టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి బెదిరింపుల దందా | TDP MLC Deepak reddy land kabza | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి బెదిరింపుల దందా

Published Wed, Apr 5 2017 1:16 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి బెదిరింపుల దందా - Sakshi

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి బెదిరింపుల దందా

- తనపై భూకబ్జా కేసు విత్‌డ్రా చేసుకోవాలంటూ హెచ్చరికలు
- మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌లో బాధితుడు మూర్తి ఫిర్యాదు


సాక్షి, హైదరాబాద్‌: ఫోర్జరీ పత్రాలతో భూ కబ్జాకు ప్రయత్నించిన కేసులో నిందితుడైన టీడీపీ నేత, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి బెదిరింపుల దందాకు దిగారు. హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన భూకబ్జా కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న మాదాపూర్‌ వాసి ఎం.రాధాకృష్ణమూర్తిని దీపక్‌రెడ్డి బెదిరిం చారు. బాధితుడి ఫిర్యాదుతో మాదాపూర్‌ పోలీసులు శనివారం దీపక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నం.286/2017తో రిజిస్టరైన ఈ కేసులో అనుమతి లేకుండా బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించడం (ఐపీసీ 448), బెదిరించడం (ఐపీసీ 506) సెక్షన్ల కింద ఆరోపణలను చేర్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన దీపక్‌రెడ్డి ఆ జిల్లాలోని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డికి స్వయానా అల్లుడు.  

 3.37 ఎకరాలపై కన్ను
బంజారాహిల్స్‌లోని రోడ్‌ నం.2లో ఉన్న సర్వే నెం.129/71లోని 3.37 ఎకరాల స్థలంపై దీపక్‌రెడ్డి సహా ఇతర నిందితులు కన్నేశారు. ఈ స్థలాన్ని దశాబ్దాల క్రితం నగరంలో నివాసం ఉన్న శరణార్థి అయూబ్‌ కమల్‌కు ప్రభుత్వం కేటాయించింది. దీన్ని ఆయన నుంచి 1960 లో ఎంవీఎస్‌ చౌదరితో పాటు ఆయన సోద రులు ఖరీదు చేశారు. అయూబ్‌ కమల్‌ ఈ స్థలాన్ని అన్సారీ బ్రదర్స్‌కు విక్రయించినట్లు, వారి నుంచి దీన్ని తాము ఖరీదు చేసినట్లు జై హనుమాన్‌ ఎస్టేట్స్‌ సంస్థకు చెందిన బి.శైలేష్‌ సక్సేనా, బి.సంజయ్‌ సక్సేనా, బి.ప్రకాశ్‌ చంద్ర సక్సేనాలతోపాటు జి.దీపక్‌రెడ్డి బోగస్‌ డాక్యుమెంట్లు రూపొందించి, సివిల్‌ సూట్‌ వేయడం ద్వారా తదుపరి చర్యలకు ఉప క్రమించారు. దీంతో ఎంవీఎస్‌ చౌదరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. షేక్‌పేట్‌ మండల రెవెన్యూ అధికారులు విచారించి ఆ స్థలం ఎంవీఎస్‌ చౌదరిదని తేల్చారు. దీంతో చౌదరి తరపు ప్రతినిధి, మాదాపూర్‌కు చెందిన ఎం.రాధాకృష్ణ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

బదులు చెప్పలేక నీళ్లు నమిలిన దీపక్‌
సీసీఎస్‌ పోలీసులు దీపక్‌రెడ్డిని శనివారం విచారించగా.. ఆ స్థలానికి, తనకు సంబం ధం లేదన్నారు. అయితే, పోలీసులు ఎన్నికల అఫిడవిట్‌లో ఈ స్థలం వివరాలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. దీంతో దీపక్‌రెడ్డి బదులు చెప్పలేక నీళ్లు నమిలినట్లు తెలిసింది.

నిందితుడిపై చర్యలు తీసుకుంటాం
ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న మాదాపూర్‌ వాసి ఎం.రాధాకృష్ణమూర్తిని దీపక్‌రెడ్డి బెదిరించారు. శనివారం ఉదయం 7.10 గంటలకు మూర్తి ఇంటికి వెళ్లిన దీపక్‌రెడ్డి దాదాపు 45 నిమిషాలపాటు అక్కడే ఉండి, తనపై కేసును ఉపసంహ రించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే తనకున్న  అనంతపురంలో మూర్తిపై తప్పు డు కేసులు నమోదు చేయిస్తానంటూ హెచ్చరించారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు మేరకు దీపక్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ కళింగ్‌రావ్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement