కెనడాలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (కెనడా) ఆధ్వర్యంలో ఈ నెల 24న టొరంటో(మిస్సిసౌగ) నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 500 మంది హాజరు కాగా, అచ్చమైన తెలంగాణ సంప్రదాయ రీతిలో బతుకమ్మ పండుగను కన్నులపండుగగా జరుపుకున్నారు. తెలంగాణ మహిళలు రంగు రంగుల బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు వివిధ రకాల పోటీలను కూడా నిర్వహించారు. అనంతరం రకరకాల సాంప్రదాయ తెలంగాణ వంటకాలతో మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేశారు.
Published Tue, Sep 27 2016 9:47 AM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement