ముందు మేకప్.. తర్వాత పేకప్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు మేకప్.. తర్వాత పేకప్ అంటూ ఎద్దేవా చేశారు. పేద ప్రజల గురించి తెలిసిన వారు.. ఫైవ్ స్టార్ హోటల్‌లో పార్టీ ప్రకటన చేయరని అన్నారు.
కొత్త వేషాలు వేసుకునే వచ్చేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కవిత అన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ ప్రజాజీవితంలోకి రావాలని కవిత అంతకుముందు డిమాండ్ చేశారు. దీనిపై పార్టీ పెట్టినప్పుడు పవన్ కూడా స్సందించారు.