హైదరాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసిన కేసులో తెలంగాణ జాగృతి సమితికి చెందిన ప్రతినిధిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నగరంలోని ఎల్‌బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి సంస్థకు చెందిన నవీన్ గౌడ్ అనే వ్యక్తి మరో వ్యక్తి సహాయంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువరి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు.
అయితే నెలలు గడుస్తున్నా ఉద్యోగాల విషయం తేలకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు నవీన్ గౌడ్‌ను అరెస్టు చేశారు. నవీన్ కు సహాయ పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.