తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను చాటే బతుకమ్మ ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాలు ఖండాంతరాలు దాటాయి.న్యూజిలాండ్ ఆక్లాండ్ సిటీలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు జ్యోతి నేతృత్వంలో తొలి రోజు జరిపే ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు అంబురాన్నంటాయి.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆడుతూ..పాడుతూ ఆక్లాండ్‌ల్లో సంబురాలు హోరెత్తాయి. అయితే ఈ ఏడాది కరోనా కరణంగా ఇంటి వద్దనే బతుకమ్మ ఉత్సవాల్ని జరుపుతున్నట్లు జ్యోతి తెలిపారు.
ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు 9 రోజులు రోజుకో రీతిలో సాగి సద్దుల బతుకమ్మతో పరిసమాప్తమవుతాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment