డెట్రాయిట్లో వనభోజనాల సందడి | Telugus rejoice advent of summer with vanabhojanalu | Sakshi
Sakshi News home page

డెట్రాయిట్లో వనభోజనాల సందడి

Published Tue, Jun 23 2015 10:56 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM

Telugus rejoice advent of summer with vanabhojanalu

డెట్రాయిట్: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం దాదాపు 300 తెలుగు కుటుంబాలు కలిసి వనభోజనాలకు  వెళ్లి సందడి చేశారు. అక్కడ ఎండాకాలం ప్రారంభం కావడంతో ఇళ్లలో నుంచి బయటికి వచ్చిఅందరూ కలిసి ఒకేచోట చేరి సేద తీరారు. ఫర్మింగ్టన్ హిల్స్లోని షియావసి పార్క్లో వివిధ రంగాలకి చెందిన తెలుగు వారు కలిసి హాయిగా గడిపారు. ప్రత్యేకమైన వంటకాలు, ఆటలు, పాటలతో ఉషారుగా గడిపారు. వివిధప్రాంతాల్లో ఉండే స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకే చోట కలిశారు. అందరు తెలుగు వాళ్లు ఒకే చోట చేరి ఆనందంగా గడిపే అవకాశాన్ని కల్పించినందుకు టీడీఎఫ్కు వనభోజనాలకు వచ్చిన వారు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement