అట్లాంటి తెలుగువారి తెలంగాణా సంప్రదాయ పండుగ బతుకమ్మను నాలుగువేల భారీ జనసందోహం మధ్య తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అక్టోబర్ 1వ తేదీన నిర్వహించిన బతుకమ్మ, దసరా ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
స్థానిక కళాకారులు ప్రదర్శించిన రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలు ఆరంభమైనాయి. తెలుగింటి ఆడుపడుచులు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ఆహుతులను అలరించాయి. పిల్లలూ పెద్దలూ కలిసి వందకు పైగా కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. ఆరుగంటలపాటు బతుకమ్మల ఆటపాటలతో సందడిగా సాగిన ఈ వేడుక, బతుకమ్మల నిమజ్జనంతో ముగిసింది. ఆకట్టుకునే బతుకమ్మలతో మహిళలు రెండువేల డాలర్ల వరకు క్యాష్ ప్రైజులు, డైమండ్ రింగ్, సిల్వర్ కాయిన్లు సిల్వర్ బౌల్ సెట్లు, వెరా బ్రాడ్లీ పర్సులు వంటి ఆకట్టుకునే ప్రైజులు గెల్చుకున్నారు.
ఆహుతుల కోసం కాంప్లిమెంటరీ సాంప్రదాయ భోజనం ఏర్పాటు చేశారు వివిధ రకాల వెండర్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. టీడీఎఫ్ కోర్ టీమ్ సమిష్టి కృషితో ఘనమైన బతుకమ్మ పండుగను నిర్వహించి విజయవంతం చేయటం గర్వంగా ఉందని టీడీఎఫ్ అట్లాంటా చాప్టర్ అధ్యక్షురాలు స్వప్న కస్వా కృషిని కొనియాడుతూ అలాగే ఈ కార్యక్రామానికి సహకరించిన మహిళలతోపాటు, కార్యక్రమ విజయవంతం చేసిన వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
ఫోర్ ఓక్స్ ఇన్సూరెన్స్, పీచ్ క్లీనిక్, ర్యాపిడ్ ఐటీ, ఈఐయెస్ టెక్నాలజీస్, ఎవరెస్ట్ టెక్నాలజీస్ మొదలగు దాతలు స్పాన్సర్ చేయగా, టీడీఎఫ్ కోర్ టీమ్, అట్లాంటా చాప్టర్ కమిటీ, మరెందరో వాలంటీర్లు కలిసి ఈ కర్యక్రమాన్ని ఆద్యంతం రక్తి కట్టించారు.
Comments
Please login to add a commentAdd a comment