'రౌడీషీట్ పెట్టండి.. వాడి అంతు చూస్తా' | Shiva Kumar Complaint Against Mayor Of Boduppal | Sakshi
Sakshi News home page

'సామల బుచ్చిరెడ్డితో నాకు ప్రాణహాని ఉంది'

Published Mon, Oct 26 2020 11:23 AM | Last Updated on Mon, Oct 26 2020 11:31 AM

Shiva Kumar Complaint Against Mayor Of Boduppal - Sakshi

కార్పొరేషన్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 71, 72, 73 ప్లాట్‌ నంబర్‌ 35, 36 పార్ట్‌ స్థలంలో తన బంధవులు ఇల్లు నిర్మాణం చేసుకుంటే మేయర్‌ అనుచరులు ఆ ఇంటిని జేసీబీతో నేలమట్టం చేశారని శివకిషోర్‌ అనే యువకుడు ఆరోపించాడు.

సాక్షి, హైదరాబాద్‌: బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సామల బుచ్చిరెడ్డితో తనకు ప్రాణహాని ఉందని ఓ యువకుడు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకెళ్తే.. కార్పొరేషన్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 71, 72, 73 ప్లాట్‌ నంబర్‌ 35, 36 పార్ట్‌ స్థలంలో తన బంధవులు ఇల్లు నిర్మాణం చేసుకుంటే మేయర్‌ అనుచరులు ఆ ఇంటిని జేసీబీతో నేలమట్టం చేశారని శివకిషోర్‌ అనే యువకుడు ఆరోపించాడు.

ఈ క్రమంలోనే శివకిషోర్‌.. ఎందుకు ఇల్లు కూలగొడుతున్నారని మేయర్‌ను ప్రశ్నించగా నువ్వెవడు రా..? అని పరుష పదజాలంతో దూషించి, ఏడుగురు వ్యక్తులు రాళ్ల దాడికి దిగినట్లు బాధితుడు వివరించారు. విషయంపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే వీడిపై రౌడీషీట్‌ పెట్టండి. తర్వాత వాడి అంతుచూస్తానని మేయర్‌ సామల బుచ్చిరెడ్డి బెదిరించినట్లు బాధితుడు పేర్కొన్నారు. (కస్టమర్‌ కేర్‌ కాదు.. ఖాతా కొల్లగొట్టుడే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement