Bonda umamahesvara Rao
-
చంద్రబాబు, బొండా ఉమకు 'మహిళా కమిషన్' సమన్లు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీనేత బొండా ఉమకు రాష్ట్ర మహిళా కమిషన్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరవపరచడం.. బాధితురాలి ఆవేదన విననీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అత్యాచార బాధితురాలిని భయకంపితం చేసిన సంఘటనలపై విచారణకు చంద్రబాబు, బొండా ఉమ వ్యక్తిగతంగా హాజరుకావాలని మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈనెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమ స్వయంగా విచారణకు కావాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సమన్లలో ఆదేశించారు. -
టీడీపీ నేత బోండా ఉమాపై డీఎస్పీ ఫైర్
-
‘బోండా ఉమా ఆరోపణలు నిజం కాదు’
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వర రావు తీరుపై సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పోలీసు వ్యవస్థపై బోండా ఉమా చేస్తున్న ఆరోపణలు నిజం కాదన్నారు. మాచర్ల ఘటనపై విచారించేందుకు బోండా ఉమాకు గురజాల డీఎస్పీ నోటీసులు పంపించారని తెలిపారు. విచారణకు రాకుండా తనను చంపడానికి నోటీసు ఇచ్చారనడం ఏంటని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఒక భయానక వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహించారు. (‘మీపై కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం’) గురజాలలో నమ్మకం లేనప్పుడు పైఅధికారి దగ్గరికి వెళ్లి వాంగ్మూలం ఇవ్వచ్చు కదా అని అన్నారు. అలా కాకుండా గుంటూరు పోలీసులు నిద్రావస్థలో ఉన్నారనటం సరికాదనన్నారు. ఇక మీదట ఎవరైనాసరే పోలీసు వ్యవస్థను కించపరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ విజయభాస్కరరెడ్డి అన్నారు. -
కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారు : పిన్నెల్లి
సాక్షి, గుంటూరు(మాచర్ల): పల్నాడులో ప్రశాంత పరిస్థితులను చెడగొట్టేందుకు టీడీపీ యత్నిస్తోందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విజయవాడ నుంచి 10 కార్లలో టీడీపీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నతో పాటు మరికొందరు గూండాలను చంద్రబాబు పంపించారన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ.. మాచర్లలో దూసుకొచ్చిన టీడీపీ వాహనాల్లో ఒకటి ఓ పిల్లాడికి తగిలిందని, దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారని తెలిపారు. వారిని సముదాయించాల్సింది పోయి బోండా సహా ఇతర టీడీపీ నాయకులు దుర్భాషలాడారని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే టీడీపీ పథకమని, అందులో భాగంగానే పది కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారని తెలిపారు. ప్రజాబలం లేని చంద్రబాబు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, ఆ ఘటనలను తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అన్నారు. ఇదే పల్నాడులో 2014 స్థానిక ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు అంబటి రాంబాబు, ముస్తాఫాలపై దాడులు చేసి చంపడానికి యత్నించారని గుర్తు చేశారు. మొన్నటికి మొన్న రైతుల ముసుగులో తనను హత్య చేయడానికి ప్రయత్నించారని, అయినా తాము సంయమనంతో వ్యవహరించామని తెలిపారు. -
నువ్వు ఎవడ్రా చెప్పడానికి.. బోండా ఉమ దౌర్జన్యం
-
‘చింతమనేని’ ఇంటికని వెళ్లి యువతుల అదృశ్యం
సాక్షి, గుణదల (విజయవాడ తూర్పు) : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తమకు సహాయం చేస్తాడంటూ వెళ్లిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. వారం రోజులైనా వారి ఆచూకీ తెలియకపోవడంతో విషయం నగరవ్యాప్తంగా సంచలనమైంది. బాధితురాలైన తల్లి కోట జ్యోతి తెలిపిన వివరాల మేరకు.. గుణదల గంగిరెద్దుల దిబ్బకొండ ప్రాంతానికి చెందిన కోట జ్యోతి కొన్ని నెలలుగా ఇక్కడి ఓ ఇంట్లో తన ఇద్దరి పిల్లలతో నివాసం ఉంటోంది. భర్త కోట రాము(42) పదేళ్ల క్రితమే మనస్పర్థల కారణంగా కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయాడు. పెద్ద కుమార్తె కోట గాయత్రి (19) ఎనికేపాడులోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిప్లమో మూడో సంవత్సరం చదువుతోంది. రెండవ కుమార్తె కోట సోనియా (18) గూడవల్లిలోని మరో ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. జ్యోతి కూలి పని చేసుకుని పిల్లల్ని చదివిస్తుంది. కొంతకాలంగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న తల్లికి సాయం చేసే దిశగా వీరిద్దరూ పనులకు వెళుతున్నారు. ఈ యువతుల బంధువులు పశ్చిమగోదావరి జిల్లా నడిపల్లిలో ఉండటంతో వారి సహాయంతో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిసి తమ గోడును చెప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 4న ఉదయం 10 గంటలకు బయలుదేరి వెళ్లిన యువతులు ఇప్పటి వరకూ తిరిరాలేదు. బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో ఎంత ఆరా తీసినా వారి ఆచూకీ తెలియలేదు. దీంతో జ్యోతి ఆదివారం రాత్రి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బొండా ఉమ అనుచరులపై అనుమానం.. గతేడాదిలో ఈ కుటుంబం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్‌నగర్ ప్రాంతంలో ఉండేది. ఆ సమయంలో తమ పరిస్థితి చెప్పుకునే నిమిత్తం ఇద్దరు యువతులు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును కలిశారు. అదే సమయంలో కొంత మంది అనుచరులు చిన్న కుమార్తె సోనియాపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. గతేడాది జూలైలో జరిగిన ఈ ఘటనలో నిందితులు ప్రస్తుతం బెయిల్‌పై విడుదలై నగరంలో తిరుగుతున్నారు. ఈ యువతులపై కక్ష సాధింపు చర్యగా కిడ్నాప్ చేసి ఉంటారని తల్లి జ్యోతి అనుమానం వ్యక్తం చేస్తోంది. పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
బొండాపై కేసు నమోదు చేయాలి
హైకోర్టు ఆదేశాల మేరకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై ఈనెల 25వ తేదీలోగా పోలీసులు కేసు నమోదు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): హైకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై ఈనెల 25వ తేదీలోగా పోలీసులు కేసు నమోదు చేయాలని రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో అన్ని రాజకీయపార్టీలతో కలిసి ప్రత్యక్ష ఆందోళన చేపట్టాలని సమావేశం తీర్మానించింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో భూ కబ్జాల నివారణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో నగరంలో భూ కబ్జాలు పెరిగాయన్నారు. అధికారపార్టీ నేతలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. భూ కబ్జాదారులను ప్రభుత్వం సమర్థిస్తోందన్నారు. శంకర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుని భూమి కబ్జా చేసిన విషయంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాతోపాటు మరికొంతమందిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఎమ్మెల్యేలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే ఉమా నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బొండా ఉమా భూ కబ్జాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర సమరయోధుని భూమి కబ్జా విషయంలో ఎమ్మెల్యేను నిందితునిగా చేర్చాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేను టీడీపీ నాయకులు సమర్థిస్తూ తమకు తామే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే అధికార కబ్జాలకు పాల్పడుతుందన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా దురాగతాలపై తమ పోరాటం ఆగదన్నారు. సమావేశంలో న్యాయవాది సీహెచ్ రవీంద్రారెడ్డి, మాజీ డెప్యూటీ మేయర్ ఎస్పి గ్రిటన్, సీపీఐ నాయకులు లంకా దుర్గారావు, నక్కా వీరభద్రరావు, సీఐటీయూ నాయకులు కె.దుర్గారావు, సీపీఎం నాయకుడు దోనేపూడి కాశీనాథ్, మహిళా సమాఖ్య నాయకులు పంచదార్ల దుర్గాంబ, ఓర్సు భారతి, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్, యువజన సమాఖ్య, ప్రజానాట్య మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. -
బొండాగిరిలో రెవెన్యూ సిబ్బందికి ఉచ్చు
విజయవాడ: స్వాతంత్య్ర సమరయోధుని స్థలం కబ్జా వ్యవహారంలో బొండాగిరి ఒత్తిడికి తలొగ్గి చేసిన అవకతవకల్లో రెవెన్యూ సిబ్బంది మెడకు ఉచ్చుబిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అడంగల్స్ మార్పులో అధికార పార్టీ నేతల తీవ్ర ఒత్తిడి వల్ల రియల్ ఎస్టేట్ మాఫియా చెప్పినట్లు చేయటంతో రెవెన్యూ యంత్రాగం రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో తహసీల్దార్ గురువారం నుంచి సెలవుపై వెళ్లినట్లు సమాచారం. తొలుత నాలుగు రోజులు సెలవు పెట్టిన ఆయన సోమవారం నుంచి దీర్ఘకాలికంగా సెలవు పొడిగిస్తారని రెవెన్యూ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తన కుమార్తె అనారోగ్యం కారణంగా సెలవుపై వెళ్లినట్లు ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉండగా తహసీల్దార్ సెలవుపై వెళ్లడంతో అడంగల్స్‌లో పేర్లు మార్చిన కిందిస్థాయి సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ఈ వ్యవహారంలో సర్వేయర్, వీఆర్ఓ, వీఆర్ఏ, ఆర్ఐ, డిప్యూటీ తహసీల్దార్ భయంతో వణుకుతున్నారు. అడంగల్స్‌లో పేర్లు మార్చటం వల్లే బొండా అనుచరులు దొంగ రిజిస్ట్రేషన్లు చేయించేందుకు ఆస్కారం ఏర్పడిందని భావిస్తున్నారు. మ్యూటేషన్‌లో నిబంధనలకు పాతర మ్యూటేషన్ (అడంగల్‌లో పేర్లు మార్పు) చేసేటప్పుడు తాజా నిబంధనలు పరిగణలోకి తీసుకోలేదని వెల్లడైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దరఖాస్తులపై స్వాతంత్య్ర సమరయోధుని భూమికి సంబంధించి అడంగల్స్ మార్చటంలో నిబంధనలకు పాతరేసినట్లు విమర్శలు వస్తున్నాయి. 2016 వరకు స్వాతంత్య్ర సమరయోధుడు కేశిరెడ్డి సూర్యనారాయణ ఆయన కుటుంబసభ్యుల పేరుతో అడంగల్స్‌లో ఉన్నాయి. ఆర్ఎస్ నెం.7/2 లో ఎ1.00 సెంట్లు భూమి కేశిరెడ్డి సూర్యనారాయణ పేరుతో, ఆర్ఎస్ నెం. 6/1లో ఎ.1.50సెంట్లు కేశిరెడ్డి సూర్యారాయణ కోడలు జోగా రత్నం పేరుతో అడంగల్స్ ఉన్నాయి. ఈ భూమిని 2016లో కృష్ణలంకకు చెందిన రామిరెడ్డి కోటేశ్వరరావు పేరున రెవెన్యూ అధికారులు మార్చారు. 1988లో నకిలీ డాక్యుమెంటు ఆధారంగా రెవెన్యూ అధికారులు రామిరెడ్డి కోటేశ్వరరావు పేరున అడంగల్స్ మార్చారు. అడంగల్స్ మార్చిన తరువాత ఆ భూమిని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరుడు రియల్టర్ మాగంటి బాబుకు కోటేశ్వరరావు డవలప్మెంట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ భూమి తనది కాదని తనకు తెలియకుండా మాగంటి బాబు మోసం చేసి డవలప్మెంట్ అగ్రిమెంటు తాను రాసినట్లు రిజిస్ట్రేషన్ చేయించాడని సీఐడీ అదికారులకు చెప్పాడు. స్వాతంత్య్ర సమరయోధుని భూమికి సంబంధించి ఆర్ఎస్.నెం.32లో ఎ.1.50 సెంట్లు, ఆర్ఎస్.నెం40లో ఎ.1.70సెంట్లు అబ్దుల్ మస్తాన్ పేరుతో కేశిరెడ్డి సూర్యనారాయణకు చెందిన భూమిని అడంగల్స్లోకి మార్చారు. తాడిగడపకు చెందిన అబ్దుల్ మస్తాన్ 1988లో స్వాతంత్య్ర సమరయోధుని కుటుంబం నుంచి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు నకిలీ డాక్యుమెంట్ల సృష్టించారు. ఈ భూమిలో కొంత భాగం సెంట్రల్ ఎమ్మెల్యే భార్య బొండా సుజాత, వారి అనుచరుడు రియల్టర్ మాగంటి బాబులు డవలప్మెంట్ అగ్రిమెంటు రాయించుకున్నారు. సీఐడీ విచారణతో బొండా సుజాత ఆ అగ్రిమెంటును రద్దు చేసుకున్నారు. 1997 వరకు జీవో లేదు స్వాతంత్య్ర సమరయో«ధులకు కేటాయించిన భూమిని విక్రయించేందుకు 1997లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. 1997కు ముందు అటువంటి భూములు క్రయవిక్రయాలు జరపాలంటే జిల్లా కలెక్టర్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంది. బొండాగిరిలో 2016లో అడంగల్స్ పేర్లు మార్చేటప్పుడు కనీస నిబంధనలు పాటించకపోవటం గమనార్హం. మ్యూటేషన్ చేసేటప్పుడు అనుభవదారులుగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధుని కుటుంబసభ్యులను కనీసం విచారించలేదు. 1988 నకిలీ డాక్యుమెంటు ఆధారంగా పేర్లు మార్చారు. ఆ డాక్యుమెంట్లు ఎంత వరకు సరైనవో చూడకుండా అడంగల్స్ ఇష్టారాజ్యంగా మార్చటం రెవెన్యూ అధికారుల మెడకు ఉచ్చు పడింది. -
‘బొండా’గిరిలో కొత్తకోణం
విజయవాడ : బొండాగిరిలో కొత్త కోణం తెరపైకి తెచ్చారు. తాము అక్రమంగా చేజిక్కించుకున్న ఆస్తిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఎదురు కావటంతో బొండా అనుచరులు దాయాదుల మధ్య వైరం ఆసరాగా చేసుకొని పావులు కదుపుతున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబ కలహాలను సాకుగా తీసుకొని ఆ భూమిని ఖాళీ చేయకుండా పాగా వేసేందుకు బొండా అనుచరులు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఈ క్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు కేశిరెడ్డి సూర్యానారాయణ పెద్ద కుమారుడు కేశిరెడ్డి వెంకటేశ్వరరావు భార్య అప్పల నర్సమ్మను బొండా అనుచరుడు, రియల్టర్ మాగంటి బాబు విజయవాడ సబ్–కలెక్టర్ కార్యాలయానికి తీసుకొచ్చి మీడియాను పిలిచారు. ప్రభుత్వం ఇచ్చిన భూమి గాకుండా స్వాతంత్య్ర సమరయో«ధుని పూర్వార్జిత ఆస్తుల ద్వారా వచ్చిన భూమి 1.69 సెంట్లను గత ఏడాది ఏప్రిల్‌లో అప్పల నర్సమ్మ, మాగంటి బాబుకు విక్రయించింది. స్వాతంత్ర సమరయోధుడి కోటాలో వచ్చిన భూమిని బొండా అనుచరులు రకరకాలుగా నకిలీ డాక్యుమెంట్లతో స్వాధీనం చేసుకున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ వ్యవహారాలు సీఐడీ విచారణతో బహిర్గతమైంది. బొండా అనుచరులు తాము కొనుగోలు చేసినట్లు చెబుతున్న రామిరెడ్డి కోటేశ్వరరావు ఆ భూమికి తనకు సంబంధం లేదని, నకిలీ డాక్యుమెంట్లతో మాగంటి బాబు మోసగించాడని ప్రకటించారు. దీంతో బొండాగిరి బట్టబయలైంది. ఈ క్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబంలో దాయాదుల వైరాన్ని బొండా అనుచరలు తెరపైకి తెచ్చారు. ఎవరి భూమీ కబ్జా చేయలేదు : మాగంటి బబు తాను ఎవరి భూమి కబ్జా చేయలేదని రియల్టర్, బిల్డర్ మాగంటి బాబు స్పష్టం చేశారు. సబ్–కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ విచారణలో పూర్తి విషయాలు బయటకు వస్తాయన్నారు. తనది తప్పుని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు. సురేష్‌బాబు దొంగ కాగితాలతో రకరకాల ఫిర్యాదులు చేస్తున్నాడని ఆరోపించారు. నా మరిది కొడుకులు మోసం చేశారు: అప్పల నర్సమ్మ తన మరిది కుమారుడు కేశిరెడ్డి రామకృష్ణ కుమారులు కేశిరెడ్డి సురేష్‌బాబు, శ్రీనివాసరావు తనను మోసం చేశారని కేశిరెడ్డి సూర్యనారాయణ భార్య అప్పలనర్సమ్మ మీడియాకు చెప్పారు. సబ్–కలెక్టర్ కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ కేశిరెడ్డి సురేష్‌బాబు తన ఆస్తిని కాజేసేందుకు చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు. తన భర్త ద్వారా వచ్చిన పూర్వార్జిత ఆస్తిని కూడా తనను విక్రయించకుండా దొంగ డాక్యుమెంట్లతో అడ్డుపడ్డారని ఆరోపించారు. స్వాతంత్య్ర సమరయోధుడి కోటాలో వచ్చిన భూమిని కూడా తనకు దక్కకుండా సురేష్‌బాబు అతని కుటుంబసభ్యులు తప్పుడు డాక్యుమెంట్లతో స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మాగంటి బాబు ఎటువంటి మోసానికి పాల్పడలేదని వెల్లడించారు. -
భూకాయింపులేల ‘బోండా’
సాక్షి, అమరావతి బ్యూరో: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సూత్రధారిగా, పార్టీ నేత మాగంటి బాబు పాత్రధారిగా యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడ్డారని బాధితులు సాక్ష్యాధారాలతో సహా వెల్లడించారు. విజయవాడలో స్వాతంత్య్ర సమరయోధుడు కసిరెడ్డి సూర్యనారాయణ కుటుంబానికి చెందిన రూ.50 కోట్ల విలువైన భూమిని చిన్నా చితకా పనులు చేసుకునే రామిరెడ్డి కోటేశ్వరరావు, అబ్దుల్ మస్తాన్ పేరుతో ఎమ్మెల్యే బొండా భార్య సుజాత, మాగంటి బాబు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద సొంతం చేసుకోవటం తెలిసిందే. తీరా వ్యవహారం బయటపడ్డాక అసలు మాగంటి బాబు ఎవరో తనకు తెలియదని బొండా కొత్త పల్లవి అందుకున్నారు. నేనే బొండా సుజాత పేరిట రిజిస్ట్రేషన్ చేయించా : మాగంటి బాబు సోమవారం జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ ఎదుట విచారణకు హాజరైన అనంతరం మాగంటి బాబు మీడియాతో మాట్లాడుతూ 5.16 ఎకరాల్లో 1.50 ఎకరాలను తానే ఎమ్మెల్యే బొండా భార్య సుజాత పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు చెప్పడం గమనార్హం. మరికొంత భూమిని మాగంటి బాబు పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. అంటే స్వాతం త్య్ర సమరయోధుడి 5.16 ఎకరాలను ఎమ్మెల్యే బొండా కుటుంబం, మాగంటి బాబు కలిసే కాజేశారని స్పష్టమవుతోంది. బొండా అండతోనే భూదందాలు అజిత్‌సింగ్‌నగర్‌లో 21 మందికి చెందిన మరో రూ.15 కోట్ల విలువైన భూమిని మాగంటి బాబు తన ఆధీనంలో పెట్టుకున్నారు. పెనమలూరులో రూ.4 కోట్ల విలువైన 80 సెంట్ల స్థలం ఆ వర్గం ఆధీనంలోనే ఉంది. రాజరాజేశ్వరిపేటలో రూ.2.50 కోట్ల విలువైన 1,200 గజాల స్థలం ఆ వర్గం ఆక్రమణలోనే ఉంది. బొండా ఉమా అండతోనే మాగంటి బాబు అడ్డగోలుగా భూవ్యవహారాలు సాగిస్తున్నట్లు బోధపడుతోంది. అధికార యంత్రాంగం రక్షాకవచం ఎమ్మెల్యే బొండా ఉమా, మాగంటి బాబు జోడీ బరితెగించి భూబాగోతాలు సాగిస్తున్నా అధికార యంత్రాంగం కిమ్మనడం లేదు. రూ.50 కోట్ల విలువైన స్వాతంత్య్ర సమరయోధుడి భూమి కబ్జాపై కూడా అధికారుల తీరు సందేహాస్పదంగా ఉంది. అసలు ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసింది అధి కారులే. ఇప్పుడు విచారణ పేరుతో అధికారులే కథ నడిపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కలెక్టర్ సుమోటోగా స్వీకరించి జేసీ విజయ్కృష్ణన్తో పాటు మరో నలుగురు అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీకి అధికారిక గుర్తింపు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ‘బొండా’గిరిపై కొనసాగుతున్న విచారణ విజయవాడ: ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచురుల భూకబ్జాలపై కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఏర్పాటుచేసిన ఐదుగురు సభ్యుల అధికారుల కమిటీ విచారణ సోమవారం కొనసాగింది. జేసీ కార్యాలయంలో నిర్వహించిన విచారణలో కమిటీ సభ్యులు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేష్, జిల్లా రిజిస్ట్రార్ జి. శ్రీనివాస్ పాల్గొన్నారు. జేసీ విజయకృష్ణన్ ఇచ్చిన నోటీసుల ప్రకారం బొండా ఉమా భార్య సుజాత తరఫు న్యాయవాది.. కమిటీ సభ్యులకు లిఖితపూర్వకంగా తమ వాదనలు వినిపించారు. తాము స్వాతంత్య్రసమరయెధుడి భూమి అని తెలియక వేరొకరి నుంచి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయించుకున్నామని పేర్కొన్నారు. ఆ భూమి వివాదంలో ఉందని తెలుసుకుని అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నామని చెప్పారు. ఇప్పటికీ కబ్జాలోనే 5.16 ఎకరాలు రూ.50 కోట్ల విలువైన భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకున్నామని ఎమ్మెల్యే బొండా ఉమా చెబుతున్నారు. అయితే, ఇప్పటికీ ఆ భూమి స్వాతంత్య్ర సమరయోధుడు కసిరెడ్డి సూర్యనారాయణ కుటుంబం ఆధీనంలో లేదు. ఆయన కుటుంబ సభ్యులు అక్కడికి వెళితే టీడీపీ వర్గీయులు అడ్డుకుంటున్నారు. మరోవైపు మాగంటి బాబు ఆ భూమిని అబ్దుల్ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావు నుంచి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. చిన్నాచితకా పనులు చేసుకునే అబ్దుల్ మస్తాన్, కోటేశ్వరరావుకు అంత విలువైన భూమిని విక్రయించే స్థాయి ఉందా? అని ప్రశ్నిస్తే ఆ విషయం తనకు అనవసరమంటూ తప్పించుకుంటున్నారు. అప్పటిదాకా ఆ 5.16 ఎకరాలు తమ గుప్పిట్లోనే ఉంటాయని తేల్చి చెబుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. దీన్నిబట్టి మాగంటి బాబు, అధికారుల ద్వారా ఎమ్మెల్యే బొండా ఉమా కథ నడిపిస్తూ భూమి చేజారకుండా జాగ్రత్త పడుతున్నట్లు స్పష్టమవుతోంది. డెవలప్మెంట్ అగ్రిమెంట్‌పై భూమి స్వాధీనం అబ్డుల్ సత్తార్ నుంచి నేను 1.57 సెంట్ల భూమిని డెవలప్మెంట్ అగ్రిమెంట్‌పై స్వాధీనం చేసుకున్నాను. అబ్దుల్ సత్తార్ కనుక తనకు తప్పుడు కాగితాలతో భూమిని అగ్రిమెంట్ చేసినట్లు విచారణలో తేలితే భూమిని వదిలేస్తా. అబ్దుల్ సత్తార్‌పై న్యాయపోరాటం చేస్తా. నేను ఎవరి భూమిని కబ్జా చేయలేదు. స్వాతంత్య్ర సమరయోధుడి మనవడు సురేష్‌బాబే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించాడు. ఆధారాలు ఉన్నాయి. బొండా ఉమాతో నాకు వ్యాపార లావాదేవీలు లేవు. కేవలం పార్టీ సంబంధాలు ఉన్నాయి. బొండా సుజాతకు కొంత భూమిని డెవలప్మెంట్పై కొనుగోలు చేయించాను. వివాదంలో ఉందని తెలుసుకుని ఆమె ఆ డీల్‌ను రద్దు చేసుకున్నారు. – మాగంటి బాబు, రియల్టర్, బొండా ఉమా అనుచరుడు నాపై అన్నీ తప్పుడు ఆరోపణలు నాపై రామిరెడ్డి కోటేశ్వరరావు, ఆయన కుమారుడు సురేంద్ర తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నాకు రియల్ ఎస్టేట్ లావాదేవీలు లేవు. కోటేశ్వరరావు కుమారుడు సురేంద్ర, నేను చిన్ననాటి నుంచి చదువుకున్నాం. ఆ పరిచయంతో నా పార్టీ ఆఫీసులో కొంతకాలం పనిచేశాడు. గత ఏడాది ఇళ్లు తనఖా పెట్టించి కొంత డబ్బు అప్పు ఇవ్వమని అడిగాడు. అందుకు నేను అంగీకరించలేదు. అందుకు నాపై కక్షతో మాట్లాడుతున్నారు. మాగంటి బాబుతో నాకు పార్టీ సంబంధాలు తప్ప వ్యాపార లావాదేవీలు లేవు. నేను ఎవరినీ మోసగించలేదు. – దండూరి మహేష్, టీడీపీ కార్పొరేటర్ మాకు సంబంధం లేదు స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని కబ్జా చేసిన మాగంటి బాబుతో మాకు సంబంధమే లేదు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వాన్ని కోరతా.. – టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా నాపై అన్నీ తప్పుడు ఆరోపణలు నాపై రామిరెడ్డి కోటేశ్వరరావు, ఆయన కుమారుడు సురేంద్ర తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నాకు రియల్ ఎస్టేట్ లావాదేవీలు లేవు. కోటేశ్వరరావు కుమారుడు సురేంద్ర, నేను చిన్ననాటి నుంచి చదువుకున్నాం. ఆ పరిచయంతో నా పార్టీ ఆఫీసులో కొంతకాలం పనిచేశాడు. గత ఏడాది ఇళ్లు తనఖా పెట్టించి కొంత డబ్బు అప్పు ఇవ్వమని అడిగాడు. అందుకు నేను అంగీకరించలేదు. అందుకు నాపై కక్షతో మాట్లాడుతున్నారు. మాగంటి బాబుతో నాకు పార్టీ సంబంధాలు తప్ప వ్యాపార లావాదేవీలు లేవు. నేను ఎవరినీ మోసగించలేదు. – దండూరి మహేష్, టీడీపీ కార్పొరేటర్ న్యాయం గెలుస్తుందనుకుంటున్నా.. రెండు, మూడు నెలల్లో మోసం బయటపడి న్యాయం గెలుస్తుంది. మాగంటి బాబు తదితరులు ఫోర్జరీ సంతకాల గుట్టురట్టవుతుంది. అధికారుల విచారణలో రెండు మూడు నెలల్లో పూర్తి విషయాలు వెల్లడవుతాయి. ఇప్పటికే వారికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇచ్చినట్లు చెబుతున్న రామిరెడ్డి కోటేశ్వరరావు నేను అగ్రిమెంట్ చేయలేదని లిఖిత పూర్వకంగా ఇచ్చారు. మాగంటి బాబు, బొండా సుజాత మా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు కోటేశ్వరరావు పూర్తి ఆధారాలతో విచారణాధికారులకు వివరించారు. తప్పు కప్పి పుచ్చుకునేందుకు మాగంటి బాబు, ఎమ్మెల్యే బొండా ఉమా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. – కేసిరెడ్డి సురేష్‌బాబు, స్వాతంత్య్ర సమరయోధుడి మనవడు -
బోండా ఉమా భార్యకు నోటీసులు
సాక్షి, విజయవాడ : భూకబ్జా ఆరోపణల కేసులో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు భార్య సుజాతకు ఆర్డీవో నోటీసులు జారీ చేశారు. ఆమెతో పాటు ఆయన అనుచరుడు మాగంటి బాబుకు కూడా నోటీసులిచ్చారు. బాధితుడు కేసిరెడ్డి సురేష్ బాబు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఆర్డీవో అధికారులు సోమవారం సబ్‌కలెక్టర్‌కు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. నేడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీవో విచారణ చేపట్టనున్నారు. 1951లో సూర్యనారాయణ అనే స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రభుత్వం పదెకరాల స్థలాన్ని కేటాయించింది. 2016లో నకిలీ పత్రాలు సృష్టించి బోండా ఉమ కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ మనువడు సురేష్ 2017, ఫిబ్రవరి 10న విజయవాడ సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సురేష్ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. సీఐడీ అధికారుల దర్యాప్తులో ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూబాగోతం వెలుగులోకి వచ్చింది. మరోవైపు తనపై నమోదు అయిన కేసులు కొట్టివేయాలంటూ బోండా ఉమ సతీమణి సుజాత హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు 8వారాల స్టే విధించింది. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో బోండా సుజాత ఏ-8 ముద్దాయిగా ఉన్నారు. -
భూకబ్జా కేసులో హైకోర్టుకు బోండా సతీమణి
సాక్షి, అమరావతి : విజయవాడ స్వతంత్ర సమర యోధుడి భూమి కబ్జా కేసులో ఎమ్మెల్యే బోండా ఉమ సతీమణి సుజాత హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు 8వారాల స్టే విధించింది. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో బోండా సుజాత ఏ-8 ముద్దాయిగా ఉన్నారు. 1951లో సూర్యనారాయణ అనే స్వాతంత్య్రసమరయోధుడికి ప్రభుత్వం పదెకరాల స్థలాన్ని కేటాయించింది. 2016లో నకిలీ పత్రాలు సృష్టించి బోండా ఉమ కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ మనువడు సురేష్ 2017, ఫిబ్రవరి 10న విజయవాడ సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సురేష్ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. దాంతో మొత్తం ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూబాగోతం వెలుగులోకి వచ్చింది. -
‘కోర్టు చెప్పినా.. రోజాను రానివ్వం’
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు యథాతథంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. స్పీకర్ తీర్పులో జోక్యం చేసుకునే అధికారమే న్యాయవ్యవస్థలకు లేదని వారన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ, అవసరమైతే రూల్స్‌ను కూడా మార్చే అధికారం తమకు ఉందని, దాన్ని కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. గతంలో లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ కొంత మంది ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు, న్యాయస్థానం అభ్యంతరం చెప్పిందని, ఆ సందర్భంగా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, దీనిపై చర్చించారని తెలిపారు. రోజా విషయంలో కోర్టు తీర్పు ఇచ్చినా సభలో చర్చించిన తర్వాత ఆమె వ్యవహారంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వాళ్ళు ధర్నాలు చేసినా న్యాయం జరగదు రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆందోళనలు చేసినా ఎంతమాత్రం న్యాయం జరగదని టీడీపీ ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వరరావు అన్నారు. రోజాను చూస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారని, ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయస్థానం రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని మాత్రమే ఆదేశించిందని, ఆమెను అసెంబ్లీలోకి అనుమతించమని ఎక్కడ చెప్పలేదని వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీలో దీనిపై చర్చించి, ఓ నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అది మా ఏకగ్రీవ నిర్ణయం రోజాను సస్పెండ్ చేయాలన్నది శాసనసభ ఏకగ్రీవ నిర్ణయమని, న్యాయస్థానం సస్పెన్షన్ ఎత్తివేయమని ఆదేశించినా, దీనికి అసెంబ్లీ ఒప్పుకోవాల్సి ఉంటుందని అధికార పార్టీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చెప్పారు. దేశంలో ఇలాగే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన దాఖలాలున్నాయని చెప్పిన ఆయన... ఎథిక్స్ కమిటీ నిర్ణయం లేకుండానే జరిగిందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. కారణాలు ఏవైనా రోజా విషయంలో సభలో చర్చించాల్సిందే అన్నారు.