కెన్యాలో ఉట్టిపడిన తెలుగు సంస్కృతి | Bathukamma festival celebrations held in Nairobi | Sakshi
Sakshi News home page

కెన్యాలో ఉట్టిపడిన తెలుగు సంస్కృతి

Published Mon, Sep 25 2017 10:27 PM | Last Updated on Mon, Sep 25 2017 10:28 PM

Bathukamma festival celebrations held in Nairobi

నైరోబి‌: తెలంగాణలో జరుగుతున్న మహా బతుకమ్మ వేడుకలకు మద్దతుగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్‌ కెన్యా వారి ఆధ్వర్యంలో బతుకమ్మ-దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కెన్యా రాజధాని నైరోబిలో తెలుగువారందరూ ఒకచోట చేరి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. కెన్యా ఎంపీ డాక్టర్ స్వరూప్ రంజన్ మిశ్రా ఈ బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు ఆడపడుచులంతా సంప్రదాయ దుస్తులతో బతుకమ్మలను పేర్చారు. వారు వలయంగా మారి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడటంతో అక్కడ పండుగ వాతావరణం ఉట్టిపడింది. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి తీర్థ, ప్రసాదాలు పంచుకున్నారు.

1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement