
లండన్: తెలంగాణలో జరుగుతున్న మహా బతుకమ్మ వేడుకలకు మద్దతుగా తెలంగాణ ఎన్నారై ఫోరం ఇంగ్లండ్ ఆధ్వర్యంలో బతుకమ్మ-దసరా ఉత్సవాలు లండన్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంబరాలకు లండన్, హౌన్‌స్లాలోని ఇండియన్ జిమ్ఖానా మైదానం వేదికవ్వగా.. యూకే నలుమూలల నుంచి సుమారు 2000 మందికి పైగా తెలంగాణవాసులు పాల్గొన్నారు. తెలుగు ఆడపడుచులంతా సంప్రదాయ దుస్తులతో బతుకమ్మలను చేతబట్టుకొని గ్రౌండ్‌కు చేరగా చిట్టి బతుకమ్మలతో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆడవారంతా బతుకమ్మ ఆట ఆడగా మగవారు గ్రామీణ వాతవరణం ఉట్టిపడేలా కోలాటం ఆడారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి ప్రసాదాలు పంచుకున్నారు.
జమ్మీ పూజ..
తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి జమ్మి ఇచ్చిపుచ్చుకొని దసరా జరుపుకున్నారు. విదేశీ గడ్డపై భారత సంస్కృతి ఉట్టిపడేలా ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహాకులు ఈ జాతరను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణా అస్థిత్వాన్ని మరియు సంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేసేందుకు చేస్తున్ననిర్వహాకుల కృషిని పలువురు ప్రశంసించారు .
పాల్గొన్న తెలంగాణ ప్రముఖులు..
ఈ మహా బతుకమ్మ వేడుకలకు తెలంగాణ నుంచి ముఖ్య అతిధులుగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండా మురళి, టి. ప్రకాష్ గౌడ్, దేవీప్రసాద్, నాగేందర్ గౌడ్, సినీ డైరెక్టర్ సురేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహకులను, ఎన్నారైలను అతిధులు ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమం నుంచి పునర్నిర్మాణంలో ఎన్నారైల పాత్ర ఎంతో ముఖ్యమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్ , అధ్యక్షులు సిక్క చంద్రశేకర్ గౌడ్, అడ్వైజరీ ఛైర్మన్ అంతటి ప్రమోద్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ గంగసాని , తిరుపతి గోలి ,ముఖ్య కార్యదర్శిలు నగేష్ రెడ్డి కాసర్ల ,కోశాధికారులు వెంకట్ రంగు, నరేష్ మరియాల ,సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి స్వామి ఆశ,, స్పాన్సర్ టీం అశోక్ మేడిశెట్టి ,భాస్కర్ మొట్ట, రాజేష్ ఎనపోతుల,మీడియా టీం - సాయి ప్రసాద్ మార్గం , శిరీష కే చౌదరి , సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి స్వామి ఆశ,స్వచ్చంద మరియు సంక్షేమ టీం - మీనాక్షి అంతటి , తెలంగాణ ఎన్నారై ఫోరం మహిళా విభాగం సభ్యులు - హేమలత గంగసాని , జయశ్రీ గంప ,జ్యోతి రెడ్డి కాసర్ల ,కవిత గోలి ,కావ్య రెడ్డి ,మేఘల ఆకుల, ప్రీతీ సీక ,ప్రియాంక కర్పూరం ,రమాదేవి తిరునగరి, ,శ్రీలక్ష్మి మర్యాల,సుచరిత కాల్వ ,వాణి రంగు,నందిని మొట్ట ,భారతి కొప్పుల ,రజిత ,వాణి రంగు, ఏరియా ఇంచార్జిలు ,వెస్ట్ & నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ - , సతీష్ వాసిరెడ్డి , ఈస్ట్ & నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ -శ్రీధర్ నల్ల ,వీరు చౌదరి, రమేష్ సింగం గౌడ్ ,శేషు కుమార్ ఆళ్ళ, సతీష్ వాసిరెడ్డి , ఈస్ట్ & నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ - ,శ్రీధర్ బాబు మంగళారపు,సంతోష్ కోడిప్యాక , వేడుకలలో పాల్గొన్న వారిలో వున్నారు.
యూకే జాగృతి ఆధ్వర్యంలో..
యూకే జాగృతి సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బర్మింగ్ హామ్, మిల్టన్ కీన్స్ , వెస్ట్ లండన్ తర్వాత చివరగా లండన్‌లోని దాగెనహమ్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మలు తీసుకొచ్చిన మహిళలకు నిర్వాహకులు చేనేత చీరలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి, దేవిప్రసాద్, నాగేందర్ గౌడ్, అరవింద్ గౌడ్, రామకృష్ణ రెడ్డి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రవాస మహిళలందరూ బతుకమ్మ స్ఫూర్తి తో ఇలా వేడుకలు చేసుకోవడం బావుందని అభినందించారు.
వచ్చే ఏడాది యూకేలోని అన్ని తెలంగాణ సంస్థలను ఏకం చేసి సంయుక్తంగా బతుకమ్మ, దసరా ఉత్సవాలను చేస్తామని అధ్యక్షుడు సుమన్ బలమూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి యూకే అధ్యక్షులు సుమన్ బలమూరి, ఉపాధ్యక్షులు పావని గణేష్, సుష్మ జువ్వాడి , శ్రవణ్ రెడ్డి, కార్యదర్శి సంతోష్ ఆకులతో పాటు ఇతర జాగృతి యూకే కమిటీ సభ్యులు పాల్గొన్నారు.