తీగలాగితే డొంక కదిలినట్లు.. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఓ చిరుద్యోగి ఇంట్లో సోదాలు చేస్తే మాజీ మంత్రి బొజ్జల అనుచరుల అక్రమాల పర్వం వెలుగుచూసింది. రాజీవ్‌నగర్‌లో నిరుపేదలకు కేటాయించిన స్థలాలను ఇష్టారాజ్యంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్న వైనం పట్టణ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో పురపాలక ఉద్యోగి అల్లూరయ్యను అడ్డుపెట్టుకుని కొందరు టీడీపీ నాయకులు యథేచ్ఛగా ప్లాట్లు విక్రయించేశారనే విషయం తెలియడంతో లబి్ధదారులు లబోదిబోమంటున్నారు. మాయమాటలు చెప్పి తమ పట్టాలు తీసుకుని ఫోర్జరీ సంతకాలతో తెగనమ్మేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా మరికొందరు పచ్చనేతలు అందినకాడికి స్థలాలను ఆక్రమించుకున్నట్లు ఆరోపిస్తున్నారు.
శ్రీకాళహస్తిలో దివంగత నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గంలో మంచి డిమాండ్ ఉన్న రాజీవ్ నగర్ కాలనీలోని ప్లాట్లను బొజ్జల అనుచరులు ఒక్కొక్కటిగా అమ్ముకుని సొమ్ముచేసుకున్నారు. అసలైన లబ్ధిదారుల సంతకాలను ఫోర్జరీ చేసి విక్రయించుకుంటున్నారు. మంగళవారం రాత్రి శ్రీకాళహస్తిలో అల్లూరయ్య అనే మున్సిల్ ఉద్యోగి నివాసంలో అధికారులు చేపట్టిన సోదాలో బయటపడ్డ పట్టాలే ఇందుకు నిదర్శనం.
సాక్షి, తిరుపతి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాజీవ్‌నగర్ కాలనీ పేరుతో ఇల్లులేని పేదలకు గూడు కల్పించాలని నిర్ణయించారు. శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గంలో అందుకు అవసరమైన భూములను సేకరించారు. సుమారు 6వేల మంది పేదలకు రెండు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. పక్కాగృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో రాజీవ్ నగర్ అభివృద్ధి అటకెక్కింది. తర్వాత ప్రభుత్వాలు రోడ్లు, తాగునీరు తదితర మౌలిక కలి్పంచకపోవటంతో అక్కడ ఇల్లు కట్టుకునేందుకు లబి్ధదారులు సైతం పెద్దగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో హౌసింగ్‌శాఖలో కాంట్రాక్టు కింద పనిచేస్తున్న అల్లూరయ్య మాయమాటలు చెప్పి లబి్ధదారుల పట్టాలను తీసిపెట్టుకున్నాడు. అరాకొర ధరలకే కొన్ని ప్లాట్లను అమ్ముకుని జేబులో వేసుకున్నాడు. ఈ విషయం అప్పట్లోనే బయటపడడంతో నాటి ప్రభుత్వం వెంటనే అల్లూరయ్యను ఉద్యోగం నుంచి తొలగించింది.
టీడీపీ హయాంలో రెచ్చిపోయి..
టీడీపీ ప్రభుత్వంలో అల్లూరయ్య శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. తొలుత అటెండర్‌గా చేరి అవినీతి పర్వానికి తెరతీశాడు. ఆ సమయంలోనే 30 మంది మున్సిపల్ ఉద్యోగుల పీఎఫ్ సొమ్మును కాజేశాడనే ఆరోపణలతో సస్పెండయ్యాడు. అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేత సతీమణికి రూ.20లక్షలు ముట్టజెప్పి, 2018లో అదే కార్యాలయంలో జూనియర్ అసిప్టెంట్‌గా ఉద్యోగం పొందాడు. ఇక అప్పటి నుంచి మున్సిపల్ ఆఫీస్‌లో అల్లూరయ్య ఆడింది ఆట.. పాడింది పాటగా మారిపోయింది. అదే సమయంలో అల్లూరయ్య వద్ద ఉన్న ఇంటి పట్టాల విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బొజ్జల అనుచరులు నలుగురు రంగంలోకి దిగారు. లబి్ధదారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.100 డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్నారు. దొరికిన స్థలాలను దొరికినట్లు ఇష్టారాజ్యంగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారు.
వందలాది పట్టాలు వెలుగులోకి..
రాజీవన్‌నగర్‌లో నాడు రూ.30వేలు ఉన్న ఇంటి స్థలం.. నేడు రూ.5లక్షలకు చేరడంతో అల్లూరయ్య దగ్గర ఉన్న పట్టాలను టీడీపీ నేతలు బయటకు తీయించారు. తాము ఇది వరకే సిద్ధం చేసుకున్న రూ.100 డాక్యుమెంట్‌లను చూపించి కొనుగోలుదారులను బురిడీ కొట్టించడం ప్రారంభించారు. తమకు నగదు అవసరమని, అందుకే రూ.5లక్షల ప్లాటుని రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకే ఇచ్చేస్తున్నామని ప్రచారం చేపట్టారు. ఆ ప్రాంతంలో పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే ప్లాటు వస్తుందని స్థానికులు పెద్దసంఖ్యలో కొనుగోలు చేశారు. ఇలా సుమారు వెయ్యి ప్లాట్ల వరకు విక్రయించినట్లు తెలిసింది. ఇవి కాకుండా అల్లూరయ్య ఇంట్లో అధికారులు జరిపిన సోదాల్లో మరో 2,309 పట్టాలు దొరకడం గమనార్హం. టీడీపీలోని నలుగురు నేతలు, అల్లూరయ్య చేస్తున్న అక్రమాలను తెలుసుకున్న మరికొందరు ఆ పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కరు 5 నుంచి 10 ప్లాట్ల వరకు ఆక్రమించుకున్నట్లు సమాచారం.
భాగోతం బట్టబయలు!
రాజీవ్‌నగర్‌లో ఇంటి స్థలాలకు రేటు పలకుతుండడంతో అల్లూరయ్య దగ్గర పట్టాలు ఇచ్చిన లబి్ధదారుల్లో కదలిక వచ్చింది. తమ పట్టాలను వెంటనే ఇవ్వాలని అల్లూరయ్యను కోరారు. అయితే తన వద్ద ఎలాంటి పట్టాలు లేవని తెగేసి చెప్పడంతో ఖంగుతిన్నారు. ఈ విషయాన్ని వెంటనే ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి విచారణకు ఆదేశించడంతో బొజ్జల అనుచరుల భాగోతం బట్టబయలైంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పెరిగిన డిమాండ్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గం అభివృద్ధి పథంలో పయనించింది. అక్కడ జగనన్న కాలనీ పేరుతో 2 వేల మందికి పైగా పక్కాఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. లే అవుట్‌ని సుందరంగా తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సైతం ఆ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నవరత్నాల ఆలయాన్ని నిర్మించారు. జగన్న కాలనీకి ఎదురుగానే ఉన్న రాజీవ్‌నగర్‌కి పైన కొండచుట్టు కోసం ‘దేవుడి బాట’ పేరుతో 20 కిలోమీటర్ల రహదారి ఏర్పాటు చేశారు. కాలనీకి పకడ్బందీగా నీటి సౌకర్యం కలి్పంచారు. దీంతో రాజీవ్‌నగర్ కాలనీలోని ప్లాట్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment