హుస్నాబాద్‌లో నేడు బంగారు బతుకమ్మ
ముకరంపుర/హుస్నాబాద్‌రూరల్/భీమదేవరపల్లి : తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం హుస్నాబాద్‌లో బంగారు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆర్టీసీ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాగృతి జిల్లా ఇన్‌చార్జి ప్రణీత్‌రావు, జిల్లా కన్వీనర్ జాడి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పిన బతుకమ్మ పండుగను జాగృతి సంస్థ తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తోందన్నారు.
హుస్నాబాద్‌లో జరిగే వేడుకలకు నిజామాబాద్ ఎంపీ, జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరువుతారని తెలిపారు. సాయంత్రం మల్లెచెట్లు చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు లంబాడీ నృత్యాలు, ఒగ్గుడోలు కళారూపాలతో ప్రదర్శన ఉంటుందన్నారు. సుమారు 20 వేల మంది మహిళలు వచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 200 మంది జాగృతి కార్యకర్తలు వాలంటీర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతాయని పేర్కొన్నారు.
ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి బంగారు బతుకమ్మ వేడుకను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జాగృతి జిల్లా అధికార ప్రతినిధి ఇమ్రాన్ అహ్మద్, విద్యార్థి విభాగం రాష్ట్ర కో కన్వీనర్ పసుల చరణ్, మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ గందె కల్పన, యువజన విభాగం జిల్లా కన్వీనర్ ఠాకూర్ సంగ్రామ్‌సింగ్, జిల్లా కోశాధికారి గన్నమనేని రంగారావు, పీఆర్‌వో పుల్లూరి రవీందర్, కవి నంది శ్రీనివాస్, సిటీ మహిళా కన్వీనర్ తొడుపునూరి పద్మజ, యువజన సమాఖ్య జిల్లా కో కన్వీనర్ మల్లేషం పాల్గొన్నారు.
ముల్కనూర్ టు హుస్నాబాద్..
బంగారు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు ఎంపీ కవిత మంగళవారం ఉదయం 9గంటలకు భీమదేవరపల్లి మండలం ముల్కనూరు చేరుకుంటారని జాగృతి జిల్లా కో కన్వీనర్ మూల రాంగౌడ్ తెలిపారు. స్థానిక వెంకటసాయి గార్డెన్స్‌లో సుమారు వెయ్యి మంది మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చనున్నారని చెప్పారు. ఏర్పాట్లను ఎంపీపీ సంగ సంపత్‌యాదవ్, ఎస్సై సతీష్, సర్పంచ్ వంగ రవీందర్‌గౌడ్ పరిశీలించారు.
ముల్కనూర్‌లో బతుకమ్మ పేర్చిన అనంతరం కవిత ఉదయం 10 గంటలకు హుస్నాబాద్ మండ లం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారని ఎమ్మెల్యే సతీష్‌కుమార్ తెలిపారు. 11 గంటలకు స్థానిక జయశ ంకర్ డిఫెన్స్ అకాడమీ ట్రైనింగ్ క్యాంపును సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. 11.30 గంటలకు కేజేఆర్ గార్డెన్‌కు చేరుకుని బతుకమ్మ పేర్చుతారని తెలిపారు. సాయంత్రం 5గంటలకు మల్లెచెట్టు చౌరస్తా నుంచి బతుకమ్మలతో ర్యాలీగా వెళ్లి ఆరు గంటలకు ఆర్టీసీ డిపోగ్రౌండ్‌లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.