Auckland City
-
న్యూజిలాండ్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను చాటే బతుకమ్మ ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాలు ఖండాంతరాలు దాటాయి.న్యూజిలాండ్ ఆక్లాండ్ సిటీలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు జ్యోతి నేతృత్వంలో తొలి రోజు జరిపే ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు అంబురాన్నంటాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆడుతూ..పాడుతూ ఆక్లాండ్ల్లో సంబురాలు హోరెత్తాయి. అయితే ఈ ఏడాది కరోనా కరణంగా ఇంటి వద్దనే బతుకమ్మ ఉత్సవాల్ని జరుపుతున్నట్లు జ్యోతి తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు 9 రోజులు రోజుకో రీతిలో సాగి సద్దుల బతుకమ్మతో పరిసమాప్తమవుతాయని అన్నారు. -
న్యూజిలాండ్‌లో దాడికి గురైన భారతీయుడి మృతి
మెల్బోర్న్: న్యూజిలాండ్‌లో దాడికి గురైన భారతీయుడు తరుణ్ ఆస్థానా(25) మృతి చెందారు. ఆక్లాండ్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన ఆదివారం ఉదయం ప్రాణాలు వదిలారు. తరుణ్ చనిపోయినప్పడు ఆయన కుటుంబ సభ్యులు పక్కనే ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. ట్రయినీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తరుణ్‌పై శనివారం సెంట్రల్ ఆక్లాండ్‌లోని మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్ వద్ద దాడి జరిగింది. నైట్ క్లబ్ నుంచి స్నేహితులతో తిరిగివస్తుండగా ఆయనపై మాక్ ఫార్లాండ్(27) దాడికి పాల్పడ్డాడు. ఓ మహిళ దుస్తులపై కామెంట్ చేశాడన్న అక్కసుతోనే అతడీ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఆక్లాండ్ డిస్ట్రిక్ కోర్టులో హాజరుపరిచారు. అతడికి ఈనెల15 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలిసినా తమకు అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.