సినీ కార్మికుడికి రామ్‌చరణ్ ఆర్థికసాయం
బంజారాహిల్స్: జులై 23న షూటింగ్ లొకేషన్‌లో గాయపడి జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు రమణకు సినీ హీరో రాంచరణ్‌తేజ్, ఉపాసన దంపతులు రూ. 3.50 లక్షలు ఆర్థిక సహాయం అందించారు.అలాగే మేకింగ్ మీడియా నిర్మాత సచిన్‌జోషి కూడా రూ. 6 లక్షల వరకు ఆర్థికసహాయం అందజేశారని తెలుగు సినీ అండ్ టీవీ అవుట్‌డోర్ లైట్‌మెన్ యూనియన్ అధ్యక్షుడు శ్రీను తెలిపారు.