
ఫణిభూషన్(20)
పటాన్‌చెరు టౌన్: మార్కులు తక్కువ వచ్చాయని తండ్రి మందలించడంతో రుద్రారం గీతం కాలేజీ బిల్డింగ్ 5వ అంతస్తుపై నుంచి దూకి ఫణిభూషన్ అనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, విద్యార్థి తల్లిదండ్రుల కథనం ప్రకారం..హైదరాబాద్‌లోని నిజాంపేట్ పరిధిలోని జయభరత్‌నగర్ కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగి రమేశ్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సూర్య ఫణిభూషన్(20) పటాన్‌చెరు మండల పరిధిలోని గీతం కళాశాలలో బీటెక్(సీఈసీ) మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విడుదల అయిన సెమిస్టర్ ఫలితాల్లో ఫణీందర్‌కు తక్కువ మార్కులు రావడంతో శుక్రవారం సాయంత్రం తండ్రి మందలించాడు. మంచిగా చదువుకోవాలని సూచించాడు.
కళాశాల ఏఎంసీ క్రాంతి కుమార్‌తో తనను ఫోన్‌లో మాట్లాడించాలని సూచించాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 7: 30 గంటలకు ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లిన ఫణిభూషన్ 8: 50 గంటలకు కాలేజీ బిల్డింగ్‌పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రగాయాలపాలైన ఫణిభూషన్‌ను గమనించిన తోటి విద్యార్థులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు మృతుడు తనంతట తానే కిందపడ్డాడా లేదా ప్రమాదవశాత్తు కింద పడి మృతిచెం దా డా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment