మెల్‌బోర్న్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు | Telangana formation day celebrations in Moleborne | Sakshi
Sakshi News home page

మెల్‌బోర్న్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Published Sat, Jun 4 2016 9:26 PM | Last Updated on Sat, Aug 11 2018 7:51 PM

మెల్‌బోర్న్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - Sakshi

మెల్‌బోర్న్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

రాయికల్(కరీంనగర్): ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శనివారం కన్నుల పండువగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితతో పాటు ఆస్ట్రేలియాలోని మంత్రులు హాంగ్‌లిమ్, మెల్‌బోర్న్‌లోని భారత కౌన్సిలర్ జనరల్ రాకేష్ మల్హోత్ర ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. మొదటగా తెలంగాణ అమర వీరులకు తెలంగాణ ఉద్యమసిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రపంచలోని వివిధ దేశాల్లో ఉంటున్న తెలంగాణ ఉద్యోగులు, పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టి బంగారు రాష్ట్ర సాధనకు కృషిచేయాలన్నారు. తెలంగాణ జాగృతి ద్వారా ఆచార సాంప్రదాయాలను కాపాడటం కోసం చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షురాలు నిషిత రెడ్డి, జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన ఆచారి, కోశాధికారి కృష్ణారెడ్డి, నాయకులు మధు, సంతోష్, కిర ణ్, మనోజ్, సమతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement