
భర్త బోండా ఉమా మహేశ్వరరావుతో బోండా సుజాత(ఫేస్‌బుక్ నుంచి తీసుకున్న ఫొటో)
సాక్షి, అమరావతి : విజయవాడ స్వతంత్ర సమర యోధుడి భూమి కబ్జా కేసులో ఎమ్మెల్యే బోండా ఉమ సతీమణి సుజాత హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు 8వారాల స్టే విధించింది. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో బోండా సుజాత ఏ-8 ముద్దాయిగా ఉన్నారు.
1951లో సూర్యనారాయణ అనే స్వాతంత్య్రసమరయోధుడికి ప్రభుత్వం పదెకరాల స్థలాన్ని కేటాయించింది. 2016లో నకిలీ పత్రాలు సృష్టించి బోండా ఉమ కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ మనువడు సురేష్ 2017, ఫిబ్రవరి 10న విజయవాడ సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సురేష్ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. దాంతో మొత్తం ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూబాగోతం వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment