నల్గొండ: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన తర్వాత జరుగుతున్న తొలి బతుకమ్మను బంగారు బతుకమ్మగా తెలంగాణ ప్రజలు వాడవాడలా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం నల్గొండ జిల్లాలోని నకిరేకల్లో ప్రముఖుల సమక్షంలో బతుకమ్మ సంబురాలు జరుపుకుంటుండగా అపశ్రుతి చోటుచేసుకుంది.
బతుకమ్మ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజీ ఒక్కసారిగా కూలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. స్టేజి కూలిపోవడంతో స్టేజిపై ఉన్నవారంతా కిందపడ్డారు. వారిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రి నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. అదృష్టవశాత్తూ ప్రమాదం తప్పింది.