గీతం వర్సిటీలో హైదరాబాద్ విద్యార్థిని ఆత్మహత్య | hyderabad student shravya commits suicide in vizag gitam university | Sakshi
Sakshi News home page

గీతం వర్సిటీలో హైదరాబాద్ విద్యార్థిని ఆత్మహత్య

Published Fri, Feb 12 2016 9:35 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

గీతం వర్సిటీలో హైదరాబాద్ విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

గీతం వర్సిటీలో హైదరాబాద్ విద్యార్థిని ఆత్మహత్య

విశాఖపట్నం: విద్యాలయం సాక్షిగా మరో చదువుల తల్లి ప్రాణాలు విడిచింది. విశాఖపట్నం రుషికొండ ప్రాంతంలోని గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్(ఐటీ) మూడోసంవత్సరం విద్యార్థిని శ్రావ్య శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ కు చెందిన శ్రావ్య హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోవడాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు యాజమాన్యానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు.

గీతం వర్సిటీ టీడీపీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడిది కావడంతో విద్యార్థిని ఆత్మహత్యపై పోలీసులు ఆచితూచి స్పందిస్తున్నారు. సమాచారం సేకరించేందుకు వర్సిటీకి వెళ్లిన విలేకరులను లోనికి అనుమతించకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ మెడిసిన్ విద్యార్థి ఒకరు వర్సిటీ హాస్టల్ లోనే ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement