
'రాష్ట్ర అభివృద్ధికి ఎన్నారైలు సహకరించాలి'
హైదరాబాద్: రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ ఎన్నారైల పాత్ర గొప్పదని, అదే స్ధాయిలో రాష్ట్ర అభివృద్ధికి ఎన్నారైలు సహకరించాలని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ కోరారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధుల కాన్ఫరెన్స్ కాల్ లో గురువారం ఆయన పాల్గొన్నారు. దేశంలోనే మిగులు బడ్జెట్ ఉన్న కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన తెలిపారు.
అందరి ఆకాంక్షలు అనుగుణంగా రానున్న బడ్జెట్ ను ప్రవేశపెడతామన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి భారతి, సంకల్పం, డాలర్ ఎ డే వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్టు వెల్లడించారు.