MLC Kavith Released Bathukamma Song 'Allipoola Vennela' AR Rahman Composed
Sakshi News home page

ఎమ్మెల్సీ కవిత రిలీజ్‌ చేసిన 'అల్లిపూల వెన్నెల' పాట

Published Tue, Oct 5 2021 6:20 PM | Last Updated on Tue, Oct 5 2021 8:06 PM

A R Rahman and Gautham Vasudev Compose Allipoola Vennela Bathukamma Song - Sakshi

Allipoola Vennela Bathukamma Song: తెలంగాణ ఆడపడుచులు ఏడాదంతా ఎదురుచూసే పండుగ 'బతుకమ్మ'. పూలనే దైవంగా ​కొలిచే ఈ పండుగ ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే కనిపించేది. కానీ ఈ వేడుకలు ఇప్పుడు పట్టణాల్లోనే కాదు విదేశాలకు సైతం పాకింది. తొమ్మిదిరోజుల పాటు జరుపుకునే ఈపండగ కోసం ఏయేటికాయేడు కొత్తకొత్త పాటలు రిలీజ్‌ అవుతూనే ఉన్నాయి.

ఈ ఏడాది బతుకమ్మ సంబరాల్లో భాగంగా తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల’ పాటను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని తన నివాసంలో దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌తో కలిసి రిలీజ్‌ చేసింది. ఐదు నిమిషాల నిడివి ఉన్న ఈ బతుకమ్మ పాటకు ఆస్కార్‌ విజేత ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. గౌతమ్‌ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన ఈ పాటకు మిట్టపల్లి సురేందర్‌ లిరిక్స్‌ అందించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఈ బతుకమ్మ పాట చిత్రీకరణ జరగడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement