హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కవితపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని వెంటనే వాటిని ఉపసంహరించుకొని అసెంబ్లీలో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని ఎమ్మెల్యే కాలనీలోని రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిం చారు. తమ ఇంటి వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తలు అనవసరంగా రాద్ధాంతం చేశారంటూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసుల తెలంగాణ జాగృతి నేతలపై కేసు నమోదు చేశారు.
దాడిని ఖండించిన టీడీపీ నేతలు...
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నివాసంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేయడాన్ని టీడీపీ నాయకులు ఎల్.రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి, పి.రాములు, వేం నరేందర్‌రెడ్డి శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు.
రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించిన ‘జాగృతి’
Published Sat, Nov 15 2014 1:34 AM | Last Updated on Sat, Aug 11 2018 7:38 PM
Advertisement
Advertisement