bathukamma song
-
గాయకులతో కలిసి బతుకమ్మ పాట పడిన ఎమ్మెల్సీ కవిత
-
సల్మాన్ ఖాన్ సినిమాలో 'బతుకమ్మ' పాట.. క్షణాల్లోనే వైరల్
ఈమధ్య కాలంలో తెలంగాణ యాసలో ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. చాలామంది హీరోలు తమ చిత్రాల్లో తెలంగాణ యాస, పాటలు ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సినిమాలోనూ తెలంగాణ సంప్రదాయానికి పెద్దపీట వేశారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేశ్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఏప్రిల్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఓ పాట ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసు దోచేస్తుంది. ఈ చిత్రంలో తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టేలా బతుకమ్మ సాంగ్‌ను చిత్రీకరించారు. 'ముంగిట్లో ముగ్గేసి గొబ్బిల్లే పెడదామా...గడపకు బొట్టేట్టి తోరణాలు కట్టేద్దామా' అంటూ హిందీ చిత్రంలో తెలుగు పాట రావడం తెలుగు ప్రేక్షకులనే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి ఇది వెంకటేశ్ సలహా అని టాక్ వినిపిస్తుంది. ఐడియా నచ్చడంతో సల్మాన్ తన సినిమాలో పెట్టుకున్నారట. ఈ చిత్రంలో వెంకటేశ్‌కు చెల్లెలిగా పూజా హెగ్డే నటిస్తుంది. -
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాట
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా ‘సిరిమల్లెలో రామ రఘుమల్లెలో‘అనే బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి ఉ ట్టిపడేలా బతుకమ్మ పాటను రూపొందించిన జేన్నారం జెడ్పీటీసీ ఎర్ర శేఖర్ బృందాన్ని అభి నందించారు. కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడ మీ చైర్పర్సన్ దీపికారెడ్డి, ఉర్దూ అకాడమీ చై ర్మన్ ముజీబ్, హజ్ కమిటీ చైర్మన్ సలీం, టీ ఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ పాల్గొన్నారు. -
'అల్లిపూల వెన్నెల' బతుకమ్మ సాంగ్ వచ్చేసింది..
Allipoola Vennela Bathukamma Song: తెలంగాణ ఆడపడుచులు ఏడాదంతా ఎదురుచూసే పండుగ 'బతుకమ్మ'. పూలనే దైవంగా కొలిచే ఈ పండుగ ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే కనిపించేది. కానీ ఈ వేడుకలు ఇప్పుడు పట్టణాల్లోనే కాదు విదేశాలకు సైతం పాకింది. తొమ్మిదిరోజుల పాటు జరుపుకునే ఈపండగ కోసం ఏయేటికాయేడు కొత్తకొత్త పాటలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది బతుకమ్మ సంబరాల్లో భాగంగా తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల’ పాటను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని తన నివాసంలో దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్‌తో కలిసి రిలీజ్ చేసింది. ఐదు నిమిషాల నిడివి ఉన్న ఈ బతుకమ్మ పాటకు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఈ బతుకమ్మ పాట చిత్రీకరణ జరగడం విశేషం. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు! A festival of life. A celebration of togetherness. Bringing you a glimpse of the beauty of Bathukamma through "#AllipoolaVennela" along with Telangana Jagruthihttps://t.co/rJarGvmwGs — A.R.Rahman #99Songs 😷 (@arrahman) October 5, 2021 -
అకట్టుకుంటున్న మంగ్లీ బతుకమ్మ సాంగ్
-
వెన్నాచెడ్‌లో ‘మంగ్లీ’ సందడి
గండేడ్ (మహబూబ్‌నగర్): మండలంలోని వెన్నాచెడ్‌లో బుధవారం ప్రముఖ టీవీ యాంకర్ ‘మంగ్లీ’ సందడి చేశారు. గ్రామ శివారులోని బండమీది రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంగ్లీ గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల షూటింగ్లో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు షూటింగ్లో పాల్గొన్న ‘మంగ్లీ’ని చూసేందుకు తరలివచ్చారు. చదవండి: (మంగ్లీ ‘తీజ్’ మార్) బతుకమ్మతో మంగ్లీ విదేశాలకు.. నడిగడ్డ మామిడి! గద్వాల: నడిగడ్డలో పండించే మామిడికాయలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఏడు ఉద్యాన పంటలను ఎగుమతి చేసే ఉద్దేశంతో క్లస్టర్ ఆధారిత అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని మామిడితోటలను అధికారులు గుర్తించారు. దీంతో ఏపీఈడీఏకు రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో పండ్లతోటలకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఇక్కడి రైతులు మామిడితో పాటు బత్తాయి, దానిమ్మ, నిమ్మ తోటల పెంపకాన్ని చేపట్టారు. గ్లోబల్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (జీఏపీ) ప్రమాణాలకు అనుగుణంగా మామిడిని రైతులు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బంగినపల్లి, దశేరి, దశేరి–35, హిమాయత్, పెద్దరసం, చిన్నరసం, సువర్ణరేఖ, కేసరి, తోతాపురి తదితర రకాలు ఉండాలి. అనంతరం ఎగుమతి కోసం ఏపీఈడీఏ హర్ట్‌నెట్ వెబ్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం రైతులు వ్యక్తిగతంగా గాని, ఉత్పత్తిదారుల సంఘాలుగా గాని ఏర్పడాలి. ప్రస్తుతం నడిగడ్డలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జీఏపీ ప్రమాణాలకు అనుగుణంగా మామిడిని పండించి ఎగుమతి చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. పది రోజుల నుంచి ఉద్యానశాఖ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇంతవరకు 17మంది నుంచి దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. రైతులకు శిక్షణ.. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్టర్ ఎక్స్‌పోర్టు డెవలప్మెంట్ ఆథారిటీ (ఏపీఈడీఏ) ఆధ్వర్యంలో జీఏపీ ప్రమాణాలపై రైతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. విదేశాలకు ఎగుమతి చేసే మామిడి యాజమాన్య పద్ధతులు, వాడాల్సిన ఎరువులు, ఇతర మందులు సూచిస్తారు. వాటిని ఎలా పండించాలో రైతులకు వారు ప్రత్యక్షంగా వివరిస్తారు. వాస్తవానికి జిల్లాలో మామిడి తోటలను రైతులు బాగా పండిస్తున్నారు. అయితే సరైన మార్కెట్ సౌకర్యాలు లేక ఆశించిన మేర ధరలు లభించడం లేదు. ఇలాంటి తరుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వారికి గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. దీంతో పాటు మార్కెటింగ్ ఇక్కట్లను అధిగమిస్తారు. రైతులను ప్రోత్సహిస్తున్నాం క్టస్టర్ ఆధారిత అభివృద్ధి పథకం కింద మామిడి తోటలు పెంచే రైతులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తున్నాం. వివిధ రకాల ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ఈసారి విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం వచ్చినందున గిట్టుబాటు ధరలు లభిస్తాయి. – సురేష్ , జిల్లా ఉద్యానశాఖ అధికారి -
సాక్షి బతుకమ్మ పాట
-
రంగరంగ వైభవంగా... సాక్షి బతుకమ్మ పాట
బతుకమ్మ సాకి: నల్లా నల్లా రేగళ్ళ నల్లా రేగళ్ళళ్ళ బంగారంలా మెరిసేవమ్మా... మా బతుకుల్లో ఎలుగే నువ్వమ్మా... పల్లెనుండీ పట్నాలు ఆనుంచి పరదేశాలు చేరాయి ఆ అంబరాలు... ఓ బతుకమ్మ నీ సంబరాలు... వచ్చెర వచ్చెర దసర ముందర తెచ్చెర తెచ్చెర మళ్ళా జాతర పిల్లాజెల్లల సందడి జూడర పుట్టమన్నుదెద్దామ్ పదరా గూనుగు పూల గుంపును గోయరా అక్కాచెల్లెల దోసిట బోయెర పట్టూబట్టలు ప్రేమగ బెట్టర ఆడబిడ్డల పండగ ఇదిరా పల్లవి: హే రంగరంగ వైభవంగ తంగేడు పూలు గోయంగా.. ఆ సింగిడిలా వుంది నేల సిరిసిల్లా చీరగట్టంగా.. కొండామల్లి కొండామల్లి నవ్వినాది ఓనాగో గుండెనిండా సంబూరాలు పొంగినాయి ఓనాగో పంటసేలు ఊగంగా గోవులిల్లు జేరంగా పండు ముసలి పసి పడుసు అమ్మలక్కలంతజేరి సుట్టూగాముళ్లు ఆడంగా... అల్లో నేరేడల్లో మన ఊరూవాడా వాకిళ్ళలో పండగియ్యాలో అల్లో నేరేడల్లో పల్లె పాలపిట్టలు పాడె రామరామ ఉయ్యాలో (2) చరణం 1 రామరామ ఉయ్యాలో రామనె శ్రీరామ ఉయ్యాలో డప్పులతో దరువులతో సందడి షురు ఇయ్యాలో ఇద్దరక్కచెల్లెళ్ళను ఉయ్యాలో ఒక్కూరుకిచ్చిరి ఉయ్యాలో లచ్చువమ్మోరులా ఆ ఊరికెన్ని భాగ్యాలో నంది వర్దనాలు ఉయ్యాలో బీరపూలు కట్టి ఉయ్యాలో జిల్లేడు జిలుగులతో జిల్లాలన్నీ మెరవాలో పట్టుకుచ్చులు కనకాంబరాలు గుమ్మడి పూలు గుచ్చాలో తమలపాకు దూది వస్త్రం వక్కా ఊదుబుల్లలో రూపాయి కాయిన్బెట్టి లోపాలన్ని కడిగే ఆ గంగమ్మతల్లి మురిసిపోగ ఇయ్యాలో నింగే రాలినట్టు నేలా ఈనినట్టు బంగరు బతుకమ్మల ధూముధాము జెయ్యాలో... చేదబావి నీళ్ళు దోడె చంద్రకళ రావమ్మో కమ్మని నీగొంతుతొ కైగట్టి పాటబాడమ్మో అత్తా కోడలోజట్టూ వదిన మరదలోజట్టూ అమ్మగారి ఇంటికొచ్చిన ఆడబిడ్డలూ కొత్త కోడళ్ళుచుట్టూముట్టు అల్లోనేరేడల్లో మన ఊరూ చెరువుగట్టుపైన ఎన్ని అందాలో అల్లో నేరేడల్లో గ్రామ దేవతలే గౌరమ్మను ఆడుతున్నారో... చరణం 2 సెలకలే పులకించి మొలకేసే ఓ గౌరమ్మా మూగ జీవులు రాగమేదీసే ఆకుపచ్చని చీరలే బరిచే ఈ భూదేవి బతుకమ్మా ఆడగా పిలిచే పూలతో దేవుళ్ళ గొలిచే ఆనవాయితి దాటి ఇప్పుడు పూలనే దేవుళ్ళు జేసే తీరు నీదమ్మా... సిన్న పెద్దా తేడలేక అందరిని ఒక్కాడ జేర్చి ఐకమత్యం మొక్కనాటే చెట్టు నువ్వమ్మా మా బతుకు నువ్వే మెతుకు నువ్వే సిరుల బతుకమ్మా... ఊరుచివర సెరువుకెళ్ళి సద్దుల బతుకమ్మను సాగనంపి కలుపుదాము తనలో గంగమ్మనూ కరువుదీరిపోయేల కాలాలు మంచిగయ్యేలా పల్లెలన్ని పరవశించి సకల సిరులు అందుకోగ గౌరమ్మను గౌరవించాలో... అల్లో నేరేడల్లో గుండె బరువులతో బతుకమ్మను సాగనంపాలో అల్లో నేరేడల్లో వచ్చే ఏడాది తల్లీ మాకై మళ్ళా రావాలో రచన: చరణ్ అర్జున్ -
సాక్షి బతుకమ్మ పాట 2016
-
జాజిరి జాజిరి