ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు  | List Of Donations To CM Relief Fund In Telangana | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు 

Published Tue, Apr 7 2020 1:52 AM | Last Updated on Thu, Apr 9 2020 5:37 PM

List Of Donations To CM Relief Fund In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా, చేపడుతున్న చర్యలకు ఉపయోగపడేలా పలువురు ప్రముఖులు, సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు.  
► తెలంగాణ ఐకేపీ వీఓఏలు 1,72,61,000 రూపాయలను విరాళంగా అందించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సమక్షంలో ఐకేపీ వీఓఏల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎల్‌.రూప్‌ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు మంచికట్ల కోటేశ్వర్, ప్రధాన కార్యదర్శి మారిపెల్లి మాధవి, కోశాధికారి తిరుపతిలు ఈ విరాళాన్ని సీఎం కేసీఆర్‌కు అందించారు.  
► రాష్ట్ర మహిళా సమాఖ్యలకు చెందిన స్త్రీనిధి క్రెడిట్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ తరుఫున స్త్రీనిధి అధ్యక్షురాలు ఎస్‌.అనిత కోటి రూపాయల చెక్కును సీఎం కేసీఆర్‌కు అందించారు.  
► తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్‌ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు, మాజీ అధ్యక్షుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి సీఎంకు అందించారు. 
► తెలంగాణ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ కోటి రూపాయల విరాళం అందించింది.  దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ జి.రంజిత్‌ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు.  
► యూనిక్‌ ట్రీస్‌ రూ.25 లక్షల విరాళం అందించింది. యూనిక్‌ ట్రీస్‌ అధ్యక్షుడు రామ్‌ దేవ్‌ చెక్కును సీఎంకు అందించారు 
► తెలంగాణ స్టేట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు (టెస్కాబ్‌) కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవిందర్‌ రావు, వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. ఈ కోటి రూపాయల్లో 88 లక్షల రూపాయలు బ్యాంకు విరాళం కాగా, 8.5 లక్షలు బ్యాంకు ఉద్యోగులు, 3.5 లక్షల రూపాయలు రవిందర్‌ రావు అందించారు.  
► డీసీసీబీలు, సింగిల్‌ విండోలు కలిపి 76 లక్షల రూపాయలు అందించాయి. డీసీసీబీ చైర్మన్లు ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున, సింగిల్‌ విండో చైర్మన్లు 5వేల రూపాయల చొప్పున, ఉద్యోగులు ఒక రోజు వేతనం చొప్పున అందించారు. 
► రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 5 కోట్ల రూపాయల విలువైన మందులు, ఎన్‌ 95 మాస్కులు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్‌ లెటర్‌ ను రెడ్డీస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ సతీశ్, ఎండీ జీవీ ప్రసాద్‌ ముఖ్యమంత్రికి అందించారు.  
► ఎమ్‌ఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ 5 కోట్ల రూపాయల మందులు, ఇతర మెడికల్‌ సామగ్రి అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్‌ లెటర్‌ను ల్యాబ్స్‌ చైర్మన్‌ ఎమ్‌.సత్యనారాయణ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. 
► ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని దాతలు ‘గుడ్‌ సమరిటాన్స్‌ ఆఫ్‌ ఖమ్మం’పేరిటి ఏర్పడి రూ. రెండు కోట్ల విరాళాలు సేకరించారు. ఇందులో రూ. కోటి 75 లక్షలు విరాళాలు రాగా, రూ. 25 లక్షలను మమత వైద్య విద్యా సంస్థలు అందించారు. రెండు కోట్ల రూపాయల చెక్కును మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ సీఎంకు అందించారు. 
► అనూష ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ ఎ.జలంధర్‌ రెడ్డి రూ.50 లక్షలు, డీఈసీ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ఎండీ అనిరుధ్‌ గుప్తా 50 లక్షల రూపాయల చెక్కును సీఎంకు అందించారు 
► కేపీసీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ ఎండీ కె.అనిల్‌ కుమార్‌ 50 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. 
► ఎస్‌ఎల్‌ఎంఐ ఇన్‌ ఫ్రా ప్రాజెక్ట్స్‌ ఎండీ బి.వెంకటరెడ్డి రూ.25 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రికి అందించారు. 
► శ్రీ వెంకటేశ్వర కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ ఎం.రవీందర్‌ రెడ్డి రూ.25 లక్షల చెక్కును సీఎం కేసీఆర్‌కు అందించారు. 
► సీల్‌ వెల్‌ కార్పొరేషన్‌ ఎండీ బంగారు సుబ్బారావు రూ. 25 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు.  
► జీవీకే బయో తరపున కంపెనీ వైస్‌ చైర్మన్‌ సంజయ్‌రెడ్డి రూ.5 కోట్లు, సాగర్‌ సిమెంట్స్, వెల్జన్‌ డెనిజన్స్, రహేజా కార్పొరేట్‌ సర్వీసెస్‌   లిమిటెడ్‌ కోటి రూపాయల చొప్పున చెక్కులను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. 
► శ్రీ ఆదిత్య హోమ్స్, తెలంగాణ స్టేట్‌ ఆయిల్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్, హైదరాబాద్‌ అర్చ్‌ డైకోసిస్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ, కాకినాడ సీ పోర్ట్స్‌ లిమిటెడ్, తెలంగాణ స్పిన్నింగ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ మిల్స్‌ అసోసియేషన్‌ రూ.50 లక్షల చొప్పున విరాళాన్ని మంత్రి కేటీఆర్‌కు అందజేశాయి. 
► పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తా, యూనిక్‌ ఇన్‌ప్లేటబుల్స్‌ లిమిటెడ్, జీఎస్‌జీ బిల్డర్స్, కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్, సప్తగిరి కాంఫర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సరళ ప్రాజెక్ట్‌ వర్క్స్‌ లిమిటెడ్, వెలిజన్‌ హైడ్రాయిర్‌ లిమిటెడ్, దివ్య శక్తి పేపర్‌ మిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ట్రెండ్‌ సెట్‌ బిల్డర్స్, ఎలగన్స్‌ డెవలపర్స్‌ రూ.25 లక్షల చొప్పున విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంత్రి కేటీఆర్‌కు అందజేశాయి. 
► ఆదిత్య మ్యూజిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.31 లక్షలు సీఎంఆర్‌ఎఫ్‌కు ప్రకటించగా, గ్రీన్‌ సిటీ ఎస్టేట్, సూర్య శంకర రెడ్డి గుండేటి, నిజాం క్లబ్‌ రూ.15 లక్షల చొప్పున విరాళాన్ని కేటీఆర్‌కు అందజేశారు. 
► సాకేత్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, శ్రీ వెంకటేష్‌ గ్రానైట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ధనలక్ష్మీ ఐరన్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కేఎంవీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్, హారిక, హాసిని క్రియేషన్స్, ఏ.శ్రీనివాస్, జై రాజ్‌ ఇస్పాత్‌ లిమిటెడ్, దేవ శ్రీ ఇస్పాత్‌ లిమిటెడ్, హైదరాబాద్‌ జింఖానా క్లబ్, నవ తేజ్‌ ఇన్‌ ఫ్రా లిమిటెడ్, ఆర్‌ బీవీ ఆర్‌ రెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీ, వీరమణి బిస్కెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, డాల్ఫిన్‌ ఫుడ్స్, సంజీవని చారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.10 లక్షల చొప్పున విరాళాలకు సంబంధించిన చెక్కులను మంత్రి కేటీఆర్‌ కి అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement