![JAC Complains To CBI To Probe GITAM University Land Grabs - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/26/12.jpg.webp?itok=LCIIZ_z4)
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్శిటీ భూకబ్జాలపై విచారణ జరపాలని సోమవారం ప్రజాసంఘాల జేఏసీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. 'గత 40 ఏళ్లుగా గీతం యూనివర్సిటీ భూకబ్జాలకు పాల్పడింది. వారు ఆక్రమించిన భూముల్లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారు. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజు అధికంగా వసూలు చేసింది. భూకబ్జాలు, అవినీతికి పాల్పడిన గీతం యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి. చేసిన మోసాలను రాజకీయ పలుకుబడితో గీతం యూనివర్సిటీ పెద్దలు తప్పించుకుంటున్నారు. గీతం ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. గీతం యూనివర్సిటీ అక్రమాలకు చంద్రబాబు మద్దతు తెలపడాన్ని ఖండిస్తున్నాం' అని ప్రజాసంఘాల జేఏసీ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. (ఆక్రమణలకు చరమ‘గీతం’)
Comments
Please login to add a commentAdd a comment