిత బతుకమ్మ తీసుకొచ్చి సంబురాలను ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. కలెక్టర్ హరిత ‘నిర్మల.. ఓ నిర్మల’ పాటకు కోలాటంలో పాల్గొన్నారు. డీఆర్డీఏ, సెర్ప్, ఎన్ఆర్ఈజీఎస్, జిల్లా సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ విభాగాల ఆధ్వర్యంలో బతుకమ్మలను ప్రదర్శించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణారెడ్డి మహిళా ఉద్యోగులను ఉత్సాహపరుస్తూ నృత్యాలు చేసి అలరించారు. జేసీ రావుల మహేందర్‌రెడ్డి, డీఆర్వో భూక్యా హరిసింగ్, పరకాల ఆర్డీఓ ఎల్.కిషన్, డీటీఓ శ్రీనివాసకుమార్, డీపీఆర్వో బండి పల్లవి, డీఈఓ కె.నారాయణ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ హరిప్రసాద్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు సయ్యద్ హసన్, మురళీధర్ రెడ్డి, టీజీఏ జిల్లా నాయకులు జగన్ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రథమ బహుమతిని డీఆర్డీఏ, ద్వితీయ బహుమతి ఐసీడీఎస్, తృతీయ బహుమతి కలెక్టరేట్ ఉద్యోగులు పేర్చిన బతుకమ్మ గెల్చుకున్నాయి. ఈ సందర్భంగా ఆయా శాఖల ఉద్యోగినులకు కలెక్టర్ హరిత జ్ఞాపికలు అందజేశారు. -
జర్మనీలో ఘనంగా ‘జాగృతి’ బతుకమ్మ వేడుకలు
బెర్లిన్: జర్మనీలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో తెలంగాణ జాగృతి జర్మనీ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. మహిళలు, పిల్లలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఆటపాటలు, కోలాటాలతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. తెలంగాణ సంతతికి చెందిన వారే కాకుండా జర్మనీయులు కూడా పాల్గొని, బతుకమ్మను పేర్చి, తెలంగాణ సంస్కృతిని ఆస్వాదించడం కార్యక్రమంలో గొప్ప విషయం. అనంతరం తెలంగాణ వంటకాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జాగృతి సభ్యులు డాక్టర్ స్వర్ణకార చేరుకతోట, ఇంద్రకరణ్ రెడ్డి చరాబ్ది, వెంకటరమన బోయినపల్లి, అనూష కోండూరి, విజయ భాస్కర్ గగల, తదితరులకు తెలంగాణ యూరప్ అధ్యక్షులు దాన్నంనేని సంపత్ కృతజ్ఞతలు తెలిపారు. -
పూల పండగొచ్చింది...
-
కెన్యాలో ఉట్టిపడిన తెలుగు సంస్కృతి
నైరోబి: తెలంగాణలో జరుగుతున్న మహా బతుకమ్మ వేడుకలకు మద్దతుగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ కెన్యా వారి ఆధ్వర్యంలో బతుకమ్మ-దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కెన్యా రాజధాని నైరోబిలో తెలుగువారందరూ ఒకచోట చేరి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. కెన్యా ఎంపీ డాక్టర్ స్వరూప్ రంజన్ మిశ్రా ఈ బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు ఆడపడుచులంతా సంప్రదాయ దుస్తులతో బతుకమ్మలను పేర్చారు. వారు వలయంగా మారి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడటంతో అక్కడ పండుగ వాతావరణం ఉట్టిపడింది. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి తీర్థ, ప్రసాదాలు పంచుకున్నారు. -
యూకేలో దసరా- బతుకమ్మ సంబరాలు..
లండన్: తెలంగాణలో జరుగుతున్న మహా బతుకమ్మ వేడుకలకు మద్దతుగా తెలంగాణ ఎన్నారై ఫోరం ఇంగ్లండ్ ఆధ్వర్యంలో బతుకమ్మ-దసరా ఉత్సవాలు లండన్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంబరాలకు లండన్, హౌన్‌స్లాలోని ఇండియన్ జిమ్ఖానా మైదానం వేదికవ్వగా.. యూకే నలుమూలల నుంచి సుమారు 2000 మందికి పైగా తెలంగాణవాసులు పాల్గొన్నారు. తెలుగు ఆడపడుచులంతా సంప్రదాయ దుస్తులతో బతుకమ్మలను చేతబట్టుకొని గ్రౌండ్‌కు చేరగా చిట్టి బతుకమ్మలతో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆడవారంతా బతుకమ్మ ఆట ఆడగా మగవారు గ్రామీణ వాతవరణం ఉట్టిపడేలా కోలాటం ఆడారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి ప్రసాదాలు పంచుకున్నారు. జమ్మీ పూజ.. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి జమ్మి ఇచ్చిపుచ్చుకొని దసరా జరుపుకున్నారు. విదేశీ గడ్డపై భారత సంస్కృతి ఉట్టిపడేలా ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహాకులు ఈ జాతరను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణా అస్థిత్వాన్ని మరియు సంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేసేందుకు చేస్తున్ననిర్వహాకుల కృషిని పలువురు ప్రశంసించారు . పాల్గొన్న తెలంగాణ ప్రముఖులు.. ఈ మహా బతుకమ్మ వేడుకలకు తెలంగాణ నుంచి ముఖ్య అతిధులుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండా మురళి, టి. ప్రకాష్ గౌడ్, దేవీప్రసాద్, నాగేందర్ గౌడ్, సినీ డైరెక్టర్ సురేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహకులను, ఎన్నారైలను అతిధులు ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమం నుంచి పునర్నిర్మాణంలో ఎన్నారైల పాత్ర ఎంతో ముఖ్యమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్ , అధ్యక్షులు సిక్క చంద్రశేకర్ గౌడ్, అడ్వైజరీ ఛైర్మన్ అంతటి ప్రమోద్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ గంగసాని , తిరుపతి గోలి ,ముఖ్య కార్యదర్శిలు నగేష్ రెడ్డి కాసర్ల ,కోశాధికారులు వెంకట్ రంగు, నరేష్ మరియాల ,సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి స్వామి ఆశ,, స్పాన్సర్ టీం అశోక్ మేడిశెట్టి ,భాస్కర్ మొట్ట, రాజేష్ ఎనపోతుల,మీడియా టీం - సాయి ప్రసాద్ మార్గం , శిరీష కే చౌదరి , సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి స్వామి ఆశ,స్వచ్చంద మరియు సంక్షేమ టీం - మీనాక్షి అంతటి , తెలంగాణ ఎన్నారై ఫోరం మహిళా విభాగం సభ్యులు - హేమలత గంగసాని , జయశ్రీ గంప ,జ్యోతి రెడ్డి కాసర్ల ,కవిత గోలి ,కావ్య రెడ్డి ,మేఘల ఆకుల, ప్రీతీ సీక ,ప్రియాంక కర్పూరం ,రమాదేవి తిరునగరి, ,శ్రీలక్ష్మి మర్యాల,సుచరిత కాల్వ ,వాణి రంగు,నందిని మొట్ట ,భారతి కొప్పుల ,రజిత ,వాణి రంగు, ఏరియా ఇంచార్జిలు ,వెస్ట్ & నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ - , సతీష్ వాసిరెడ్డి , ఈస్ట్ & నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ -శ్రీధర్ నల్ల ,వీరు చౌదరి, రమేష్ సింగం గౌడ్ ,శేషు కుమార్ ఆళ్ళ, సతీష్ వాసిరెడ్డి , ఈస్ట్ & నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ - ,శ్రీధర్ బాబు మంగళారపు,సంతోష్ కోడిప్యాక , వేడుకలలో పాల్గొన్న వారిలో వున్నారు. యూకే జాగృతి ఆధ్వర్యంలో.. యూకే జాగృతి సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బర్మింగ్ హామ్, మిల్టన్ కీన్స్ , వెస్ట్ లండన్ తర్వాత చివరగా లండన్‌లోని దాగెనహమ్లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మలు తీసుకొచ్చిన మహిళలకు నిర్వాహకులు చేనేత చీరలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి, దేవిప్రసాద్, నాగేందర్ గౌడ్, అరవింద్ గౌడ్, రామకృష్ణ రెడ్డి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రవాస మహిళలందరూ బతుకమ్మ స్ఫూర్తి తో ఇలా వేడుకలు చేసుకోవడం బావుందని అభినందించారు. వచ్చే ఏడాది యూకేలోని అన్ని తెలంగాణ సంస్థలను ఏకం చేసి సంయుక్తంగా బతుకమ్మ, దసరా ఉత్సవాలను చేస్తామని అధ్యక్షుడు సుమన్ బలమూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి యూకే అధ్యక్షులు సుమన్ బలమూరి, ఉపాధ్యక్షులు పావని గణేష్, సుష్మ జువ్వాడి , శ్రవణ్ రెడ్డి, కార్యదర్శి సంతోష్ ఆకులతో పాటు ఇతర జాగృతి యూకే కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
అబుదాబీలో బతుకమ్మ సంబరాలు
అబుదాబీ: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు అబుదాబీలో తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమరేట్స్లో ఉంటున్న తెలంగాణ వాసులందరూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అబుదాబీ నగరంలోని ఇండియా సోషల్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు సుమారు పదిహేను వందల మంది తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఫిదా మూవీ ఫేమ్ టి శరణ్య వేడుకలను మరింత తారస్థాయికి చేర్చింది. డప్పులతో అబుదాబి తెలుగింటి ఆడబిడ్డలు బతుకమ్మలతో ప్రాంగణానికి చేరగా, ప్రార్థన గీతంతో కార్యక్రమం మెదలైంది. చిన్నారుల ఆట, పాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆడపడుచుల బతుకమ్మ ఆట, పాటలతో ఐఎస్సీ ఆడిటోరియం మరో తెలంగాణను తలపించింది. బతుకమ్మ సాంప్రదాయకంగా నిమజ్జనం చేస్తూ ప్రసాదాలు పంచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అందమైన బతుకమ్మలకు, సాంప్రదాయకంగా తయారైన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి నిర్వాహకులు రాజ శ్రీనివాస్, వంశీ, పృథ్వీ, సదానంద్, గంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పావని, రోజా, అర్చన, పద్మజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
ముషీరాబాద్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
కెనడాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
కెనడాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కెనడా: కెనడాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (కెనడా) ఆధ్వర్యంలో ఈ నెల 24న టొరంటో(మిస్సిసౌగ) నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 500 మంది హాజరు కాగా, అచ్చమైన తెలంగాణ సంప్రదాయ రీతిలో బతుకమ్మ పండుగను కన్నులపండుగగా జరుపుకున్నారు. తెలంగాణ మహిళలు రంగు రంగుల బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు వివిధ రకాల పోటీలను కూడా నిర్వహించారు. అనంతరం రకరకాల సాంప్రదాయ తెలంగాణ వంటకాలతో మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా టీడీఎఫ్ కెనడా నిర్వాహకులు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతూనే, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నిలబెడుతూ ఉండే కార్యక్రమాలను చేస్తూ ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తెలంగాణ ప్రభుత్వ టూరిజం శాఖతో అనుసంధానమై ఈ కార్యక్రమం నిర్వహించబడింది. -
నకిరేకల్ బతుకమ్మ సంబురాల్లో అపశ్రుతి
నల్గొండ: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన తర్వాత జరుగుతున్న తొలి బతుకమ్మను బంగారు బతుకమ్మగా తెలంగాణ ప్రజలు వాడవాడలా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం నల్గొండ జిల్లాలోని నకిరేకల్‌లో ప్రముఖుల సమక్షంలో బతుకమ్మ సంబురాలు జరుపుకుంటుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. బతుకమ్మ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజీ ఒక్కసారిగా కూలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. స్టేజి కూలిపోవడంతో స్టేజిపై ఉన్నవారంతా కిందపడ్డారు. వారిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రి నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. అదృష్టవశాత్తూ ప్రమాదం తప్పింది. -
సాధికార బతుకమ్మ
ఆదిలాబాద్ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ ఉత్సవాల సందర్భంగా గురువారం కలెక్టరేట్ ఆవరణలో మహిళా ఉద్యోగులు ఆడిపాడారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూల బతుకమ్మ కార్యక్రమంలో జిల్లాలోని రెవెన్యూ, ఐసీడీఎస్, సీపీవో, తదితర శాఖల మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవాలను పర్యవేక్షించేందుకు, కుల మతాలకతీతంగా (సాధికారికంగా) బతుకమ్మ వేడుక జరిగేలా రాష్ట్ర మహిళా సంఘం నాయకులు జిల్లాకు వచ్చారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, ఐసీడీఎస్ పీడీ మీరాబెనర్జీ, టీఎన్జీవో కార్యదర్శి వనజారెడ్డి, మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఫ్రొఫెసర్ సత్యలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మను అధికారికంగా నిర్వహిస్తున్నందున పర్యవేక్షణ కు తనతోపాటు మరో నలుగురు మహిళా నాయకులు వచ్చారని తెలిపారు. ‘ఆడపిల్లల్ని బతికించుకుందాం.. ఆడపిల్లల్ని చదివించుకుందాం’.. అనే కొత్త నినాదంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అన్ని రంగాల్లో ఆడపిల్లలు వెనుకబడి ఉన్నారని, సాధికారిత సాధించాలని ఆకాంక్షించారు. అన్ని శాఖల మహిళా ఉద్యోగులు రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు బతుకమ్మ ఆడాలని టీఎన్జీవో జిల్లా కార్యదర్శి వనజారెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలు, చప్పట్లతో హోరెత్తించారు. కలెక్టరేట్ ఆవరణ పండుగలా మారింది. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు మల్లీశ్వరి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ అనితారెడ్డి, మెప్మా పీడీ రాజేశ్వర్, సరిత, కవిత, మమత, సుజాత, లక్ష్మి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.