telangana development forum
-
TDF ఆధ్వర్యం లో బతుకమ్మ వేడుకలు
-
అన్నదాతల్లో చైతన్యం తీసుకొస్తున్న ప్రవాసీయులు
ముస్తాబాద్(సిరిసిల్ల): దగాపడ్డ తెలంగాణ పునర్నిర్మాణానికి రెండు దశాబ్దాల క్రితమే నడుం బిగించారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించాలన్న సంకల్పం వారిని ముందుకు నడిపించింది. వెనకబడ్డ పురిటిగడ్డను బాగు చేసేందుకు మలి దశ తెలంగాణ ఉద్యమానికి ముందే 1999లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆవిర్భవించింది. ఖండాంతరాలలో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలు ఒక్కటై.. అమెరికాలోని న్యూజెర్సీలో టీడీఎఫ్ పురుడుపోసుకుంది. అలా మొదలైన టీడీఎఫ్ ప్రస్థానం రెండు దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తూనే ఉంది. జైకిసాన్‌తో రైతులకు సేవలు అమెరికాలోని న్యూజెర్సీలో పురుడుపోసుకున్న టీడీఎఫ్‌ను పలు విభాగాలకు విస్తరించారు. 5 వేల మంది సభ్యులతో ప్రారంభమై ఎన్నో సేవలు అందిస్తోంది. భారతదేశం అంటేనే గుర్తుకు వచ్చేది వ్యవసాయ. అందుకు ప్రాధాన్యతను కల్పిస్తూ జైకిసాన్ విభాగాన్ని ప్రారంభించారు. రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. రసాయన ఎరువులకు దూరంగా, సేంద్రియ ఎరువులతో కలిగే లాభాలను వివరిస్తూ ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులకు కృషి చేస్తున్నారు. తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు చేయూతను అందించి, ఆత్మహత్యలు జరగకుండా అవగాహన కల్పిసున్నారు. జీవామృతం, ఘనామృతం తయారీ, డ్రమ్‌సీడర్ ద్వారా సాగు, పెస్టిసైడ్స్ ద్వారా కలిగే నష్టాలను వివరిస్తున్నారు. సమీకృత వ్యవసాయం వల్ల కలిగే ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండ్‌ను తీసుకువస్తున్నారు. పంట మార్పిడి, చిరుధాన్యాల సాగు, వాటి ద్వారా తయారయ్యే ఉత్పత్తులపై చైతన్యాన్ని తెస్తున్నా రు. గ్రామాలలో రైతుసేవా కేంద్రాలు ఏర్పా టు చేసి వారికి అవసరమైన యంత్ర పరికరాలను అందిస్తున్నారు. వ్యవసాయాధికారుల సమన్వయంతో కార్పొరేట్ స్థాయికి తీసుకువచ్చే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం వరి కొయ్యలు కాల్చకుండా, కొయ్యకాళ్లను ఎరువుగా ఎలా మార్చుకోవచ్చో చేసి చూపుతున్నారు. పశుపోషణతో కలిగే లాభాలను రైతులకు చేరవేస్తున్నారు. యంత్రాలను వాడుకుంటున్నాం ముస్తాబాద్‌లోని టీడీఎఫ్ రైతుసేవాకేంద్రంలోని యంత్రాలను వాడుకుంటున్నాం. డ్రమ్‌సీడర్, పచ్చిరొట్ట ఎరువుల తయారీ, సేంద్రియ సాగు పద్ధతులను వివరించారు. కేంద్రంలోని యంత్రాల సాయంతో గడ్డిని తొలగించుకున్నాం. కలుపు అవసరం లేకుండా అది ఉపయోగపడింది. రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. – దేవిరెడ్డి, రైతు, ముస్తాబాద్ ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి కావాలి రైతులు ఆరుగాలం శ్రమించి పండించే పంటలు ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఆ దిశగా వారిని చైతన్యం చేస్తున్నాం. అనవసర ఖర్చులు తగ్గిస్తూ సేంద్రియ విధానం వైపు తీసుకువస్తున్నాం. రైతులు బాగున్నప్పుడే దేశంలోని ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుంది. దానికోసం జై కిసాన్ పనిచేస్తుంది. – మట్ట రాజేశ్వర్‌రెడ్డి, టీడీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎన్నారైల సహకారంతో సేవలు తెలంగాణకు చెందిన ఎన్నారైలు ఇక్కడి ప్రజల జీవన విధానాలను మెరుగుపరిచేందుకు ఒక్కటై టీడీఎఫ్‌ను స్థాపించారు. దాని కోసం ఆహర్నిషలు పనిచేస్తున్నారు. సారవంతమైన నేలను కాపాడుకుంటూనే అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చో శాస్త్రీయంగా అవగాహన కల్పిస్తున్నాం. రైతుల కోసం టీడీఎఫ్ మరింత ముందుకు వెళ్తుంది. – పాటి నరేందర్, జైకిసాన్ ఇండియా అధ్యక్షుడు -
టీడీఎఫ్ అట్లాంటా ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
అట్లాంటి తెలుగువారి తెలంగాణా సంప్రదాయ పండుగ బతుకమ్మను నాలుగువేల భారీ జనసందోహం మధ్య తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అక్టోబర్ 1వ తేదీన నిర్వహించిన బతుకమ్మ, దసరా ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక కళాకారులు ప్రదర్శించిన రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలు ఆరంభమైనాయి. తెలుగింటి ఆడుపడుచులు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ఆహుతులను అలరించాయి. పిల్లలూ పెద్దలూ కలిసి వందకు పైగా కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. ఆరుగంటలపాటు బతుకమ్మల ఆటపాటలతో సందడిగా సాగిన ఈ వేడుక, బతుకమ్మల నిమజ్జనంతో ముగిసింది. ఆకట్టుకునే బతుకమ్మలతో మహిళలు రెండువేల డాలర్ల వరకు క్యాష్ ప్రైజులు, డైమండ్ రింగ్, సిల్వర్ కాయిన్లు సిల్వర్ బౌల్ సెట్లు, వెరా బ్రాడ్లీ పర్సులు వంటి ఆకట్టుకునే ప్రైజులు గెల్చుకున్నారు. ఆహుతుల కోసం కాంప్లిమెంటరీ సాంప్రదాయ భోజనం ఏర్పాటు చేశారు వివిధ రకాల వెండర్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. టీడీఎఫ్ కోర్ టీమ్ సమిష్టి కృషితో ఘనమైన బతుకమ్మ పండుగను నిర్వహించి విజయవంతం చేయటం గర్వంగా ఉందని టీడీఎఫ్ అట్లాంటా చాప్టర్ అధ్యక్షురాలు స్వప్న కస్వా కృషిని కొనియాడుతూ అలాగే ఈ కార్యక్రామానికి సహకరించిన మహిళలతోపాటు, కార్యక్రమ విజయవంతం చేసిన వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఫోర్ ఓక్స్ ఇన్సూరెన్స్, పీచ్ క్లీనిక్, ర్యాపిడ్ ఐటీ, ఈఐయెస్ టెక్నాలజీస్, ఎవరెస్ట్ టెక్నాలజీస్ మొదలగు దాతలు స్పాన్సర్ చేయగా, టీడీఎఫ్ కోర్ టీమ్, అట్లాంటా చాప్టర్ కమిటీ, మరెందరో వాలంటీర్లు కలిసి ఈ కర్యక్రమాన్ని ఆద్యంతం రక్తి కట్టించారు. -
టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా వనితా డే
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో 2022 మార్చి 12న అట్లాంటాలో వనితా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యాంతం వినోదాత్మకంగా సాగింది. వనితా వేదిక విజయవంతం కావడానికి అందరి తోడ్పాటు ఆశీస్సులే కారణమని టీడీఎఫ్ అట్లాంటా 2022 అధ్యక్షురాలు స్వప్న కస్వా అన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అద్భుత కార్యక్రమాలను చేపడతామని ఆమె తెలియజేశారు. కేవలం మహిళలకే పరిమితమైన ఈ వేడుకల్లో రికార్డు స్థాయిలో సుమారు 600 పాల్గొన్నారు. కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు ఎంతో వైభవంగా ఉల్లాసంగా కొనసాగింది. ఆటపాటలు, స్ఫూర్తిదాయక ప్రసంగాలు, ఫ్యాషన్ షో, టాక్‌షో, పాటల పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల పాటలు, ముద్దుగుమ్మల మాటలు , పడుచుల ఆటలతో వేడుక సంబరాల పందిరైంది. అట్లాంటా తెలుగు వారికి సుపరిచితురాలు లావణ్య గూడూరు ఉల్లాసభరిత యాంకరింగ్‌తో ఈ కార్యక్రమానికి మరింత సందడిగా మారింది. అంతకు ముందు సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి స్వప్న కస్వా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2022 వనితా వేడుకల ముఖ్య ఉద్దేశం స్త్రీ సశక్తీకరణ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలు హాజరయ్యారు. వీరిలో ప్రీతి మునగపాటి, డాక్టర్ నందిని సుంకిరెడ్డి, డాక్టర్। నీలిమ దాచూరిలు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పలు సంస్థల మహిళా బోర్డు మెంబర్లకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అభినందించింది. అందులో భాగంగా టీడీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ బాపు రెడ్డి కేతిరెడ్డి, సంయుక్త కార్యదర్శి స్వాతి సుదిని, ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈఐఎస్ టెక్నాలజీస్, రాపిడిట్, ఆర్పైన్, జీవీఆర్ అండ్ ఒర్డుసియన్లు ఈ కార్యక్రమం నిర్వహించడంలో టీడీఎఫ్‌కు తమ వంతు సహకారం అందించాయి. -
ఘనంగా టీడీఎఫ్ 20వ వార్షికోత్సవ వేడుకలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్)-యూఎస్ఏ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ కాన్ఫరెన్స్ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. టీడీఎఫ్-యూఎస్ఏ జాతీయ కాన్ఫరెన్స్ వేడుకల కమిటీ ఈ కార్యక్రమాన్ని నవంబర్ 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు వైభవంగా నిర్వహించనుంది. అమెరికాలోని తెలంగాణ ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నామని కమిటీ తెలిపింది. రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, యాంకర్ ఉదయభాను కార్యక్రమానికి హాజరవుతారని కమిటీ వెల్లడించింది. వేడుకల వివరాలు.. నవంబర్ 8 : సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు కార్యక్రమాలు.. అనంతరం విందు నవంబర్ 9 : ఉదయం జాతీయ కాన్ఫరెన్స్ వేడుకల ప్రారంభోత్సవం. ప్రముఖుల కీలక ఉపన్యాసాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం మధ్యాహ్న విందు. మధ్యాహ్నం బ్రేక్ అవుట్ సెషన్లో భాగంగా బిజినెస్, వైద్యం, రాజకీయ, ప్రాజెక్టులు, మహిళలు, అక్షరాస్యత పలు అంశాల మీద చర్చ. అనంతరం సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ‘తెలంగాణ నైట్’లో భాగంగా సాంస్కృతిక, జానపద కార్యక్రమాలు. టీడీఎఫ్ నేషనల్ కాన్ఫరెన్స్.. రిజిస్ట్రేషన్ ఇలా.. కార్యక్రమంలో భాగమయ్యేందుకు ముందుగా రిజిస్ట్రేషన్చేసుకోవల్సిందిగా జాతీయ కాన్ఫరెన్స్ వేడుకల కమిటీ నిర్వాహకులు సూచించారు. కిందిలింక్ల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. https://www.tdf20years.com/registration ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు, ఆహ్వానితులు వీరే.. 1. తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, 2. జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్ వెదిరే, 3.విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, 4.ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, 5.పంచాయతీ రాజ్ శాఖమంత్రి, ఎర్రబెల్లి దయాకర్‌రావు 6.భువనగిరి పార్లమెంట్ సభ్యులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి, 7.మల్కాజ్గిరి ఎంపీ రెవంత్‌రెడ్డి, 8. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, 9.ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, 10.ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, 11.మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,12. ఎమ్మెల్సీ పీ. రాజేశ్వర్ రెడ్డి, 13.మునుగోడు ఎమ్మెల్యే కే. రాజ్‌గోపాల్‌రెడ్డి, 14. జడ్పీ చైర్మన్ గండ్రా జ్యోతీ, 15. సినీ నిర్మాత దిల్ రాజ్, 16.గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, 17సంగీత దర్శకుడు కే. కార్తీక్ , 18.గాయకుడు, తెలంగాణ ప్రభుత్వ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, 19.మిమిక్రీ ఆర్టిస్ట్ ఇమిటేషన్ రాజు, 20.మోటర్ బైకర్ జై భారతీ, 21. ఇండియన్ వాలీబాల్ క్రీడాకారుడు వి. రవికాంత్ రెడ్డి, 22.మైహోం గ్రూప్స్ చైర్మన్ డా. రామేశ్వర్ రావు జూపల్లి, 23. మాజీ అమెరికా అంబాజీడర్ వినయ్ తుమ్మలపల్లి, 24.హేల్త్ కేర్ ఎంటర్ ప్రిన్యూర్ డా. దేవయ్య పగిడిపాటీ, 25. సీఎర్రా అట్లాంటిక్ సీఈఓ రాజురెడ్డి, 26. నవ్యా వెంచర్స్ ఎండీ పీ దయాకర్, 27. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సెక్రటరీ శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, 28. ప్రముఖ యాంకర్ ఉదయభాను. -
కెనడాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
కెనడాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కెనడా: కెనడాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (కెనడా) ఆధ్వర్యంలో ఈ నెల 24న టొరంటో(మిస్సిసౌగ) నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 500 మంది హాజరు కాగా, అచ్చమైన తెలంగాణ సంప్రదాయ రీతిలో బతుకమ్మ పండుగను కన్నులపండుగగా జరుపుకున్నారు. తెలంగాణ మహిళలు రంగు రంగుల బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు వివిధ రకాల పోటీలను కూడా నిర్వహించారు. అనంతరం రకరకాల సాంప్రదాయ తెలంగాణ వంటకాలతో మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా టీడీఎఫ్ కెనడా నిర్వాహకులు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతూనే, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నిలబెడుతూ ఉండే కార్యక్రమాలను చేస్తూ ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తెలంగాణ ప్రభుత్వ టూరిజం శాఖతో అనుసంధానమై ఈ కార్యక్రమం నిర్వహించబడింది. -
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు టీడీఎఫ్ ఏర్పాట్లు
హైదరాబాద్: వచ్చే జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించడానికి అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా టెక్సాస్ రాష్ట్రంలోని సాన్ ఆంటానియో టీడీఎఫ్ విభాగం గురువారం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్. దిలీప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాన్ ఆంటానియో టీడీఎఫ్ విభాగానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి బిల్లా, పాండు కదిరే, తదితరులు పాల్గొని తెలంగాణ ఆవిర్భావ నేపథ్యంపై దిలీప్ రెడ్డి గారితో ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం టీడీఎఫ్ ప్రతినిధులు దిలీప్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. -
టొరొంటోలో ‘తెలంగాణ పోరు’ పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) కెనడా ఆధ్వర్యంలో టొరొంటో నగరంలో నిర్వహించిన తెలంగాణ నైట్ నాలుగో వార్షిక సాంస్కృతిక కార్యక్రమంలో ‘తెలంగాణ పోరు ద్విశతి’ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు టీడీఎఫ్ నిర్వాహ కుడు ఎం.సృజన్ ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌లోని పింగళి మహిళా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మార్క శంకర్ నారాయణ రచించిన ఈ పుస్తకాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. రెండు భాగాలుగా ఉన్న ఈ కవితా సంపుటిలో మొదటి భాగంలో తెలంగాణ ఉద్యమ చరిత్ర, రెండో భాగంలో రచయిత పాటల్లో తెలంగాణ లొల్లి అంశాలున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మిమిక్రీ కళాకారుడు లోహిత్, సహ నిర్వాహకులు భూపతి కృష్ణమూర్తి, కేశవరావ్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పేద విద్యార్థుల చదువు కోసం 'భారతి'...
ఆర్లాండో : అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ వాదులు, మాతృభూమి అభివృద్దిలో తమ వంతు కర్తవ్యంగా భాగస్వామి అవ్వాలన్న ఆలోచనలతో మేధోమథన సదస్సును నిర్వహించారు. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) అధ్యక్షులు విశ్వేశ్వర్ కలవల అద్వర్యంలో జరిగిన ఆగ్నేయ ప్రాంతాల సదస్సులో వివిధ టీడీఎఫ్ గ్రూప్ (మెల్బోర్న్, అట్లాంటా, జాక్సన్విల్లే, ఓర్లాండో, తలహాసి, టాంప, వెస్ట్ పామ్ బీచ్, మియామీ) నాయకులతో పాటు పలువురు వైద్యులు, విద్యా వేత్తలు, వ్యాపారులు పాల్గొని పలు అభివృద్ది కార్యక్రమాల గురించి చర్చించారు. ఏంతో విశ్లేషణాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆర్థిక కారణాల వల్ల చదువు మధ్యలోనే వదిలేస్తున్న బీద విద్యార్థులకు ఆర్ధిక సహాయాన్ని అందించే 'భారతి' కార్యక్రమం గురుంచి క్షుణ్ణంగా చర్చించి, దాని విధివిధానాలను సూత్రప్రాయంగా నిర్ణయించారు. దాదాపు 300 మంది హాజరైన ఈ కార్యక్రమానికి ఫ్లోరిడాలోని ఆర్లాండో నగరం వేదికైంది. 'భారతి' కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది. దానికి ఆర్థిక సహకారం అందించడానికి చాలా మంది ముందుకొచ్చారు. అనంతరం జరిగిన తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమంలో గాయకులు పాడిన తెలంగాణ జానపద గేయాలు ఆహుతులను ఆద్యంతం అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు వైద్యులు, విద్యావేత్తలను సన్మానించారు. -
అట్లాంటాలో బతుకమ్మ సంబరాలు
అట్లాంటాలో బతుకమ్మ, దసరా సంబరాలు అట్టహాసంగా జరిగాయి. తెలంగాణ అభివృద్ధి ఫోరం(టీడీఎఫ్) ఆద్వర్యంలో జరిగిన సంబరాల్లో వందలాది మంది తెలంగాణ మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను తెచ్చి.. ఆటపాటలో వేడుక చేసుకున్నారు. మునుపెన్నడూ లేనంతగా.. సుమారు 1600 మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో తెలంగాణ గాయకులు స్వర్ణక్క, స్వరూప, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. బతుమ్మ సంబరాల అనంతరం దసరా నేపథ్యంలో శమీ పూజ నిర్వహించారు. బతుకమ్మను అందంగా రూపొందించిన మహిళలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో టీడీఎఫ్ అధ్యక్షుడు విష్ణు కలవల, ట్రస్టీలు కవిత చల్లా, విజయ్ పిట్టా, మురళి చింతలపాని, నవీన్ మామిడిపల్లి, పవన్ కొండెం తదితరులు పాల్గొన్నారు. -
డెట్రాయిట్లో వనభోజనాల సందడి
డెట్రాయిట్: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం దాదాపు 300 తెలుగు కుటుంబాలు కలిసి వనభోజనాలకు వెళ్లి సందడి చేశారు. అక్కడ ఎండాకాలం ప్రారంభం కావడంతో ఇళ్లలో నుంచి బయటికి వచ్చిఅందరూ కలిసి ఒకేచోట చేరి సేద తీరారు. ఫర్మింగ్టన్ హిల్స్‌లోని షియావసి పార్క్‌లో వివిధ రంగాలకి చెందిన తెలుగు వారు కలిసి హాయిగా గడిపారు. ప్రత్యేకమైన వంటకాలు, ఆటలు, పాటలతో ఉషారుగా గడిపారు. వివిధప్రాంతాల్లో ఉండే స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకే చోట కలిశారు. అందరు తెలుగు వాళ్లు ఒకే చోట చేరి ఆనందంగా గడిపే అవకాశాన్ని కల్పించినందుకు టీడీఎఫ్‌కు వనభోజనాలకు వచ్చిన వారు కృతజ్ఞతలు తెలిపారు. -
టీడీఎఫ్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్
అమెరికా మిస్సోరిలో గ్రేటర్ క్యాన్సస్ సిటి తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతం అయింది. ఈ కార్యక్రమానికి శ్రీ రాజ్ చీదెల్ల అధ్యక్షత వహించగా తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు శ్రీ విశ్వేశ్వర్ రెడ్డి కలవల, గీత, సుచరిత, బిందు ముఖ్య అతిధులుగా వ్యవహరించారు. మొదటగా తెలంగాణా అమరులకు సభ రెండు నిముషాలు మౌనం పాటించిన తరువాత అనంతరం జయశంకర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తరువాత కార్యక్రమ నిర్వహణలో శరత్ ముఖ్యపాత్ర పోషించారు. ఈ సందర్భంగా నాగభూషణం విద్యారంగము గురించి ప్రత్యేకంగా ప్రసంగించారు. అనంతరం సూర్యారావు గారు తాను అభివృద్ధి పరచిన తెలంగాణా ఫ్యాక్త్స్ (telanganafacts) అనే ట్విటర్ అకౌంట్ గురించి మరియు తెలంగాణా నూతన ప్రభుత్వంలో జరుగుతున్నఅభివృద్ధి కార్యక్రమాల గురించి క్లుప్తంగా వివరించారు. విశ్వేశ్వర్ కలవల మాట్లాడుతూ 60 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణా పోరాటంతో పాటు అందులో గత పదిహేను సంవత్సరాల తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం యొక్క క్రియాశీల అనుబంధం గురించి సవివరంగా వివరించారు. తరువాత గ్రేటర్ క్యాన్సస్ సిటి తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం తరపున బిందు, ఇతర ముఖ్యఅతిధుల మధ్య మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ క్యాన్సస్ సిటి తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం సభ్యులు, మేధావులు హాజరయ్యారు. -
'రాష్ట్ర అభివృద్ధికి ఎన్నారైలు సహకరించాలి'
హైదరాబాద్: రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ ఎన్నారైల పాత్ర గొప్పదని, అదే స్ధాయిలో రాష్ట్ర అభివృద్ధికి ఎన్నారైలు సహకరించాలని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ కోరారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధుల కాన్ఫరెన్స్ కాల్ లో గురువారం ఆయన పాల్గొన్నారు. దేశంలోనే మిగులు బడ్జెట్ ఉన్న కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన తెలిపారు. అందరి ఆకాంక్షలు అనుగుణంగా రానున్న బడ్జెట్ ను ప్రవేశపెడతామన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి భారతి, సంకల్పం, డాలర్ ఎ డే వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్టు వెల్లడించారు. -
బంగారు తెలంగాణ కోసం కలసివస్తున్న ఎన్ఆర్ఐలు