Land kabza
-
పల్లా రాజేశ్వర్ రెడ్డి కబ్జా చేశాడంటూ స్థానికుల ఆందోళన
-
Kokapet: రూ.100 కోట్ల స్థలానికి ఎసరు!
సాక్షి, హైదరాబాద్: కోకాపేట్లో సుమారు రూ.100 కోట్ల విలువైన స్థలంలో పాగా వేసేందుకు కబ్జారాయుళ్లు పన్నిన పథకా న్ని హెచ్ఎండీఏ అధికారులు అడ్డుకున్నారు. కోకాపేట్‌లోని సర్వే నంబర్ 117లో ఉన్న 2.5 ఎకరాల హెచ్ఎండీఏ స్థలంలో కొందరు వ్యక్తులు అక్రమంగా కంటైనర్లు, డబ్బాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్, ఎస్టేట్ అధికారులు వాటిని గుర్తించి తొలగించారు. హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ జానకీరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడు ల్లో ఎస్టేట్ విభాగం ఉద్యోగులు, ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఇటీవల మియాపూర్‌లో హెచ్ఎండీఏ స్థలాల్లో నిరి్మంచిన అక్రమ కట్టడాలపైన ఉక్కు పాదాన్ని మోపిన సంగతి తెలిసిందే. అక్కడ పెద్ద ఎత్తున రక్షణ చర్యలు చేపట్టారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు అన్ని ప్రాంతాల్లో హెచ్ఎండీఏ భూములను జియోఫెన్సింగ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారాన్ని కొనసాగించేందుకు చంద్రబాబు వదిలిన బుల్ బుల్ పిట్ట బోల్తా కొట్టింది. టీడీపీ గూటి చిలుక, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌తో సోషల్ మీడియాలో చంద్రబాబు సాగించిన దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే పచ్చ ముఠా సభ్యుడైన ఆయన చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగి అడ్డంగా దొరికిపోయారు. తన తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న భూములకు మ్యుటేషన్ చేయడంలేదని, అందుకు ల్యాండ్ టైట్లింగ్ చట్టమే కారణమనే భావన కలిగిస్తూ అసత్య ఆరోపణలు చేశారు. దీంతో నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. అసలు ఇంకా అమలులోకి రాని చట్టం దుర్వినియోగం కావడం ఏమిటంటూ మండిపడ్డారు. మరోవైపు తీగ లాగితే డొంక కదిలింది. ఆయన చెబుతున్న 11.04 ఎకరాల భూమిని పీవీ రమేశ్ కుటుంబం కబ్జా చేసిందన్న విషయం ఆధారాలతో సహా బయటç³డింది. ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు భూమలు కబ్జా చేసేసి, న్యాయస్థానం తీర్పును కూడా ధిక్కరిస్తున్న పీవీ రమేశ్ బరితెగింపు బట్టబయలైంది.పీవీ రమేశ్ కుటుంబమే భూ దొంగపీవీ రమేశ్ చేసిన దుష్ప్రచారం ఆయన కుటుంబం భూ కబ్జాను కూడా వెలుగులోకి తెచ్చింది. ఏ భూమి గురించి అయితే పీవీ రమేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారో.. ఆ భూమి ఆయన కుటుంబం కబ్జా చేసిందన్న విషయం కూడా బయటపడిపోయింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోటలో 25ఏళ్ల క్రితం పలువురు రైతులు తమ భూములను కలిపి దాదాపు 100 ఎకరాల్లో చెరువు తవ్వి సహకార వ్యవసాయం తరహాలో చేపల సాగు చేపట్టారు. ఈ భూముల్లో పీవీ రమేశ్ తండ్రి పెనుమాక సుబ్బారావుకు చెందినవి 11.04 ఎకరాలు ఉన్నాయి. కానీ వాటిలో 3.29 ఎకరాల అసైన్డ్ భూమి, 0.29 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు తన భూమి కూడా ఉందని గాలంకి నాగేంద్ర అనే వ్యక్తి న్యాయస్థానంలో గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం పెనుమాక సుబ్బారావు ఆక్రమించిన భూమిని తిరిగి ఇచ్చేయాలని 2022లోనే తీర్పునిచ్చింది. పీవీ రమేశ్ పరపతికి భయపడి ఆ తీర్పును అధికారులు అమలు చేయలేకపోయారు. దాంతో బాధితుడు నాగేంద్ర కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. అంటే పీవీ రమేశ్ ఆయన తండ్రి నుంచి వచ్చిన వారసత్వ భూమిగా చెబుతున్న 11.04 ఎకరాలు ఆయన కుటుంబం కబ్జా చేసిన భూమి అన్న విషయం బయటపడింది.కబ్జా భూమికి మ్యుటేషన్ సాధ్యం కాదన్న అధికారులుఅయినా సరే తమ కుటుంబం కబ్జా చేసిన భూములను తమ పేరిట మ్యుటేషన్ చేయాలని పీవీ రమేశ్ యత్నించడం గమనార్హం. ఆ మేరకు ఆయన 2023 డిసెంబర్ 16న రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. తన తండ్రి పెనుమాక సుబ్బారావు మరణించినందున ఆయన పేరిట ఉన్న భూములను తమ పేరిట మ్యుటేషన్ చేయాలని కోరారు. అప్పటికే ఆ భూములపై న్యాయ వివాదం ఉందన్న విషయం రెవెన్యూ అధికారులకు తెలుసు. కబ్జా భూములను ఖాళీ చేయాల్సింది పోయి, మ్యుటేషన్ చేయాలని కోరడంతో పీవీ రమేశ్ దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు 2023 డిసెంబర్ 30న అధికారులు ఆయనకు లిఖితపూర్వకంగా తెలిపారు.తొందరపడి అబద్ధం కూసి.. ఆపై మరోపోస్టు పెట్టివైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే చంద్రబాబు కుట్రలో పాత్రధారి అయిన పీవీ రమేశ్ సోమవారం ఉదయం సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టారు. ‘తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములను మ్యుటేషన్ చేయడానికి రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే ఆర్డీవో తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఓ ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేసిన ఓ అధికారి పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య రైతుల దుస్థితి ఊహించలేం’ అంటూ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూహక్కు చట్టం (ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్)పై దుష్ప్రచారం చేయాలన్న చంద్రబాబు కుట్రను పక్కాగా అమలు చేశారు. ప్రజల్ని తప్పుదారి పట్టించాలన్న దుర్బుద్ధితో పీవీ రమేశ్.. అసలు ఆ చట్టం రాష్ట్రంలో ఇంకా అమల్లోకి రాలేదన్న అసలు విషయాన్ని విస్మరించారు. వెంటనే నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చట్టం ఇంకా అమల్లోకి రాకముందే ఎలా దుర్వినియోగం అవుతోందని అంటారు అంటూ నిలదీశారు. దాంతో బండారం బయటపడుతుందన్న ఆందోళనతో పీవీ రమేశ్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో తన పోస్టును ఎడిట్ చేశారు. ‘చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులేకుండా చేస్తున్నారు’ అంటూ పోస్టులో మార్పు చేశారు.ఆయన తండ్రిపై వరకట్న వేధింపుల కేసు కూడాపీవీ రమేశ్ తండ్రి పెనుమాక సుబ్బారావు భూముల కబ్జాకు పాల్పడటమే కాదు.. ఆయనపై క్రిమినల్ కేసులు కూడా గతంలో నమోదు కావడం గమనార్హం. కట్నం కోసం కోడల్ని మానసికంగా, శారీరకంగా హింసించారన్న కారణంతో ఆయనపై విజయవాడ పోలీసులు 2018లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. పీవీ రమేశ్ సోదరుడు రాజశేఖర్ జోషి భార్య పెనుమాక సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 1999లో తన పెళ్లి సమయంలో రూ.2 లక్షల కట్నం, నాలుగు ఎకరాల మామిడి తోట, కారు కట్నంగా ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల తల్లినైన తనను వేధిస్తున్నారంటూ భర్త పెనుమాక రాజశేఖర్ జోషి, మామగారు పెనుమాక సుబ్బారావు, అత్తగారు పెనుమాక మణిలపై ఆమె ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ముగ్గురిపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. భూముల రీ సర్వేకు పీవీ రమేశ్ కుటుంబం హాజరు కాలేదని, కబ్జా చేసిన భూమిని పీవీ రమేశ్ పేరిట మ్యుటేషన్ చేయటం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు రీసర్వేకు ముఖం చాటేసిన పీవీ రమేశ్అంతేకాదు.. తమ భూకబ్జా బాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతోనే పీవీ రమేశ్ రెవెన్యూ అధికారుల రీ సర్వేకు ముఖం చాటేశారు. పీవీ రమేశ్ చెబుతున్న చెరువు భూముల్లో కూడా రీసర్వే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. తద్వారా ఆ రైతుల భూములకు హద్దులను నిర్ణయించి వారి పేరిట పత్రాలు ఇవ్వాలని భావించారు. అందుకోసం ఈ ఏడాది (2024) ఫిబ్రవరి 26న కృష్ణా జిల్లా కలెక్టర్ జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని కూడా నియమించారు. దాంతో గుడివాడ ఆర్డీవో ఆ చెరువు భూముల్లో 2024 మార్చి 5న నిర్వహించనున్న ఉమ్మడి సర్వేకు హాజరుకావాలని, ఇందుకు భూముల ఒరిజినల్ పత్రాలను తీసుకురావాలని భూ యజమానులు, రిట్ పిటిషన్లు దాఖలు చేసినవారందరికీ నోటీసులు జారీ చేశారు. పీవీ రమేశ్ కుటుంబానికి కూడా నోటీసులు జారీ చేశారు. ఆ రోజున రైతులందరూ వచ్చారు. వారి భూముల పత్రాలను చూపించి రీ సర్వేకు సహకరించారు. కానీ పీవీ రమేశ్ గానీ ఆయన కుటుంబ సభ్యులుగానీ ఆ రీ సర్వేకు హాజరు కాలేదు. రెవెన్యూ అధికారులు ఎన్ని సార్లు ఫోన్లు చేసినా, వాట్సాప్ ద్వారా సందేశాలు పంపినా వారు హాజరుకాలేదు. దాంతో అందరు రైతులు వచ్చి పత్రాలు చూపించే వరకు రీసర్వే పూర్తి చేయడం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అదీ పీవీ రమేశ్ కుటుంబ భూకబ్జా బాగోతం. -
రోడ్డు స్వరూపం మార్చేశారు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ శివార్లలోని బుద్వేల్‌లో దళితులకు చెందాల్సిన 26 ఎకరాల భూమి కబ్జా చేశారనే కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన కొత్తగా వేస్తున్న వెంచర్ కోసం గతంలో నిర్మించిన విల్లాల్లోని ప్రైవేటు రోడ్డు పబ్లిక్ రోడ్డుగా స్వరూపం మార్చేశారు. అలాగే ఓ నాలాపై అనుమతుల్లేకుండానే వంతెన నిర్మించారు. ఈ అక్రమాలపై రామ్దేవ్గూడలోని వెస్సెల్లా మెడోస్ నివాసితులు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదై దర్యాప్తు మొదలవడంతో దిగివచ్చిన శివానందరెడ్డి... తన తప్పులు సరిదిద్దుకొనేలా జీహెచ్ఎంసీకి మరో దరఖాస్తు చేశారు. ఈ వ్యవహారం మొత్తంలో అధికారుల ఉదాశీనత, శివానందరెడ్డి లాబీయింగ్ స్పష్టంగా కనిపిస్తోందని వెస్సెల్లా మెడోస్ నివాసితులు చెబుతున్నారు. కొత్త వెంచర్‌కు రోడ్డు లేక... మాండ్ర శివానందరెడ్డి సీఈఓగా ఉన్న వెస్సెల్లా గ్రూప్ రామ్‌దేవ్‌గూడ ప్రధాన మార్గంలో తారామతి–బారాదరి ఎదురుగా 38 ఎకరాల్లో వెస్సల్లా మెడోస్ పేరుతో 295 త్రీ, ఫోర్, ఫైవ్ బీహెచ్‌కే విల్లాలు నిర్మించడానికి 2017లో జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకుంది. అప్పట్లో ఈ విల్లాస్ లోపల రెండు అంతర్గత ప్రైవేటురోడ్లు ఉండేలా రూపొందించిన ప్లాన్‌కే అధికారులు అనుమతి ఇచ్చారు. కొన్నాళ్ల క్రితం వెస్సెల్లా గ్రూప్ పాత వెంచర్‌కు వెనుక వైపు నాలా పక్కన మరో 9 ఎకరాల్లో మరో వెంచర్ మొదలుపెట్టింది. ప్రధాన రహదారి నుంచి ఈ వెంచర్‌కు చేరుకోవాలంటే సమీప మార్గం లేదు. ఈ నేపథ్యంలోనే శివానందరెడ్డి మరో కుట్రకు తెరలేపారు. వెస్సెల్లా మెడోస్‌లో ఉన్న రెండు ప్రైవేట్ రహదారుల్లో ఒకదాన్ని పబ్లిక్ రోడ్డుగా అక్రమంగా మార్చేశారు. ఈ మేరకు రివైజ్డ్ ప్లాన్‌తో 2022లో జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని అధికారులు ఆమోదించడంతో వెస్సెల్లా మెడోస్‌లోని ప్రైవేట్ రోడ్డు పబ్లిక్ రోడ్డుగా మారిపోయి వెనుక ఉన్న 9 ఎకరాల వెంచర్‌ను ప్రధాన రహదారికి దగ్గర చేసింది. ఈ రెండు వెంచర్ల మధ్య ఓ నాలా ఉండటంతో ఇరిగేషన్ విభాగం సహా ఎవరి అనుమతి లేకుండానే ఆయన దానిపై వంతెన నిర్మించారు. బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి.. వెస్సెల్లా మెడోస్ శాంక్షన్డ్ ప్లాన్‌కు విరుద్ధంగా తమ ప్రైవేటు రోడ్డును పబ్లిక్ రోడ్డుగా శివానందరెడ్డి మార్చేసినట్లు నివాసితులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలిసింది. దీంతో 6 విల్లాలకు చెందిన యజమానులు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఐపీసీలోని 420, 406 సెక్షన్ల కింద అదే నెల 8న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు నమోదు కాకుండా చూసేందుకు శతవిధాలా శివానందరెడ్డి ప్రయత్నించినప్పటికీ ఉన్నతాధికారుల జోక్యంతో కేసు నమోదై దర్యాప్తు ప్రారంభం కావడంతో ఆయన హైకోర్డును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ వేశారు. తనపై కేసు కొట్టేయాల్సిందిగా కోరారు. దీనికి అంగీకరించని న్యాయస్థానం... నిందితులకు సీఆరీ్పసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించి కేసు దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేసింది. దీంతో గత్యంతరం లేక శివానందరెడ్డి వెస్సెల్లా మెడోస్కు సంబంధించి తాను సమర్పించిన రివైజ్డ్ ప్లాన్‌ను రద్దు చేయాలంటూ జీహెచ్ఎంసీకి మరో దరఖాస్తు సమర్పించినట్లు తెలిసింది. కాగా, జీహెచ్ఎంసీ అధికారులను మోసం చేసి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఈ కేసులో శివానందరెడ్డిపై పోలీసులు అదనపు సెక్షన్లు జోడించాలని వెస్సెల్లా మెడోస్ నివాసితుడు ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ కోరారు. -
రామోజీరావు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు: గోనె ప్రకాశ్
-
అల్లూరయ్య అక్రమాలు.. టీడీపీ ముఖ్యనేత సతీమణికి భారీగా అవినీతి సొమ్ము
తీగలాగితే డొంక కదిలినట్లు.. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఓ చిరుద్యోగి ఇంట్లో సోదాలు చేస్తే మాజీ మంత్రి బొజ్జల అనుచరుల అక్రమాల పర్వం వెలుగుచూసింది. రాజీవ్‌నగర్‌లో నిరుపేదలకు కేటాయించిన స్థలాలను ఇష్టారాజ్యంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్న వైనం పట్టణ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో పురపాలక ఉద్యోగి అల్లూరయ్యను అడ్డుపెట్టుకుని కొందరు టీడీపీ నాయకులు యథేచ్ఛగా ప్లాట్లు విక్రయించేశారనే విషయం తెలియడంతో లబి్ధదారులు లబోదిబోమంటున్నారు. మాయమాటలు చెప్పి తమ పట్టాలు తీసుకుని ఫోర్జరీ సంతకాలతో తెగనమ్మేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా మరికొందరు పచ్చనేతలు అందినకాడికి స్థలాలను ఆక్రమించుకున్నట్లు ఆరోపిస్తున్నారు. శ్రీకాళహస్తిలో దివంగత నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గంలో మంచి డిమాండ్ ఉన్న రాజీవ్ నగర్ కాలనీలోని ప్లాట్లను బొజ్జల అనుచరులు ఒక్కొక్కటిగా అమ్ముకుని సొమ్ముచేసుకున్నారు. అసలైన లబ్ధిదారుల సంతకాలను ఫోర్జరీ చేసి విక్రయించుకుంటున్నారు. మంగళవారం రాత్రి శ్రీకాళహస్తిలో అల్లూరయ్య అనే మున్సిల్ ఉద్యోగి నివాసంలో అధికారులు చేపట్టిన సోదాలో బయటపడ్డ పట్టాలే ఇందుకు నిదర్శనం. సాక్షి, తిరుపతి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాజీవ్‌నగర్ కాలనీ పేరుతో ఇల్లులేని పేదలకు గూడు కల్పించాలని నిర్ణయించారు. శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గంలో అందుకు అవసరమైన భూములను సేకరించారు. సుమారు 6వేల మంది పేదలకు రెండు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. పక్కాగృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో రాజీవ్ నగర్ అభివృద్ధి అటకెక్కింది. తర్వాత ప్రభుత్వాలు రోడ్లు, తాగునీరు తదితర మౌలిక కలి్పంచకపోవటంతో అక్కడ ఇల్లు కట్టుకునేందుకు లబి్ధదారులు సైతం పెద్దగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో హౌసింగ్‌శాఖలో కాంట్రాక్టు కింద పనిచేస్తున్న అల్లూరయ్య మాయమాటలు చెప్పి లబి్ధదారుల పట్టాలను తీసిపెట్టుకున్నాడు. అరాకొర ధరలకే కొన్ని ప్లాట్లను అమ్ముకుని జేబులో వేసుకున్నాడు. ఈ విషయం అప్పట్లోనే బయటపడడంతో నాటి ప్రభుత్వం వెంటనే అల్లూరయ్యను ఉద్యోగం నుంచి తొలగించింది. టీడీపీ హయాంలో రెచ్చిపోయి.. టీడీపీ ప్రభుత్వంలో అల్లూరయ్య శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. తొలుత అటెండర్‌గా చేరి అవినీతి పర్వానికి తెరతీశాడు. ఆ సమయంలోనే 30 మంది మున్సిపల్ ఉద్యోగుల పీఎఫ్ సొమ్మును కాజేశాడనే ఆరోపణలతో సస్పెండయ్యాడు. అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేత సతీమణికి రూ.20లక్షలు ముట్టజెప్పి, 2018లో అదే కార్యాలయంలో జూనియర్ అసిప్టెంట్గా ఉద్యోగం పొందాడు. ఇక అప్పటి నుంచి మున్సిపల్ ఆఫీస్‌లో అల్లూరయ్య ఆడింది ఆట.. పాడింది పాటగా మారిపోయింది. అదే సమయంలో అల్లూరయ్య వద్ద ఉన్న ఇంటి పట్టాల విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బొజ్జల అనుచరులు నలుగురు రంగంలోకి దిగారు. లబి్ధదారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.100 డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్నారు. దొరికిన స్థలాలను దొరికినట్లు ఇష్టారాజ్యంగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. వందలాది పట్టాలు వెలుగులోకి.. రాజీవన్నగర్లో నాడు రూ.30వేలు ఉన్న ఇంటి స్థలం.. నేడు రూ.5లక్షలకు చేరడంతో అల్లూరయ్య దగ్గర ఉన్న పట్టాలను టీడీపీ నేతలు బయటకు తీయించారు. తాము ఇది వరకే సిద్ధం చేసుకున్న రూ.100 డాక్యుమెంట్లను చూపించి కొనుగోలుదారులను బురిడీ కొట్టించడం ప్రారంభించారు. తమకు నగదు అవసరమని, అందుకే రూ.5లక్షల ప్లాటుని రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకే ఇచ్చేస్తున్నామని ప్రచారం చేపట్టారు. ఆ ప్రాంతంలో పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే ప్లాటు వస్తుందని స్థానికులు పెద్దసంఖ్యలో కొనుగోలు చేశారు. ఇలా సుమారు వెయ్యి ప్లాట్ల వరకు విక్రయించినట్లు తెలిసింది. ఇవి కాకుండా అల్లూరయ్య ఇంట్లో అధికారులు జరిపిన సోదాల్లో మరో 2,309 పట్టాలు దొరకడం గమనార్హం. టీడీపీలోని నలుగురు నేతలు, అల్లూరయ్య చేస్తున్న అక్రమాలను తెలుసుకున్న మరికొందరు ఆ పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కరు 5 నుంచి 10 ప్లాట్ల వరకు ఆక్రమించుకున్నట్లు సమాచారం. భాగోతం బట్టబయలు! రాజీవ్‌నగర్‌లో ఇంటి స్థలాలకు రేటు పలకుతుండడంతో అల్లూరయ్య దగ్గర పట్టాలు ఇచ్చిన లబి్ధదారుల్లో కదలిక వచ్చింది. తమ పట్టాలను వెంటనే ఇవ్వాలని అల్లూరయ్యను కోరారు. అయితే తన వద్ద ఎలాంటి పట్టాలు లేవని తెగేసి చెప్పడంతో ఖంగుతిన్నారు. ఈ విషయాన్ని వెంటనే ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి విచారణకు ఆదేశించడంతో బొజ్జల అనుచరుల భాగోతం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెరిగిన డిమాండ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గం అభివృద్ధి పథంలో పయనించింది. అక్కడ జగనన్న కాలనీ పేరుతో 2 వేల మందికి పైగా పక్కాఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. లే అవుట్‌ని సుందరంగా తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సైతం ఆ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నవరత్నాల ఆలయాన్ని నిర్మించారు. జగన్న కాలనీకి ఎదురుగానే ఉన్న రాజీవ్‌నగర్‌కి పైన కొండచుట్టు కోసం ‘దేవుడి బాట’ పేరుతో 20 కిలోమీటర్ల రహదారి ఏర్పాటు చేశారు. కాలనీకి పకడ్బందీగా నీటి సౌకర్యం కలి్పంచారు. దీంతో రాజీవ్‌నగర్ కాలనీలోని ప్లాట్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. -
Sabbam Hari: లాన్ వెనక మాస్టర్ ప్లాన్?.. ఎవరీ అప్పారావు...?
సాక్షి, విశాఖపట్నం: సబ్బు బిళ్ల.. కుక్క పిల్ల కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. గెడ్డలు, పార్కు స్థలాలు.. కావేవీ ఇంటి నెంబర్లను కేటాయించేందుకు అనర్హం అన్నట్టు జీవీఎంసీ తయారైంది. పదేళ్లుగా మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి వెనక తూర్పున గల ఖాళీ స్థలంలో రెండు షెడ్లు ఉన్నట్టుగా పేర్కొని ఏకంగా ఇంటి నెంబర్లను కూడా జీవీఎంసీ కేటాయించింది. అప్పారావు పేరు మీద 355 గజాల స్థలానికి 50–1–40/18(3), 50–1–40/(4) ఇంటి నెంబర్లను ఇచ్చింది. ఈ స్థలం విలువ మార్కెట్లో రూ.5 కోట్ల పైమాటే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ స్థలాన్ని విక్రయించేందుకు కొద్ది మంది రంగంలోకి దిగినట్టు సమాచారం. కేవలం ఇంటి నెంబర్లతో పాటు 1980 ప్రాంతంలో అగ్రిమెంటు చేసుకున్న కాగితాలతోనే ఈ స్థలాన్ని విక్రయించేందుకు పావులు కదులుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అసలు ఖాళీ స్థలంలో షెడ్లు ఉన్నట్టుగా ఇంటి నెంబర్లు ఎలా ఇచ్చారు? ప్లాన్ అనుమతి తీసుకున్నారా? తీసుకుంటే అసలు ఇళ్లు ఎక్కడకు వెళ్లాయి? అనే వివరాల లోతుల్లోకి వెళితే అసలు వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబ్బం హరి ఇంటి ప్లాన్‌లో కూడా అప్పారావుకు షెడ్డు ఉన్నట్లు చూపించారు. ఎవరీ అప్పారావు...? వాస్తవానికి సీతమ్మధారలోని సబ్బం హరి ఇంటి వెనకాల తూర్పు వైపున లాన్ ఉంది. దీనికి ఆనుకుని జీవీఎంసీ పార్కు ఉంది. ఇన్ని రోజులుగా ఈ లాన్ మొత్తం సబ్బం హరి ఇంటి ఆవరణ భాగమని అందరూ అనుకున్నారు. ఈ స్థలం కాస్తా ఎం.అప్పారావు పేరు మీద ఉంది. తాజాగా సబ్బం హరి తీసుకున్న రుణంపై ఆయన ఆస్తులను అటాచ్ చేసుకుంటామంటూ న్యాయవాది ద్వారా వచ్చిన ప్రకటనలోనూ సబ్బం హరి ఇంటికి తూర్పు భాగంలో ఉన్న స్థలం అప్పారావుకు చెందిన షెడ్లుగా పేర్కొన్నారు. అయితే, ఇంతకీ ఎవరీ అప్పారావు అంటే సబ్బం హరికి శిష్యుడుగా ఉండేవారని తెలుస్తోంది. తన స్థలాన్ని ఇన్ని రోజులుగా లాన్‌గా ఉపయోగించుకుంటున్నా అప్పారావు ఎందుకు మిన్నకుండిపోతున్నారు? అసలు షెడ్లు లేకపోయినప్పటికీ పదేళ్లకుపైగా ఎందుకు అప్పారావు ఇంటి పన్ను చెల్లిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలంటే మొదటగా జీవీఎంసీకి ప్లాన్ ఇచ్చి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జీవీఎంసీకి చెందిన పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది ఇవేవీ లేకుండానే అప్పట్లో ఇంటి నెంబర్లను ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జీవీఎంసీ అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.5 కోట్ల స్థలంపై కన్ను...! ఇన్ని రోజులు ఇంటి లాన్‌గా ఉపయోగించుకుంటున్న స్థలం తమదేనని సబ్బం హరి కుటుంబీకులు భావిస్తున్నారు. సబ్బం హరి మరణం తర్వాత కూడా ఇదంతా తమ స్థలమేనని భ్రమలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తాజాగా కోర్టు నుంచి అటాచ్మెంట్ వ్యవహారంలో తమ ఇంటి సరిహద్దుల్లో తూర్పువైపు అప్పారావు షెడ్లు ఉన్నట్టు చూపించారు. తీరా చూస్తే తూర్పు వైపునకు లాన్‌కు ఆనుకుని జీవీఎంసీ పార్కు మాత్రమే ఉంది. దీనితో అసలు వ్యవహారాన్ని కొద్ది మంది డాక్యుమెంట్లతో సహా వెలికితీసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రూ.5 కోట్లకుపైగా విలువ చేసే ఈ 355 గజాల స్థలాన్ని తక్కువ ధరకు తమ చేతుల్లోకి తీసుకునేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సబ్బం హరి కుటుంబీకుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ స్థలం వ్యవహారంపై మరింత లోతుల్లోకి వెళ్లి జీవీఎంసీ రికార్డులను పరిశీలిస్తే ఇన్ని రోజులుగా లాన్‌గా ఉపయోగించుకుంటూ అనుభవించిన సబ్బం హరి కుటుంబీకుల పాత్ర ఉందా? ఇంకా తెరవెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయం తేలనుంది. -
అర్ధరాత్రి పూట స్టేలు అవసరం ఏముంది: సన్యాసి పాత్రుడు
సాక్షి, అనకాపల్లి: వందల ఎకరాలు దానం చేశామని చెప్పుకుంటున్న అయ్యన్న రెండు సెంట్లు స్థలం కోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నాడో అర్థం కావడం లేదని ఆయన సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు అన్నారు. ఈ మేరకు నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఆక్రమించిన రెండు సెంట్లు స్థలం రావనపల్లి రిజర్వాయర్ కాలువకు సంబంధించింది. అయ్యన్న ఆక్రమించిన స్థలంపై రిజర్వాయర్ కమిటీ మొదట్లోనే అభ్యంతరం తెలిపింది. అభ్యంతరం తెలిపిన వారిపై కక్షసాధింపు చర్యలకు దిగారు. వారివి కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. రెండు సెంట్లు స్థలం మీదే అయినప్పుడు ఎందుకు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి పూట స్టేలు తెచ్చుకోవలసిన అవసరం ఏముంది. కోస్తా టైగర్ అని చెప్పుకునే అయ్యన్న ఎందుకు దాక్కున్నారు. 276 సర్వేనెంబర్లో ఆక్రమించారని అధికారులు చెబుతుంటే మీరు 277 సర్వేనెంబర్ చూపిస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీకి అయ్యన్న కుటుంబం భూములు ఇవ్వలేదు. మా తాత ముత్తాతలు ఇచ్చారు, దానిని గొప్పగా చెప్పుకుంటున్నారు. అయ్యన్న భార్య మహానటి సావిత్రిని మించి నటించింది. మేము పార్టీ మారినప్పుడు నన్ను నా కొడుకుని పంపించడానికి రౌడీలను పంపారని' చింతకాయల సన్యాసిపాత్రుడు అన్నారు. చదవండి: (పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
Varadapuram Suri: అక్రమాల ‘వరద’పై ఎందుకింత ప్రేమ!
ఆయనో ‘భూ’చోడు. ఫోర్జరీలు చేయడం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య. వాటి ఆధారంగా భూదందాలకు పాల్పడి రూ.కోట్లకు పడగలెత్తాడు. ఆయన అక్రమాలు అధికారిక విచారణల్లోనూ వెల్లడయ్యాయి. అయినా చర్యలు మాత్రం తీసుకోవడంలేదు. ఆయన పట్ల అధికారులు ఎందుకింత ప్రేమ కనబరుస్తున్నారో ఎవరికీ అంతుపట్టని విషయం. సాక్షి, పుట్టపర్తి: అనంతపురం కలెక్టర్ కార్యాలయం నుంచి జేఎన్టీయూకు వెళ్లే దారిలో నవోదయ కాలనీ 80 అడుగుల రోడ్డు పక్కనే ఉన్న 6.35 ఎకరాల భూమిని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత వరదాపురం సూరి కాజేశారు. సుమారు రూ.129 కోట్ల విలువ చేసే ఈ భూమిని నకిలీ డాక్యుమెంట్లతో అత్యంత చాకచక్యంగా తన ఖాతాలో వేసుకున్నారు. అక్రమ పద్ధతుల్లో భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేలినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ మినహా క్రిమినల్ చర్యలు చేపట్టకుండా రిజిస్ట్రేషన్ అధికారులు తాత్సారం చేస్తుండగా...కలెక్టర్ నియమించిన ఉన్నతాధికారుల కమిటీ కూడా నివేదిక సమర్పణలో జాప్యం చేస్తోంది. మోసం చేశారిలా.. రాళ్లపల్లి నారాయణప్ప అనే వ్యక్తి 1929లో అప్పటికే పింఛన్ తీసుకుంటున్న గుండూరావు నుంచి జేఎన్టీయూకు వెళ్లే దారిలోని సర్వే నంబర్ 301లో 7.77 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. నారాయణప్ప పెద్ద మనవడు పెద్ద ఉలిగప్పకు 1933లో హక్కు విడుదల చేశారు. ఆయన 1935లో బ్యాంకులో మార్ట్గేజ్ చేసి రుణం కూడా పొందారు. రాళ్లపల్లి నారాయణప్ప నుంచి తర్వాత నాలుగు తరాల వారికి భూమి మారుతూ వచ్చింది. అయితే, దొడ్డమనేని మాలతేష్ అనే వ్యక్తి గుండూరావు తన చిన్నాన్న అని పేర్కొంటూ నవంబర్ 19, 1985 తారీఖుతో అన్ రిజిస్టర్డ్ వీలునామా పేరిట నకిలీ పత్రాలు సృష్టించారు. వీటి ఆధారంగా 2018లో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై 301–3 సర్వే నంబరులో 6.35 ఎకరాల భూమిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. చదవండి: (శ్రీరస్తు.. కల్యాణమస్తు: 23 దాటితే డిసెంబర్ వరకు ఆగాల్సిందే!) అనంతరం డిసెంబర్ 23, 2021లో మాలతేష్ నుంచి 6.35 ఎకరాలను వరదాపురం సూరి కుమారుడు నితిన్ సాయి, ధర్మవరానికి చెందిన యంగలశెట్టిరాజు (సూరి అనుచరుడు) కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాస్తవానికి గుండూరావు 1929 నాటికే ప్రభుత్వ పింఛన్ తీసుకుంటున్నారు. అంటే అప్పటికే ఆయనకు 60 ఏళ్లు పూర్తయి ఉంటాయి. దీన్నిబట్టి 1985 నాటికి గుండూరావు వయసు 116 ఏళ్లు! అంతటి వయస్సు ఉన్న వ్యక్తి అన్‌రిజిస్టర్డ్ వీలునామా ఎలా రాయిస్తారో అర్థం కాని విషయం. ఈ అన్ రిజిస్టర్డ్ వీలునామా ఫోర్జరీ అని ఆర్డీఓ కోర్టు సైతం నిర్ధారించింది. అయినప్పటికీ వరదాపురం సూరి తన గ్రామానికే చెందిన సబ్రిజి్రస్టార్ను లోబర్చుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయించారు. సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్‌తో సరి.. బాధితుల ఫిర్యాదు మేరకు మూడు నెలల క్రితం విచారణ చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులు ఫోర్టరీ డాక్యుమెంట్లతో రిజి్రస్టేషన్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారంపై అనంతపురం సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణను సస్పెండ్ చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న నితిన్ సాయి, యంగలశెట్టి రాజు మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ..జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటిదాకా నితిన్ సాయి, యంగలశెట్టి రాజా, అక్రమాల సూత్రధారి అయిన వరదాపురం సూరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు. వారి మీద కేసులు నమోదు చేయకుండా భారీ ఎత్తున ముడుపులు స్వీకరించారా? లేదా తప్పుదోవ పట్టించే ఎత్తుగడ వేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చదవండి: (హిందూపురం వాసుల చిరకాల వాంఛ.. సాకారం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం) నివేదిక సమర్పించడంలోనూ జాప్యమే.. సూరి చేసిన అక్రమ వ్యవహారంపై విచారణకు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) ఆధ్వర్యంలో హంద్రీ–నీవా సుజల స్రవంతి సబ్ కలెక్టర్, అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సభ్యులుగా కలెక్టర్ నాగలక్ష్మి అప్పట్లోనే విచారణ కమిటీని నియమించారు. ఇందులో ఒక సభ్యుడు నివేదిక సమర్పించినా, మరొక సభ్యుడు మాత్రం కాలయాపన చేస్తున్నారు. ఇంతటి భారీ అక్రమ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సి ఉన్నా.. మరొక అధికారి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారు. ‘భూచోళ్ల’పై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చేయడానికే అధికారులందరూ కలిసి కొత్త నాటకాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరాం అన్‌రిజిస్టర్డ్ వీలునామా ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయడం అనైతికమని పలువురు ఫిర్యాదు చేశారు. రిజి్రస్టేషన్‌ను రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేశాం. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా రిజి్రస్టార్‌కు ఉత్తర్వులు జారీ చేశాం. – మాధవి, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ -
ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిపోతున్న భూ కబ్జాలు
-
భూ బకాసురుడు 'వరదాపురం'
సాక్షి, అనంతపురం: ఆయనో మాజీ ప్రజాప్రతినిధి. వందల ఎకరాల ప్రభుత్వ భూములను చెరబట్టాడు. అమాయక రైతు లను బెదిరించి కనిపించిన పొలాన్నల్లా లాక్కున్నాడు. అంతేకాదు.. అసైన్డ్ భూముల చట్టానికి తూట్లు పొడిచి అధికారం లో ఉండగా అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నాడు. వాగులు, వంకలను కలిపేసుకున్నాడు. చుట్టు పక్కల పొలాలకు దారి వదలకుండా రైతులను వేధిస్తున్నాడు. ఎవరైనా సరే తనకు మాత్రమే విక్రయించాలని లేదంటే గ్రామం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నాడు. ఈ అరాచకాలను భరించలేక ఏకం గా ఒక గ్రామమే ఖాళీ కావటాన్ని బట్టి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో వేరే చెప్పాలా? అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణ భూ దందాలు, దౌర్జన్యాలివీ.. టీడీపీ అధికారంలో ఉండగా.. ముదిగుబ్బ మండలం ముక్తాపురం రెవెన్యూ పరిధిలో చిన్న, సన్నకారు రైతులే అధికం. 2014లో టీడీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యేగా ఉన్న సూరి గ్రామంలో పొలాల ఆక్రమణల పర్వాన్ని ప్రారంభించాడు. నితిన్‌సాయి ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 332.45 ఎకరాలను రైతుల నుంచి కారుచౌకగా కాజేశాడు. ఇందులో 155.88 ఎకరాలు ప్రభుత్వ, అనాదీన, చుక్కల భూములే కావడం గమనార్హం. నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్న భూములను వరదాపురం బలవంతంగా సొంతం చేసుకున్నాడు. సూరి కుమారుడు నితిన్‌సాయి, సతీమణి నిర్మలాదేవి కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. చండ్రాయునిపల్లి ఖాళీ ముక్తాపురం రెవెన్యూ పరిధిలో వందల ఎకరాలను కొనుగోలు చేయడంతో పాటు ఇతర రైతులు పొలాలకు వెళ్లేందుకు దారి ఇవ్వకుండా సూరి వేధించాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే రైతుల పొలాల్లో నీళ్ల మోటార్లు, స్టార్టర్ పెట్టెలు రాత్రికి రాత్రే మాయమయ్యేవి. దీంతో దిక్కుతోచక అయినకాడికి అమ్ముకుని వలస వెళ్లిపోయారు. ఇలా చండ్రాయునిపల్లి అనే గ్రామం మొత్తం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం అక్కడ మొండిగోడలు, కూలిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. అసైన్మెంట్ చట్టానికి తూట్లు 1977 అసైన్మెంట్ చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరం. దీన్ని బేఖాతర్ చేస్తూ నితిన్‌సాయి ఆగ్రోటెక్ కంపెనీ పేరిట ఏకంగా 155.88 ఎకరాల ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. ఇందుకు అప్పట్లో రెవెన్యూ అధికారులు సహకరించారు. పాసుపుస్తకాలు సైతం మంజూరు చేసేశారు. ఆధారాలు ఇవిగో.. నితిన్‌సాయి ఆగ్రోటెక్ కంపెనీ పేరిట వరదాపురం సూరి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ముదిగుబ్బ మండలం ముక్తాపురం పరిధిలో 48–2, 50, 52–3, 53–2, 54–1, 57–1, 57–2, 63–1, 63–2, 63–3, 84, 85–1, 85–2, 86, 87–1ఎ, 87–1బి, 87–2, 88, 96–1, 96–2, 97, 106–2,106–3, 113, 119, 134, 199, 203, 378 సర్వే నంబర్లలో ప్రభుత్వ, అనాదీన, అసైన్డ్, గయాలు లాంటి నిషేధిత జాబితాలోని భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పొలానికి వెళ్లనివ్వడం లేదు.. ముక్తాపురం, చండ్రాయునిపల్లి మధ్యలో 330 ఎకరాలకు పైగా కొనుగోలు చేసిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి మేం పొలానికి వెళ్లేందుకు దారి ఇవ్వడం లేదు. అక్కడ మాకు మధ్యలో పది ఎకరాల భూమి ఉంది. వ్యవసాయ పనులకు ఆటంకం కల్పిస్తుండంతో దిక్కు తోచడం లేదు. ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నిస్తే మాపై దౌర్జన్యం చేస్తున్నారు. – వెంకటేశ్ నాయక్, ముక్తాపురం తండా మా గ్రామాన్ని కాపాడండి.. వరదాపురం సూరి ఇక్కడ భూములు కొన్నప్పటి నుంచి మాకు ఇబ్బందులు మొదలయ్యాయి. మా పొలాల వద్దకు వెళ్లాలంటే సూరి భూములను దాటుకుని వెళ్లాలి. ఆయన మా పొలాల్లోకి వెళ్లనివ్వడం లేదు. ఈ దౌర్జన్యాలను తట్టుకోలేక ఇప్పటికే చండ్రాయునిపల్లి ఖాళీ అయ్యింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మేం కూడా ముక్తాపురం వదిలి వెళ్లక తప్పదు. ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలి. – కేశవ, ముక్తాపురం -
Hyderabad: అమ్ముతావా.. చస్తావా!
సాక్షి, బంజారాహిల్స్: తక్కువ ధరకే ఖరీదైన భూమిని విక్రయించాలని కొంత కాలంగా బెదిరించినా తమ మాట వినలేదనే కోపంతో నగరంలోని బంజారాహిల్స్ పరిధిలో దుండగులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజక వర్గం కౌడిపల్లికి చెందిన కొత్త హరీష్‌కుమార్ (36)కు తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొంత కాలంగా ఈ భూమిపై కన్నేసిన కౌడిపల్లి టీఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ కృష్ణగౌడ్, కౌడిపల్లి సర్పంచ్ ఎ.సుధీర్‌రెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, బుర్దరం పేట సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, నాయికోటి రాజు, టి.సంతోష్‌రావు, ఎస్కే ఆసిఫ్, లింగం తదితరులతో పాటు మొత్తం 18 మంది మూడు కార్లలో ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు వచ్చారు. ►యూసుఫ్‌గూడ సమీపంలోని శ్రీకృష్ణదేవరాయ నగర్ భవానీ అపార్ట్‌మెంట్స్‌లో అద్దెకుంటున్న హరీష్ కుమార్ ఇంట్లోకి చొరబడ్డారు. ఆయన కాలర్ పట్టుకొని కారులోకి ఈడ్చుకొచ్చారు. అడ్డుగా వచ్చిన హరీష్ తమ్ముడు మహేష్‌ను కొట్టుకుంటూ కారులోకి ఎక్కిస్తుండగా ఆయన తప్పించుకొని సమీపంలో దాక్కున్నాడు. హరీష్‌ను కిడ్నాప్ చేసి మూడు కార్లలో నర్సాపూర్ అడవుల వైపు వెళ్లారు. ►తప్పించుకున్న మహేష్ డయల్ 100కు ఫోన్ చేసి తన సోదరుడు హరీష్ కిడ్నాప్ అయిన విషయాన్ని చెప్పాడు. హుటాహుటిన బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కిడ్నాప్ చేసిన కృష్ణగౌడ్ నంబర్ తీసుకొని వెంటనే హరీష్‌ను తీసుకొని రావాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. దీంతో భయపడ్డ కృష్ణగౌడ్, సుధీర్‌రెడ్డి తదితరులు బాధిత హరీష్‌ను కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. ►తన దుస్తులు విప్పేసి దారి పొడవునా తీవ్రంగా కొట్టారని, తొమ్మిది ఎకరాల స్థలాన్ని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ హెచ్చరించారని, లేకపోతే నర్సాపూర్ అడవుల్లో పెట్రోల్ పోసి చంపేస్తామంటూ బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. సోమవారం సాయంత్రం బాధితుడు నగర పోలీస్ కమిషనర్‌ను కలిశారు. తనను కిడ్నాప్ చేశారంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. ►తనకు ప్రాణహాని ఉందంటూ సెప్టెంబర్ 17న కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానని బాధితుడు ఆరోపించారు. ఆ రోజు తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించి ఉంటే తనను కిడ్నాప్ చేసి ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడి పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. కాగా.. కిడ్నాపర్లు విదేశాలకు వెళ్తున్న ఓ ఎమ్మెల్యేకు వీడ్కోలు పలికేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చి తిరిగి వెళ్తూ ఈ పని చేశారని సమాచారం. -
చదలవాడ చెర వీడుతోంది.. ఆస్తులు పెంచుకోవడమే అజెండా
చదలవాడ కృష్ణమూర్తి.. ఆస్తులు పెంచుకోవడమే అజెండాగా రాజకీయాలు చేస్తుంటారు. ప్రభుత్వ భూములను అవలీలగా ఆరగించేస్తుంటారు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎకరాలకు ఎకరాలను కబ్జా చేసేశారు.. ఆ పార్టీ హయాంలో టీటీడీ చైర్మన్ పదవి వెలగబెట్టినప్పుడూ వ్యాపార సామ్రాజ్య విస్తరణకే ప్రాధాన్యమిచ్చారు. ఘనత వహించిన చదలవాడ వారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు.. తర్వాత టీడీపీలో కుర్చీలాట ఆడారు.. ప్రస్తుతం జనసేనతో అంటకాగుతున్నారు.. దశాబ్దాలుగా పాలి‘ట్రిక్స్’ సాగిస్తున్నా.. తిరుపతి నగరాన్ని భూకబ్జాలు, దందాలతో చెరబట్టిన ప్రబుద్ధుడిగానే ఆయన పేరు గడించారు.. ఇంతకీ విషయమేమిటంటే ప్రభుత్వ భూములకు చదలవాడ ‘చెర’ వదిలించడంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. విద్యాసంస్థ పేరిట సర్కారు భూములను అందిన కాడికి మింగేయడంంపై చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం తిరుపతి రూరల్ పరిధిలోని దామినేడు గ్రామం సర్వే నంబర్ 131లో ఉన్న నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కలిపేసుకుంటూ అక్రమంగా నిర్మించిన గోడను కూల్చివేశారు. ఇక్కడితో ఆగకుండా మొత్తం చదలవాడ భూ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తునకు శ్రీకారం చుట్టారు. సాక్షి, తిరుపతి: తిరుపతి రూరల్ మండలం దామినేడు సర్వే నంబర్ 112/1, 2, 3లో సుమారు 13 ఎకరాలు, సర్వే నంబర్ 115లో 12.5 ఎకరాలు, సర్వే నంబర్ 131లో 39.25 ఎకరాలు, 135లో 7.3 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు చదలవాడ కృష్ణమూర్తి కన్నుపడింది. ఆ భూములకు ఆనుకుని ఉన్న ఓ మోపెడ్ కంపెనీని చదలవాడ కొనుగోలు చేశారు. అంతే.. ఆ తర్వాత మోపెడ్ పరిశ్రమ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, కాలువ, చెరువు పోరంబోకు భూములు అన్నింటినీ క్రమక్రమంగా ఆక్రమిస్తూ వచ్చారు. గతంలో ఆ భూములు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ఉండేవి. సరిగ్గా అప్పట్లోనే ఎమ్మెల్యేగా వెలగబెట్టిన ఈయన.. పదవిని అడ్డు పెట్టుకుని పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వ భూములన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. చదవండి: (వైద్య, ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్కు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్) కళాశాలల పేరుతో కబ్జా మోపెడ్ కంపెనీ ఆస్తులను కొనుగోలు చేసిన చదలవాడ ఆ భవనాలకు మరమ్మతులు చేపట్టారు. పక్కనే ఉన్న భూముల్లో పలు కళాశాలలను స్థాపించారు. చదలవాడ కృష్ణతేజ డెంటల్ కాలేజీ, చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాల, ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ స్టడీస్, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఇంకా ఎంసీఏ వంటి వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సులు అందిస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద ఎత్తున కళాశాలలను ఏర్పాటు చేయటంతో అధికారులు, నాయకులు ఎవ్వరూ అటువైపు వెళ్లేందుకు సాహసం చేయలేదు. అదే అదనుగా చదలవాడ కళాశాలల ముసుగులో కాలువ, చెరువు పోరంబోకు భూములను పూడ్చివేశారు. ప్రభుత్వ భూములను కూడా పూర్తి స్థాయిలో ఆక్రమించేశారు. అడ్డగోలుగా గోడ నిర్మాణం ఇదిలా ఉండగా, కళాశాల వెనుక ఉన్న భూముల్లోని నాలుగు ఎకరాలు తమవేనంటూ పీకే నాగరాజు పిళ్లై, నాగేంద్ర అనే వ్యక్తులు ఈమధ్య తెరపైకి వచ్చారు. తాము 1970 నుంచి సదరు భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. రికార్డుల్లో అది ప్రభుత్వ భూమిగానే చూపిస్తున్నా... తాము మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. అయితే మూడు వారాల క్రితం చదలవాడ కృష్ణమూర్తి తన అనుచరులతో కలిసి అక్కడ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న నాగరాజు పిళ్లై, నాగేంద్ర దీనిపై తిరుపతి రెవెన్యూ, నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక అధికారుల నుంచి స్పందన లేకపోవటంతో వారు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ విషయం కలెక్టర్ హరినారాయణన్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే తిరుపతి ఆర్డీవో, రూరల్ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం రెవెన్యూ అధికారులు పోలీసు సిబ్బందితో కలిసి ఆక్రమిత స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశారు. మిగిలిన కబ్జా భూములపై సమగ్రంగా విచారించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. చదవండి: (సీఎం జగన్ సంక్షేమ పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం: సజ్జల) సమగ్ర సర్వే దామినేడు రెవెన్యూ గ్రామ పరిధిలో ఆక్రమిత భూములను కచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాల మేరకు సమగ్రంగా సర్వే చేయిస్తాం కబ్జాలను అడ్డుకుంటాం. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే ఉండదు. – కనక నరసారెడ్డి, ఆర్డీవో, తిరుపతి అవి ప్రభుత్వ భూములే దామినేడులో ఆక్రమణకు గురైన 73.5 ఎకరాలు ప్రభుత్వ భూములే. సిద్ధార్థజైన్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు వీటిపై సర్వే చేయించి సర్కారు భూములుగా నిర్ధారించారు. ప్రస్తుతం ఆ భూముల్లోని అన్ని ఆక్రమణలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తిగా తొలగిస్తాం. – లోకేశ్వరి, తహసీల్దార్, తిరుపతి రూరల్ -
భూ కబ్జాలు బట్టబయలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక సర్వేతో కబ్జా కోరల్లో ఉన్న భూముల బండారం బట్టబయలు కానుంది. భవిష్యత్‌లో భూ ఆక్రమణలకు శాశ్వతంగా చెక్ పడనుంది. జిల్లాలో ఒకటిన్నర దశాబ్ద కాలంలో భూముల విలువలు అపారంగా పెరిగాయి. ఈ పరిణామాలతో రాజకీయ అండతో రెవెన్యూ అధికారులను లోబర్చుకుని బడాబాబులు భూకబ్జాలకు పాల్పడ్డారు. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు జిల్లాలో వేలాది ఎకరాలను కబ్జా చేశారు. రీ సర్వేతో ఆక్రమణదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారం అండతో టీడీపీ హయాంలో తెలుగుతమ్ముళ్లు అడ్డగోలుగా భూ కబ్జాలకు తెరతీశారు. గ్రామ స్థాయి నేత నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరూ భూములు ఆక్రమించారు. ప్రతి నియోజకవర్గంలోనూ వందల ఎకరాల భూములు అప్పటి అధికార పార్టీ నేతల కోరల్లోకి వెళ్లాయి. సముద్ర తీర ప్రాంతం మొదలుకుని పెన్నా నది పొరంబోకు వరకు దేన్నీ వదలకుండా శక్తి మేరకు భూములను ఆక్రమించారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను కలిపి రియల్ వెంచర్లుగా మార్చి విక్రయాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో వందేళ్ల చరిత్రకు నాంది పలుకుతూ భూ హక్కులను పదిలం చేస్తూ వైఎస్సార్, జగనన్న శాశ్వత భూహక్కు– భూ రక్ష పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రతి సెంటు భూమిని సమగ్రంగా రీ సర్వే చేసి శాశ్వత హక్కులు కల్పించనున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో కబ్జాదారుల్లో టెన్షన్ మొదలైంది. ► జిల్లాలో అపారంగా ల్యాండ్ బ్యాంక్ ఉంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన పూర్తి మౌలిక సదుపాయాలు ఉండడంతో పాటు జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. ► గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజా ప్రతినిధులు కొందరు, తెలుగు తమ్ముళ్లు పట్టణాలు, నగరం మినహా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భూములను చెరపట్టారు. ► ఐదేళ్ల కాలంలో ప్రతి నియోజకవర్గంలో సగటున వెయ్యి ఎకరాలకు పైగా భూములు కబ్జాకు గురైనట్లు సమాచారం. ► కొన్ని చోట్ల సాగు చేయడంతో పాటు మరికొన్ని చోట్ల రొయ్యల గుంతలు ఏర్పాటు చేశారు. ఇంకొన్ని చోట్ల విక్రయాలు చేశారు. ► జిల్లాలో భూ వివాదాలకు సంబంధించి వేల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 400 గ్రామాల్లో సర్వే ప్రారంభం జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లలో 400 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. మూడు దశల్లో సర్వే పూర్తి చేయనునున్నారు. నెల్లూరు డివిజన్లో 104, కావలి డివిజన్లో 56, గూడూరు డివిజన్లో 113, ఆత్మకూరు డివిజన్లో 61, నాయుడుపేట డివిజన్లో 66 గ్రామాల్లో తొలి విడతగా ఈ నెల 23న గూడూరు రూరల్ మండలంలోని రెడ్డిగుంట నుంచి కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ప్రారంభించారు. అన్ని రకాల భూములను రీ సర్వే చేసి యజమానులకు శాశ్వత హక్కు కల్పించడమే పథకం ప్రధాన ఉద్దేశం. ప్రతి భూమిని డ్రోన్ కెమెరాల ద్వారా ఫొటోలు తీసి వాటిని కంప్యూటర్లో చెక్ చేసి రైతుల సమక్షంలో సర్వే నిర్వహించి కచ్చితమైన కొలతలు వేసి ఉచితంగా హద్దు రాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి భూ కమతానికి ప్రత్యేక మ్యాప్ ఆధార్ తరహాలో యూనిక్ నంబర్ ఇచ్చి వివరాలు నమోదు చేయనున్నారు. భూ యజమానికి యూనిక్ నంబర్, క్యూఆర్ కోడ్‌ను కేటాయించనున్నారు. భవిష్యత్‌లో భూ ఆక్రమణలకు చెక్ పడనుంది. సాగర తీరం నుంచి సాగుభూమి వరకు.. జిల్లాలో సముద్ర తీరం నుంచి సాగు భూమి వరకు కబ్జా కోరల్లో ఉంది. ప్రధానంగా అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ భూములను గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు ఆక్రమించి పట్టాలు కూడా సృష్టించుకోవడం గమనార్హం. ► కావలి నియోజకవర్గంలో బోగోలు మండలం, దగదర్తి మండలంలో సగటున 150 ఎకరాలకు పైగా భూములు టీడీపీ నేతల అధీనంలో ఉన్నాయి. కావలి పట్టణానికి సమీపంలోని సుమారు 50 ఎకరాలకు పైగా భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ► ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలం రాగిపాడులో 70 ఎకరాల భూమి టీడీపీ నేత ఆక్రమించగా కొంత స్వాధీనం చేసుకున్నారు. వరికుంటపాడు మండలం బొంగరాలపాడులో 50 ఎకరాల వరకు స్థానిక టీడీపీ నేతలు భూమిని ఆక్రమించారు. ► గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు మండలం కడివేడులో 150 ఎకరాలు, కోట మండలం కేశవరం, రాఘవవారిపాళెంలో 25 ఎకరాలు ఆక్రమణల పర్వంలో ఉంది. ఆత్మకూరు నియోజక వర్గంలోని మర్రిపాడు, చేజర్లలోనూ ఇదే తరహాలో ఆక్రమణలు ఉన్నాయి. ► కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలంలో సుమారు 500 ఎకరాలకు పైగా సముద్ర తీర ప్రాంతం ఆక్రమణలకు గురైంది. ఈ మండలంలోని కొరటూరు, మైపాడులో దాదాపు 11 సర్వే నంబర్లలో 150 ఎకరాలు, రామడుగుపాళెంలో 5 సర్వే నంబర్లలో 318 ఎకరాలు, కొరుటూరు ఒకే సర్వే నంబర్లో 23.50 ఎకరాలు, జగదేవిపేటలో 6 సర్వే నంబర్లలో 60 ఎకరాలు ఆక్రమణలో ఉంది. వీటిలో మైపాడు, కొరుటూరులో ఆక్రమిత స్థలాల్లోనే హేచరీలు ఉండడం గమనార్హం. ఇవి మచ్చుకు మాత్రమే. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ తరహా భూ ఆక్రమణలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. భూ రక్ష పథకంతో ఇవన్నీ పూర్తి స్థాయిలో వెలుగులోకి రానున్నాయి. -
గీతం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్శిటీ భూకబ్జాలపై విచారణ జరపాలని సోమవారం ప్రజాసంఘాల జేఏసీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. 'గత 40 ఏళ్లుగా గీతం యూనివర్సిటీ భూకబ్జాలకు పాల్పడింది. వారు ఆక్రమించిన భూముల్లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారు. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజు అధికంగా వసూలు చేసింది. భూకబ్జాలు, అవినీతికి పాల్పడిన గీతం యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి. చేసిన మోసాలను రాజకీయ పలుకుబడితో గీతం యూనివర్సిటీ పెద్దలు తప్పించుకుంటున్నారు. గీతం ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. గీతం యూనివర్సిటీ అక్రమాలకు చంద్రబాబు మద్దతు తెలపడాన్ని ఖండిస్తున్నాం' అని ప్రజాసంఘాల జేఏసీ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. (ఆక్రమణలకు చరమ‘గీతం’) -
'రౌడీషీట్ పెట్టండి.. వాడి అంతు చూస్తా'
సాక్షి, హైదరాబాద్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డితో తనకు ప్రాణహాని ఉందని ఓ యువకుడు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకెళ్తే.. కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 71, 72, 73 ప్లాట్ నంబర్ 35, 36 పార్ట్ స్థలంలో తన బంధవులు ఇల్లు నిర్మాణం చేసుకుంటే మేయర్ అనుచరులు ఆ ఇంటిని జేసీబీతో నేలమట్టం చేశారని శివకిషోర్ అనే యువకుడు ఆరోపించాడు. ఈ క్రమంలోనే శివకిషోర్.. ఎందుకు ఇల్లు కూలగొడుతున్నారని మేయర్‌ను ప్రశ్నించగా నువ్వెవడు రా..? అని పరుష పదజాలంతో దూషించి, ఏడుగురు వ్యక్తులు రాళ్ల దాడికి దిగినట్లు బాధితుడు వివరించారు. విషయంపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే వీడిపై రౌడీషీట్ పెట్టండి. తర్వాత వాడి అంతుచూస్తానని మేయర్ సామల బుచ్చిరెడ్డి బెదిరించినట్లు బాధితుడు పేర్కొన్నారు. (కస్టమర్ కేర్ కాదు.. ఖాతా కొల్లగొట్టుడే!) -
గీతం ఆక్రమణలకు చెక్
గత సర్కారు అండతో రుషికొండ, ఎండాడలో 40.51 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వివిధ స్థలాల్ని గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆక్రమించినట్లు జిల్లా రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఎండాడలోని సర్వే నం. 15,16,17,18,19,20, రుషికొండలోని సర్వే నం. 55,61లో ఆక్రమించిన 22.21 ఎకరాల చుట్టూ రక్షణ గోడ నిర్మాణం, సర్వే నం. 34,35,37,38లో 18.30 ఎకరాల విస్తీర్ణంలో గీతం యూనివర్సిటీ గార్డెనింగ్ నిర్మాణంతో పాటు గ్రావెల్ బండ్ని ఏర్పాటు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేటతెల్లమైంది. ఈ ఆక్రమణలపై విశాఖ ఆర్డీవో పెంచల్ కిశోర్ ఇచ్చిన నివేదికతో పాటు సిట్ కూడా తమకు వచ్చిన ఫిర్యాదు నంబర్.2670 ప్రకారం విచారణ చేపట్టింది. సాక్షి, విశాఖపట్నం: 1981లో గీతం విద్యా సంస్థ ఏర్పాటు చేసేందుకు రుషికొండ, ఎండాడలో సర్వే నంబర్లు 17/1, 5, 17/7 నుంచి 28 వరకూ 71.15 ఎకరాల భూమిని ఇవ్వాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరింది. ఇదంతా అప్పట్లో భూమిలేని నిరుపేదలకు ఇచ్చిన భూమి కావడం, దాన్ని అప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా.. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండడంతో ప్రభుత్వం ఆ స్థల హక్కుల్ని గీతంకి బదిలీ చేయలేదు. కానీ ఆధీన పత్రాలు దక్కించుకునే వరకూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధన విధిస్తూ స్థలాన్ని విద్యాసంస్థకు అప్పగించింది. ఈ నిబంధనల్ని పాటించకపోతే ప్రభుత్వం తిరిగి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. లేదంటే.. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చెయ్యాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కి.. 14 ఎకరాల్లో నిర్మాణం చేపట్టి.. మిగిలిన 57.15 ఎకరాల్ని 15 ఏళ్లుగా ఖాళీగా ఉంచింది. 1996లో అప్పటి జేసీ ఈ స్థలాన్ని పరిశీలించి.. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు కేవలం 14 ఎకరాలు మాత్రమే నిర్మాణాలు చేపట్టి.. మిగిలిందంతా నిరుపయోగంగా ఉంచేశారంటూ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దీనిపై స్పందించిన అప్పటి భూ పరిపాలన చీఫ్ కమిషనర్ గీతంని పరిశీలించి.. కేవలం 49 ఎకరాలు మాత్రమే సరిపోతాయనీ.. మిగిలిన భూముల్ని ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 1998 మే 27న ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. (విశాఖ భూ కుంభకోణం: సిట్ విచారణ ప్రారంభం) ప్రభుత్వానికి నివేదిక పంపించాం.. ఎండాడ, రుషికొండ పరిసరాల్లో మొత్తం 40.51 ఎకరాల భూముల్ని గీతం సంస్థ ఆక్రమించినట్లు గుర్తించాం. ఏయే ప్రాంతాల్లో ఎంత భూములు ఆక్రమించుకున్నారు... హైకోర్టు విచారణలో ఉన్న కేసులు సంబంధించి ఎంత మేర భూములున్నాయి.. మొదలైన అంశాలతో కూడిన 7 పేజీల నివేదికను ప్రభుత్వానికి పంపించాం. – పెంచల్ కిశోర్, ఆర్డీవో, విశాఖపట్నం ఇలా తీసుకొని.. అలా ఇచ్చేసిన టీడీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రెండు వారాల తరువాత అదే ఏడాది జూన్ 12న ఎకరా రూ.18వేలుగా ధర నిర్ణయించి గీతంకి అప్పగించేందుకు ప్రభుత్వం స్కెచ్ వేసింది. స్థలాన్ని అప్పగించిన 1981 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ 10 శాతం వడ్డీ కట్టాలని కూడా ఆదేశించింది. మొత్తంగా రూ.34,94,200 చెల్లించి స్థలాన్ని గీతంకి అప్పటి టీడీపీ ప్రభుత్వం కట్టబెట్టింది. క్రమంగా.. ఆక్రమణలు ఇక అప్పటి నుంచి గీతం ఆ భూములకు పక్కన ఉన్న స్థలాల ఆక్రమణల పర్వానికి తెరతీసింది. సర్వే నం.20(పీ)లో 6.09 ఎకరాలు, నం.19లో 0.62 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం ఆక్రమించింది. దీనిపై విశాఖ రూరల్ ఎమ్మార్వో గీతం విశ్వవిద్యాలయానికి నోటీసులు జారీ చేయగా.. యాజమాన్యం ఆ స్థలాల్లో ఉన్న కట్టడాలు కూల్చొద్దంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. గీతం వివరణ తీసుకొని సమస్యను సానుకూలంగా పరిష్కరించాలంటూ 2004 డిసెంబర్ 28న ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిట్ పిటిషన్ దాఖలైన తర్వాత కూడా ఆక్రమణలు కొనసాగించినట్లు 2005 ఫిబ్రవరిలో గుర్తించారు. సర్వే నం.19లో 0.98 ఎకరాలు, 20లో 6.16 ఎకరాలు, 16లో 0.16 ఎకరాలు చొప్పున మొత్తం 7.30 ఎకరాలు ఆక్రమించినట్లు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఆ నిర్మాణాల తొలగించాలని నిర్ణయించారు. మొత్తం 7.30 ఎకరాల్లో ఉన్న నిర్మాణాల్ని తొలిగించి 2005 ఫిబ్రవరి 19న ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నట్లు బోర్డులు ఏర్పాటు చేశారు. ఒత్తిళ్లతో.. కట్టబెట్టారు ఆ తర్వాత మరోసారి కోర్టుకి వెళ్లి గీతం యాజమాన్యం రిట్ పిటిషన్ దాఖలు చేయగా 4 వారాల్లో స్థలాన్ని గీతంకి స్వాధీనం చేయాలంటూ 2005 ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత రకరకాల ఒత్తిళ్లతో 2010లో స్థలాన్ని ప్రభుత్వం గీతం దూర విద్య కోర్సుల భవనానికి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాత అక్రమంగా తమ ఆ«దీనంలో ఉంచుకున్న సర్వే నం. 15, 37, 38(పీ), 15(పీ)లోని 35 ఎకరాల భూమిని వీఎంఆర్డీఏ వీసీ, ఇగ్నో రీజనల్ డైరెక్టర్, సోషల్ వెల్ఫేర్ డీడీ, ఐటీడీఏ పీఓ, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ పీడీ, ఆదాయపు పన్ను డిప్యూటీ కమిషనర్ మొదలైన వివిధ ప్రభుత్వ సంస్థల అధికారుల కార్యాలయాల కోసం కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైనా మరోసారి గీతం కోర్టుకి వెళ్లగా.. 2014 మార్చి 10న హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రస్తుతం ఆ స్టే కొనసాగుతూ ఉంది. దీన్ని మార్కెట్ ధర ప్రకారం ఎకరం రూ.8.26 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించినా గీతం యాజమాన్యం మాత్రం స్పందించలేదు. ఇలా.. మొత్తం 40.51 ఎకరాల భూమి గీతం చెరలో ఉందని ప్రభుత్వం నిర్ధారించింది. ఆర్డీవో ఇచ్చిన నివేదిక మేరకు దీనిపై చర్యలకు ఉపక్రమించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. -
పరిటాల అనుచరుడి భూదందా.. అజ్ఞాత వ్యక్తి లేఖతో
మాజీ మంత్రి పరిటాల రవీంద్ర అనుచరుడైన రామగిరి టీడీపీ మాజీ ఎంపీపీ బడిమెద్దుల రంగయ్య ధర్మవరంలో చేసిన భూ దందా కలకలం సృష్టించింది. అత్యంత ఖరీదైన మున్సిపల్ రిజర్వ్డ్ స్థలాన్ని నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించి ఏకంగా కోట్లాది రూపాయలు రుణంగా తీసుకునేందుకు పెద్ద ప్రణాళికను రచించాడు. అయితే మున్సిపల్ అధికారుల విచారణలో కబ్జా వ్యవహారం బట్టబయలు కావడంతో కథ అడ్డం తిరిగింది. సాక్షి, ధర్మవరం టౌన్: ధర్మవరం పట్టణంలోని ఎస్బీఐ కాలనీ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇక్కడ సర్వే నంబర్ 483–1లో 7.84 సెంట్ల స్థలాన్ని రిజర్వ్డ్ సైట్‌గా అధికారులు కేటాయించారు. దీంతో ఈ స్థలంపై పరిటాల అనుచరుడు, రామగిరి మాజీ ఎంపీపీ బడిమెద్దుల రంగయ్య కన్నుపడింది. పరిటాల హవా సాగుతున్న సమయంలో అంటే 2004లో ఈ స్థలాన్ని చారుగుండ్ల రామలక్ష్మమ్మ అనే మహిళ పేరిట నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలు సృష్టించాడు. ఆ తర్వాత అదే సంవత్సరంలో సదరు మహిళతో ఆ స్థలాన్ని కొన్నట్టు బడిమెద్దుల రంగయ్య రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి స్థలాన్ని తన అధీనంలో ఉంచుకున్నాడు. ఈ స్థలం విలువ రూ.3 కోట్లకు పైగానే పలుకుతుంది. (జేసీ కుటుంబానికి మైనింగ్ శాఖ నోటీసులు) దస్తావేజులో రంగయ్య ఫొటో అజ్ఞాత వ్యక్తి లేఖతో బట్టబయలు ఎస్బీఐ కాలనీలో నకిలీ ధ్రువపత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న సర్వే నంబర్ 483–1లోని 7.84సెంట్ల స్థలాన్ని ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో తాకట్టు పెట్టి రూ.2 కోట్ల రుణం పొందేందుకు బాలాజీ హౌసింగ్ డెవలపర్స్ అనే కంపెనీ తరఫున దరఖాస్తు చేసుకున్నాడు. రుణం ఇచ్చే ప్రక్రియ మొదలు కావడంతో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థలానికి సంబంధించిన విచారణ మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేసింది. ఇదే తరుణంలో పది రోజుల కిందట ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకు ఈ వ్యవహారాన్ని ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ ద్వారా తెలిపాడు. దీంతో కమిషనర్ ఆ డాక్యుమెంట్లను పరిశీలించి నకిలీ రిజి్రస్టేషన్గా గుర్తించారు. మున్సిపల్ రిజర్వ్డ్ సైట్‌ను తాకట్టు పెట్టి రుణం పొందాలనుకున్న విషయాన్ని ధ్రువీకరించారు. కబ్జాదారుపై పోలీసులకు ఫిర్యాదు మున్సిపల్ రిజర్వ్డ్ స్థలానికి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రుణం పొందాలని చూసిన బడిమెద్దుల రంగయ్య, రామలక్ష్మిలతో పాటు, అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపైన మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. మున్సిపల్ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. -
వెలుగులోకి టీడీపీ అక్రమాలు..
టెక్కలి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలోని అక్రమాలు, అవినీతి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో రాజకీయ పరపతితో చేసిన భూకబ్జాలు ఇప్పుడిప్పుడే బయట పడుతుండటంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా డివిజన్ కేంద్రమైన టెక్కలిలో ఇటువంటి భూ బాగోతం బట్టబయలైంది. దీంతో ఏం చేయాలో తెలియక అన్ని కోణాల్లో తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని పక్కాగా కబ్జా చేసిన వ్యవహారం బయట పడటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. అధికారులు హెచ్చరించినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణాలు చేస్తున్న దృశ్యం సర్వే నంబర్ 477లో పోరంబోకు స్థలం కబ్జా... డివిజన్ కేంద్రమైన టెక్కలిలో అయ్యప్పనగర్, జాతీయ రహదారికి మధ్యలో సర్వే నంబరు 477లో 70 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. ఇదే స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో ఆక్రమించేశారు. అప్పట్లో ఓ బడా నేత రాజకీయ పెత్తనానికి భయపడి అధికారులు అటు వైపు దృష్టి సారించలేదు. తాజాగా ఇటీవల సర్వేయర్ అధికారులు ఆ ప్రాంతంలో ఈటీఎస్ మెషిన్‌తో సర్వే చేశారు. దీంతో పోరంబోకు స్థలం కబ్జాకు గురైందని గుర్తించారు. ఇంతలో కబ్జాదారులు ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. వెంటనే అధికారులు అప్రమత్తమై ఆ స్థలాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఆయా స్థలంలో కొంత మంది వ్యక్తులు నిర్మాణాలకు తెగబడ్డారు. దీంతో అధికారులు ఆయా నిర్మాణాలను నిలుపుదల చేశారు. అయితే కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా చేసేంత వరకు అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానికంగా గత పాలకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఈ స్థలంలో ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేపడితే స్థలాన్ని రక్షించుకోవచ్చునని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. -
ప్రభుత్వ భూమికి ఎసరు..!
చౌటుప్పల్ (మునుగోడు) : మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీపార్క్ స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. పట్టణ నడిబొడ్డున అత్యంత విలువైన ఈ భూమిని ఆక్రమించేందుకు కుట్రలు ప్రారంభమయ్యాయి. గ్రామానికి చెందిన దొరవారు పంతంగి శ్రీనివాస్‌రావు ఈ భూమిని అప్పట్లో గ్రామ పంచాయతీకి దానంగా ఇచ్చారు. సుమారు 0–35 ఎకరాల వరకు ఉన్న ఈ స్థలం మొన్నటి వరకు కంపచెట్లు, చెత్తాచెదరంతో ఉన్నప్పటికీ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గాంధీపార్క్‌ను పూర్తిగా శుభ్రం చేశారు. ఫిబ్రవరి 27 నుంచి 29వ తేదీ వరకు పనులు జరిగాయి. పదేళ్ల క్రితం వరకు ఆక్రమణలు జరిగినప్పటికీ అప్పటి నుండి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. హద్దురాళ్లు నాటిన గుర్తు తెలియని వ్యక్తులు కానీ, సోమవారం తెల్లవారే వరకు గాంధీపార్క్ స్థలంలో హద్దురాళ్లు వెలిశాయి. ఊర కృష్ణమూర్తి ఇంటి పక్క నుంచి ప్రధాన మురికి కాల్వ వైపునకు రూ.3కోట్లకు పైనే విలువ చేసే 500 గజాల స్థలానికి రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు నాటారు. ఉదయం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ మందడి రామదుర్గారెడ్డిని సంప్రదించగా హద్దు రాళ్లు నాటిన విషయం తమ దృష్టికి వచ్చిందని, తొలగిస్తామని తెలిపారు. హద్దురాళ్లు నాటిన వ్యక్తుల వివరాలు తెలియలేదన్నారు. -
బయటపడ్డ భూ కుంభకోణం
-
కృష్ణా జిల్లాలో తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాలు
-
పచ్చ అక్రమాలకు సర్కార్ చెక్
-
పార్టీ ఆఫీస్ నిర్మాణమూ అక్రమమే
-
అవును.. అవి దొంగ పట్టాలే!
సాక్షి, ఒంగోలు: స్వార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు అడ్డదారిలో పట్టాలు పొందేందుకు యత్నించారన్న వాదన ఇప్పుడు నిజమేనని రుజువైంది. నాడు అధికార టీడీపీ ఒత్తిడికి తలొగ్గి పోలీసు అధికారులు సైతం ఆక్రమణలను అడ్డుకున్న మహిళలపై తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసులు కూడా నమోదు చేశారు. నాడు వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అండగా నిలిచి నిలదీయడంతో బాధితులు కాస్త ఊపిరి పీల్చుకోగలిగారు. నేడు ఎన్ఎస్పీ అధికారులు ఆ భూమి తమదేనని, ఆ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించాలంటూ ఒంగోలు తహసీల్దారుకు విజ్ఞప్తి చేయడం, ఈమేరకు 20 మందిని ఆక్రమణదారులుగా పేర్కొంటూ తహసీల్దారు చిరంజీవి నోటీసులు జారీ చేయడంతో నాడు చూపించిన పట్టాలన్నీ దొంగ పట్టాలే అన్నది స్పష్టమైంది. అడ్డదారిలో ఆక్రమణకు యత్నం.. ఇళ్ల పట్టాలు అంటే నివాసం ఉండేందుకు జాగాలేని వారికి ఇచ్చేవి. ఇందుకు వారికి తెల్లరేషన్ కార్డు తప్పనిసరి. కానీ, సొంత కారు ఉన్న వారు, మెడలో బంగారు కాసులతో దిగినవారు భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు. ఒంగోలు సౌత్ బైపాస్‌లోని ఎన్ఎస్పి స్థలంతోపాటు సమీపంలోని రైతుల పొలాలను సైతం దున్నేయడం ప్రారంభించారు. తమ భూమిలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించిన వారిని తెలుగు మహిళలు దురుసుగా ప్రవర్తించారు. తమ భూమిని ఆక్రమించుకోవడం ఏమిటన్న ఓ ముస్లిం కుటుంబాన్ని అయితే కేశవరాజుకుంట రోడ్డెక్కే వరకు తరిమి తరిమి కొట్టారు. తాము గతంలోనే కొనుగోలు చేశామంటూ వారు వేడుకున్నా మాకు నాటి ఎమ్మెల్యే ఇచ్చారంటూ హెచ్చరికలు చేశారు. వీరికి మద్దతు పలికిన ఓ పోలీసు అధికారి తన సిబ్బందిని పంపించి జనాన్ని బలవంతంగా అక్కడి నుంచి పంపేందుకు యత్నించడంతో వివాదం మరింత జఠిలంగా మారింది. సంతకాలు కూడా లేకుండానే పట్టాలు జారీ ఇదిలా ఉంటే పట్టాలు చూపించాలంటూ కొందరు అడ్డం తిరగడంతో కొందరు తెలుగు మహిళలు పట్టాలు చూపించారు. తీరా వాటిలో కొన్ని పట్టాలలో తహసీల్దారు స్టాంపు ఉన్నచోట సంతకాలు ఉంటే, మరికొన్ని పట్టాలలో కనీసం తహసీల్దారు సంతకం కూడా లేకపోవడం గమనార్హం. దీంతో అసలు పట్టాలు రెవెన్యూ అధికారులే ఇచ్చారా లేదా అంటే అప్పటి తహసీల్దారు విచారణ చేస్తున్నా...పరిశీలిస్తున్నా అంటూ చెప్పడమే తప్ప తేల్చలేకపోయారు. ఇదే సమయంలో అసలు విషయం బహిర్గతమైంది. భూమి వృథాగా ఉందని, దానిని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ ఎన్ఎస్పి ఈఈ రవి అప్పట్లో తహసీల్దారు కార్యాలయానికి లేఖ రాశారు. కానీ ఆ భూమి కన్వర్షన్ కాలేదు. దీంతో ఆ భూమి తమ ఆధీనంలో ఉన్నట్లుగా ఎన్ఎస్పి అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎన్ఎస్పి స్థలానికి రెవెన్యూ అధికారులు పట్టాలు ఎలా జారీ చేశారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై పలువురు తాలూకా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఆ భూమిలోకి ఎవరూ వెళ్లరాదంటూ పోలీసులు ఆదేశించినా పోలీసులు అక్కడ ఉండగానే కొందరు భూమిలో నిర్మాణాలు ప్రారంభించారు. నిర్మాణాలను అడ్డుకోబోయిన స్థానిక మహిళలపై ఏకంగా పోలీసులు తమ విధులను అడ్డుకున్నారంటూ కేసులు నమోదు చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. రంగంలోకి దిగిన బాలినేని విషయం రచ్చరచ్చగా మారుతుండడం, చివరకు మహిళలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నామంటూ ప్రకటించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. అప్పటి వరకు అధికారులే సమస్యను పరిష్కరిస్తారని భావించిన ఆయన పరిస్థితి శ్రుతిమించుతుందని భావించి నేరుగా కాలనీకి వెళ్లారు. ఎన్ఎస్పి స్థలంలో అధికార పార్టీ నేతలకు పట్టాలు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ఎన్ఎస్పి భూమిలో ప్రైవేటు వ్యక్తులు వచ్చి ప్లాట్లుగా మార్చి పొజిషన్ చూపిస్తే వాటికి మీరు సహకరిస్తారా అంటూ నిలదీయడంతో పోలీసులు ఒకడుగు వెనక్కు తగ్గారు. దీంతో పోలీసులు ఆ భూమిలోకి ఎవరూ వెళ్లడానికి వీల్లేదంటూ హెచ్చరికలు జారీచేయడం, మరో వైపు అప్పటి జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ భూమికి సంబంధించి విచారణ చేయిస్తున్నట్లు ప్రకటించడం, ఎన్నికలు ముగిసి ప్రభుత్వం కూడా మారడంతో వివాదం కొంతమేర సద్దుమణిగింది. 20మందికి నోటీసులు జారీ అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ పూర్తి చేసిన ఎన్ఎస్పి అధికారులు మొత్తం 4.37 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిందని, ఆ భూమి తమదే అని గుర్తించారు. ఆ భూమిలోని ఆక్రమణలు తొలగించి తమ భూమికి రక్షణ కల్పించాలంటూ ఎన్ఎస్పి అధికారులు తాజాగా ఒంగోలు మండల తహసీల్దారుకు లేఖ రాశారు. తమ విచారణలో తమ భూమిలో 20మంది పట్టాలు వేసుకున్నట్లుగా గుర్తించామని పేర్కొంటూ వారి పేర్లు జత చేశారు. దీంతో వారందరికీ ఒంగోలు మండల తహసీల్దారు చిరంజీవి మంగళవారం నోటీసులు జారీ చేశారు. అక్టోబరు 1వ తేదీలోగా ఆక్రమణలను ఎందుకు తొలగించరాదో సమాధానం చెప్పాలంటూ నోటీసులలో పేర్కొన్నారు. దీంతో వారి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు.